అక్కడ చదివితే కొలువులే.. కొలువులు..!

* ఈ ఏడాది 14.5లక్షల వార్షిక వేతనానికి ఇద్దరు ఎంపిక
* జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభ

జేఎన్‌టీయూ, హైదరాబాద్: అక్కడి విద్యార్థులంతా ఎంసెట్ టాపర్లే.. కాని ఇంటర్ వరకు అభ్యసించిన చదువుకు .. ఇంజినీరింగ్ విద్య పూర్తి భిన్నంగా ఉంటుందని కళాశాలల్లో చేరే రోజునే విద్యార్థులకు ఆచార్యులు చేసే తొలి సూచన. అవేమి కాదంటూ బీటెక్‌లో చేరిన వారంతా గతంలో సాధించిన మార్కుల ఒరవడినే సాంకేతిక విద్యలోనూ రాణించి ఏడాది ముందుగానే ప్రాంగణ నియామకాల్లో కొలువులు సాధించారు. చదువుతూనే ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏకంగా రూ.14.5లక్షల వార్షిక వేతనం అందుకునే కొలువులు సొంతం చేసుకున్నారు. ఇదీ హైదరాబాద్ కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెగ్యులర్, ఐడీపీ కోర్సులు చేసిన విద్యార్థుల మేము ఉద్యోగాలు సాధించామని సంతోషంగా చెబుతున్నారు. అక్కడి ఆచార్యులు మా విద్యార్థులు మంచి కంపెనీల్లో కొలువులు సాధించి కళాశాల ఖ్యాతిని మరింత పెంచారని గర్వంగా చెప్పుకుంటున్నారు. తదనుగుణంగా సాంకేతికతను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ ఆ దిశగా కొత్తగా బీటెక్‌లో చేరిన విద్యార్థులను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఒకటి కాకపోతే.. మరొకటి..
అక్కడి విద్యార్థుల ప్రతిభను బట్టి ఒక కంపెనీ కాకపోతే.. మరో దాన్ని తీసుకొచ్చి ప్రాంగణ నియామకాల్లో అత్యధిక వార్షిక ప్యాకేజీలు అందుకునేలా ఇక్కడి ఆచార్యులు కృషి చేస్తున్నారు. ప్రాంగణ నియామకాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కొలువుల జాబితాలో విద్యార్థులు చోటు దక్కించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒకటి, రెండు అంతకంటే ఎక్కువ కంపెనీలు పెట్టే రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని ఏ కంపెనీ ఎక్కువ వేతనం, ఇతరత్రా సౌకర్యాలు, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందో చూసుకొని అందులో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. గతేడాది కూడా ఉన్నత చదువు, స్వయం ఉపాధికి వెళ్లిన వారినే పక్కన పెడితే మిగతా వారందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని కళాశాల ప్లేస్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ డా.జ్యోతుల సురేష్‌కుమార్ తెలిపారు. ఇక్కడ ఇంటర్వ్యూలు జరిగి కళాశాల చదువు పూర్తయిన తర్వాత గతేడాది ముగ్గురు విద్యార్థులు 13.5లక్షల వార్షిక వేతనానికి ఎంపికైనట్లు పేర్కొన్నారు.
* నాన్నే నాకు స్ఫూర్తి..
మా నాన్న ఎన్.కాలి ప్రసాద్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో ఉద్యోగి. నాన్నను స్ఫూర్తిగా ఇంటర్ నుంచి పక్కా ప్రణాళికతో చదివా. అదే నాకు ఇంటర్‌లో 959 మార్కులు, ఎంసెట్‌లో 341 ర్యాంకు, బీటెక్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యానాటికి అకడమిక్ పరంగా 77 శాతం ఉత్తీర్ణత శాతం ఉంది. 2015 జులై 1న కామ్‌వాల్యుట్ సిస్టమ్స్‌లో చేరమని జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఏడాదికి 14.5లక్షల వార్షిక వేతనం ఇస్తామని కూడా చెప్పారు. ప్రత్యేకంగా అంటూ చదవక పోయినా ఎప్పుడు చెప్పిన పాఠం అప్పుడు చదువుకొని సందేహాలను నివృత్తి చేసుకున్నా. అమ్మ పార్వతి వెన్నంటి ప్రోత్సహిస్తూ ఉంటుంది.
- నేరెళ్ల శ్రీలత, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఓల్డ్ బోయిన్‌పల్లి.
* ఉద్యోగం విలువేంటో తెలుసు..
మాది పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు .. మా నాన్న కె.ప్రభాకర్‌రావు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరి ప్రధానోపాధ్యాయుడిగా.. ప్రస్తుతం సామవరపుకోట మండలం ఎంఈవోగా పనిచేస్తున్నాడు. ఇలా ఒక్కోమెట్టు ఉద్యోగంలో రాణిస్తూ ఉండటాన్ని గమనించా. నీవు సాధించాలి అంటూ అమ్మ ధనలక్ష్మి అంటుండేది. ఐడీపీ (బీటెక్ ప్లస్ ఎంటెక్)లో చేరా. ఇంటర్‌లో 961 మార్కులు, ఎంసెట్‌లో 1289 ర్యాంకు సాధించి ఐదేళ్లలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేసే కోర్సులో చేరా. కొలువుకు ఎంపికయ్యే నాటిని అకడమిక్ పరంగా 82.3 శాతం ఉంది. యేడాదికి రూ.14.5లక్షల వేతనానికి ఎంపికచేస్తున్నాం. డిసెంబర్ లేదా జనవరిలో కామ్‌వాల్యూట్ సిస్టమ్స్ వారు ఇంటర్న్‌షిప్‌కు మా కంపెనీలో చేరాలని కామ్‌వాల్యుట్ సిస్టమ్స్ ప్రతినిధుల నుంచి పిలుపు వచ్చింది.
- కాసపు విశ్వతేజ, ఐడీపీ, మంజీరా హాస్టల్, జేఎన్‌టీయూ.
* అన్నయ్యే నాకు స్ఫూర్తి..
మా అన్నయ్య వై.ప్రవీణ్‌కుమార్ రెండేళ్ల క్రితం ఓయూలో ఇంజినీరింగ్ చదివారు. అప్పటి ఆ పుస్తకాలను అప్పుడప్పుడు చదువుతుండే దాన్ని అలా రోజురోజుకు ఈఈఈ బ్రాంచిపై మక్కువ పెంచుకున్నా. అన్నయ్య ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. మా అమ్మా..నాన్న జ్యోతి, వై.ఎస్.వి.సాగర్ మమ్మల్ని ఎంతోగానే ప్రేమిస్తారు. ఉన్నత స్థానాల్లో మమ్మల్ని చూడాలని కలలు కనేవారు. ఒరాకిల్ సంస్థలో రూ.7.5లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యా. మా కళాశాల ఆచార్యుల కృషి మరిచిపోలేదని చెప్పాలి. ఏ సందేహం వచ్చినా వెంటనే నివృత్తిచేస్తూ మమ్మల్ని కళాశాల నుంచి ఉద్యోగానికి ఎంపికయ్యేలా కృషి చేశారు.
- మౌనిక యెడ్లపల్లి, ఈఈఈ, మినిస్టర్ రోడ్డు, సికింద్రాబాద్.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning