కొలువులకు వేళాయె!

* ప్రాంగణ నియామకాలు షురూ
* ఆశల పల్లకిలో విద్యార్థులు
* విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సందడి...చర్చ

ఈనాడు, హైదరాబాద్‌(జేఎన్‌టీయూ): విద్యార్థులందరూ వేచిచూసే సమయం వచ్చింది...విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. ఒక్కో కంపెనీ రాక ప్రారంభమైంది. ఉద్యోగాలకు ఎంపికైన వారిని సహచర విద్యార్థులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దృష్టే కాదు...ఆచార్యులలోనూ ప్రాంగణ నియామకాలపై ఉత్కంఠ నెలకొంది.
ఏ కంపెనీ వచ్చింది... ఎంత ప్యాకేజీ ఆఫర్‌ చేసింది.. ఎంత మందిని తీసుకుంటున్నాయి.. అత్యధిక వేతనం ఎంత?.. ఈ ఏడాది నియామకాలు పెరుగుతాయా? విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఎవరిని కదిలించినా ఇదే చర్చ. అవును... ప్రాంగణ నియామకాల ప్రారంభంతో విద్యాసంస్థల్లో హడావుడి మొదలైంది. మొదట ఆయా కంపెనీలు ప్రతిష్ఠాత్మక, పేరు పొందిన కళాశాలలను ఎంచుకొని ప్రాంగణ నియామకాలు వాటిల్లో ప్రారంభిస్తాయి. అనంతరం ఇతర కళాశాలలకు వెళ్తాయి. ప్రస్తుతం పలు కంపెనీలు జేఎన్‌టీయూహెచ్‌, ఓయూతోపాటు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొద్ది రోజులుగా పరీక్షలు, ముఖాముఖీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఈసారి ఇప్పటివరకు ఇద్దరు విద్యార్థులు రూ.14.5 లక్షల అత్యధిక వేతనం పొందారు. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇప్పటివరకు బీఈ, ఎంఈ, ఎంసీఏ విద్యార్థులకు 428 ఉద్యోగాల ఆఫర్లు వచ్చాయి. గత ఏడాది కేవలం 235 మాత్రమే. యాక్సెంచర్‌, ఇన్ఫోసిస్‌, విప్రోలు ప్రీమియం కంపెనీ రిక్రూట్‌మెంట్‌ డ్రెవ్‌(పీసీఆర్‌డీ)లో ఈ ఆఫర్లు ఇచ్చాయి. హెచ్‌సీయూలో సైతం ప్రాంగణ నియామకాలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు 15 మంది విద్యార్థులు రూ.7 లక్షల నుంచి రూ.7.20 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. హెచ్‌ఎస్‌బీసీ ఎంఏ ఆర్థికశాస్త్రం విద్యార్థులు ఆరుగురిని ఎంపిక చేసుకుంది. గత ఏడాది మొత్తం 56 కంపెనీలు సందర్శించి 210 మందిని ఎంపిక చేశాయి. వార్షిక వేతనం రూ.2.40 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఉంది.
ఒకటి కాకపోతే.. మరొకటి..
ప్రాంగణ నియామకాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు కొలువులు దక్కించుకున్నారు.ఒక్కో విద్యార్థి ఒకటి, రెండు అంతకంటే ఎక్కువ కంపెనీలు పెట్టే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో పాల్గొని ఏ కంపెనీ ఎక్కువ వేతనం, ఇతరత్ర సౌకర్యాలు, భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందో చూసుకొని అందులో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. గత ఏడాది కూడా ఉన్నత చదువు, స్వయం ఉపాధికి వెళ్లిన వారిని పక్కన పెడితే మిగతా వారందరికీ ఉద్యోగావకాశాలు వచ్చాయని కళాశాల ప్లేస్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జ్యోతుల సురేష్‌కుమార్‌ తెలిపారు. ఇక్కడ ఇంటర్వ్యూలు జరిగి కళాశాల చదువు పూర్తయిన తర్వాత గత ఏడాది ముగ్గురు విద్యార్థులు రూ.13.5 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారన్నారు.
నాన్నే నాకు స్ఫూర్తి.. - నేరెళ్ళ శ్రీలత, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి
మా నాన్న ఎన్‌.కాళీ ప్రసాద్‌ ఆర్‌బీఐలో ఉద్యోగి. నాన్నను స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్‌ నుంచి పక్కా ప్రణాళికతో చదివా. అందుకే నాకు ఇంటర్‌లో 959 మార్కులు, ఎంసెట్‌లో 341 ర్యాంకు దక్కింది. బీటెక్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యే నాటికి అకడమిక్‌ పరంగా 77 శాతం ఉత్తీర్ణత శాతం ఉంది. 2015 జులై ఒకటిన కామ్‌వాల్యుట్‌ సిస్టమ్స్‌లో చేరమని జాబ్‌ ఆఫర్‌ లెటర్‌ వచ్చింది. ఏడాదికి రూ.14.5 లక్షల వార్షిక వేతనం ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా అంటూ చదవక పోయినా ఎప్పుడు చెప్పిన పాఠం అప్పుడు చదువుకొని సందేహాలను నివృత్తి చేసుకున్నా. అమ్మ పార్వతి వెన్నంటి ఉంటూ ప్రోత్సహిస్తూ ఉంటుంది.
ఉద్యోగం విలువేంటో తెలుసు.. - కాసపు విశ్వతేజ, ఐడీపీ, జేఎన్‌టీయూ
మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. మా నాన్న కె.ప్రభాకర్‌రావు ఎంఈవోగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుడిగా చేరి ఎంఈవో అయ్యారు. నాన్న ఎదుగుదల గమనించా. నీవు సాధించాలి అంటూ అమ్మ ధనలక్ష్మి అంటుండేది. ఐడీపీ(బీటెక్‌ ప్లస్‌ ఎంటెక్‌)లో చేరా. ఇంటర్‌లో 961 మార్కులు, ఎంసెట్‌లో 1289 ర్యాంకు సాధించి ఐదేళ్లలో బీటెక్‌, ఎంటెక్‌ పూర్తిచేసే కోర్సులో చేరా. కొలువుకు ఎంపికయ్యే నాటికి 82.3 శాతం మార్కులున్నాయి. 'ఏడాదికి రూ.14.5 లక్షల వేతనానికి ఎంపిక చేస్తున్నాం. డిసెంబర్‌ లేదా జనవరిలో కామ్‌వాల్యూట్‌ సిస్టమ్స్‌ కంపెనీ ఇంటర్న్‌షిప్‌కు చేరాలని పిలుపు వచ్చింది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning