ఐదేళ్లలో ఐటీరంగంలో 5లక్షల ఉద్యోగాలు

* ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి
హైదరాబాద్‌: వచ్చే ఐదేళ్లలో ఐటీరంగంలో 5లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆగ‌స్టు 26న‌ ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ... ప్రతి ఇంట్లో ఒకరిని ఐటీలో నైపుణ్యం ఉన్న వ్యక్తిగా తయారు చేయాలన్నారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. చిన్న కంపెనీలకు సైతం పెద్ద ఎత్తున పన్ను రాయితీలు ఇస్తామన్నారు. చిన్న కంపెనీలకు విద్యుత్‌లో 25శాతం రాయితీ కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్‌ రంగాలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఇ-టెక్నాలజీ అభివృద్ధి చేసి ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు కృషి చేస్తామన్నారు. కాకినాడలో హార్డ్‌వేర్‌ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. పరిమితులు మంజూరు చేయడంలో జాప్యం ఉండదని ఆయన పేర్కొన్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning