ఉచితంగా ఐఐటీ, ఎంఐటీ ప్రొఫెస‌ర్ల పాఠాలు

-ఇదే బాట‌లో ప‌లు సంస్థ‌లు
-ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, హ్యుమానిటీస్‌... స‌బ్జెక్టు ఏదైనప్ప‌టికీ అందుబాటులో నాణ్య‌మైన వీడియో పాఠాలు
-ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ ఉంటే చాలు...దూసుకుపోవ‌చ్చు...

పేరున్న క‌ళాశాల‌లో ఇంజినీరింగ్‌లో సీటు రాలేదా? అయినా ఫ‌ర్వాలేదు
మీ ప్రొఫెస‌ర్లు చెప్పే పాఠాలు స‌రిగా అర్థం కావ‌డం లేదా? దిగులు చెందొద్దు
ఏది ఏమైన‌ప్ప‌టికీ చ‌దువుతున్న స‌బ్జెక్టుపై విస్తృత ప‌రిజ్ఞానం సొంతం చేసుకోవాల‌నుందా? ఇది కూడా సాధ్య‌మే
ఆంగ్లంలో అన‌ర్గ‌ళంగా, శాస్త్ర‌బ‌ద్ధంగా మాట్లాడ‌డ‌మే మీ ల‌క్ష్య‌మా? అదెంతో సులువిప్పుడు
ఇవ‌న్నీ ఎలా సాధ్యం?
మీ ల‌క్ష్యం ఏదైన‌ప్ప‌టికీ, మీరు చ‌దువుతున్న కోర్సు ఎలాంటిదైన‌ప్ప‌టికీ మీరు కోరుకునే స‌బ్జెక్టు/అంశానికి సంబంధించి నాణ్య‌మైన వీడియో పాఠాలు, ఆడియో ఫైళ్లు, పీడీఎఫ్ ఫైళ్లు...అంత‌ర్జాలంలో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఎంత వ‌ర‌కు విశ్వ‌సించ‌వ‌చ్చో అనే సందేహం అస‌లొద్దు. ఎందుకంటే వీటిని ప్రపంచ‌వ్యాప్తంగా పేరొందిన వివిధ విశ్వ‌విద్యాల‌యాల (స్టాన్‌ఫోర్డ్‌, హార్వార్డ్‌, మ‌సాచ్యుసెట్స్‌, ఐఐటీ, ఐఐఎస్‌సీ....) ప్రొఫెస‌ర్లు, వివిధ సంస్థ‌ల‌( ఖాన్ అకాడెమీ, బీబీసీ, బ్రిటిష్ కౌన్సిల్‌) నిపుణులు రూపొందించారు. నాణ్య‌మైన విద్య అతి కొద్దిమంది విద్యార్థుల‌కే ప‌రిమితం కారాదు. అది విశ్వ‌వ్యాప్తం కావాలి. దాని ఫ‌లాలు ప్ర‌తి విద్యార్థికీ ద‌క్కాలి అనే ల‌క్ష్యంతో వీటిని రూపొందించారు.
హార్వార్డ్‌, స్టాన్‌ఫ‌ర్డ్‌, మ‌సాచ్యుసెట్స్‌...ఇవ‌న్నీ ప్ర‌పంచంలోనే ప్ర‌థ‌మ శ్రేణి విద్యా సంస్థ‌లు. వీటిలో సీటు ద‌క్కాలంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా పోటీ ఉంటుంది. అనేక వ‌డ‌పోత‌ల అనంత‌రం కేవ‌లం 0.0001 శాతం మందికే ఆ అవ‌కాశం ద‌క్కుతుంది. అదే మ‌న‌దేశంలో చూసుకుంటే ఐఐటీలు, ఐఐఎస్‌సీలో చ‌దువుకునే అవ‌కాశం ల‌భించేది కేవ‌లం 0.1 శాతం మందికే. ఇలాంటి సంస్థ‌ల్లో సీట్లు ప‌రిమితం. అంద‌రినీ చేర్చుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు. వీటిలో ప్ర‌వేశానికి తీవ్ర పోటీ నెల‌కొన‌డానికి కార‌ణం అక్క‌డున్న బోధ‌నా ప్ర‌మాణాలే. అంత నాణ్య‌మైన బోధ‌న మిగిలిన సంస్థ‌ల్లో ద‌క్క‌దు కాబ‌ట్టే అంత పోటీ.
ఇలాంటి ప‌రిస్థితుల్లో విద్యార్థి లోకానికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డానికి కేవ‌లం ఒకే మార్గం ఉంది. అదేమిటంటే ప్ర‌సిద్ధ సంస్థ‌ల్లో అనుభ‌వ‌జ్ఞులైన సీనియ‌ర్ ప్రొఫెస‌ర్లు చెప్పే పాఠాలు వీడియో, ఆడియో ఫార్మాట్‌లో రికార్డుచేసి అంత‌ర్జాలం ద్వారా అంద‌రికీ అందుబాటులోకి తీసుకురావ‌డ‌మే. కేవ‌లం ఇంట‌ర్నెట్ స‌దుపాయం ఉంటే స‌రిపోతుంది. వీటిని వినేయ‌వ‌చ్చు. సందేహాలు నివృత్తి చేసుకోవ‌చ్చు. స‌బ్జెక్టు ప‌రిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవ‌చ్చు. అందుకే ప‌లు విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌లు, భార‌త ప్ర‌భుత్వం ఆన్‌లైన్ వేదిక‌గా విద్యార్థుల‌కు ఉచితంగా వీడియో పాఠాలు అందిస్తున్నాయి. నాణ్య‌మైన విద్యా ఫ‌లాలు అంద‌రికీ ద‌క్కాలనే ల‌క్ష్యంతోనే ఈ సంస్థ‌ల‌న్నీ ప‌నిచేస్తున్నాయి. ఏయే సంస్థ‌లు ఎలాంటి కోర్సుల‌ను అందిస్తుందో తెలుసుకుందాం.
ఇంజినీరింగ్ విద్యార్థుల కోసం ఎన్‌పీటీఈఎల్‌
దేశంలో ఇంజినీరింగ్ విద్య‌ను మ‌రింత బ‌లోపేతం చేసే ల‌క్ష్యంతో భార‌త ప్ర‌భుత్వం సిల‌బ‌స్‌లోని పాఠ్యాంశాల‌ను వీడియో, వెబ్ కోర్సుల రూపంలో అందించ‌డానికి కొన్నేళ్ల కింద‌టే శ్రీకారం చుట్టింది. పాఠాలు చెప్పే బాధ్య‌త‌ను ఏడు ఐఐటీలు, ఐఐఎస్‌సీ బెంగ‌ళూరుకి అప్ప‌జెప్పింది. దీనికోస‌మ‌య్యే ఖ‌ర్చును కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ భ‌రిస్తుంది. ఇంజినీరింగ్ ఏయే బ్రాంచ్‌లో ఏ పాఠాలు చెప్పాల‌నేదాన్ని అఖిల భార‌త సాంకేతిక విద్యాశాఖ (ఏఐసీటీఈ) దిశానిర్దేశ‌నం చేస్తుంది. ఈ కార్య‌క్ర‌మానికి నేష‌న‌ల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాల‌జీ ఎన్‌హ్యాన్స్డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్‌) పేరుతో శ్రీకారం చుట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థులు బ్రాంచ్‌ల వారీ అందులోని స‌బ్జెక్టుల‌ను సెమిస్ట‌ర్ ప్ర‌కారం వీడియో పాఠాలు వినొచ్చు.
వెబ్‌సైట్‌: http://nptel.iitm.ac.in
మ‌సాచ్యుసెట్స్ యూనివ‌ర్సిటీ
గ్రాడ్యుయేట్ల కోసం చాలా వ‌ర‌కు ఉచిత కోర్సుల‌ను మ‌సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అందిస్తోంది. ఇంజినీరింగ్‌, లిట‌రేచ‌ర్‌, లింగ్విస్టిక్స్‌, ఫిలాస‌ఫీ, హిస్ట‌రీ, మీడియా ఆర్ట్స్‌, సైన్స్‌...ఇలా భిన్న స‌బ్జెక్టుల్లో 2000కు పైగా పాఠ్యాంశాలు అందుబాటులో ఉన్నాయి.
వెబ్ సైట్‌: http://ocw.mit.edu/index.htm
స్టాన్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ
మేనేజ్‌మెంట్‌, మ్యాథ్స్‌, డిజైన్ అండ్ క్రియేటివిటీ, ఎడ్యుకేష‌న్‌, ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇంజినీరింగ్ అండ్ కంప్యూట‌ర్ సైన్స్‌, హ్యుమానిటీస్‌, లా, మెడిసిన్ అండ్ హెల్త్‌, నేచుర‌ల్ అండ్ సోష‌ల్ సైన్సెస్ అంశాల్లో ఆన్‌లైన్ కోర్సుల‌ను అందిస్తుంది.
వెబ్‌సైట్‌: http://online.stanford.edu
హార్వార్డ్ యూనివ‌ర్సిటీ
ఆర్ట్స్ అండ్ డిజైన్‌, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఎక‌నామిక్స్ అండ్ ఫైనాన్స్, ఎడ్యుకేష‌న్ అండ్ ఆర్గ‌నైజేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌, లా అండ్ పాలిటిక్స్‌, హిస్ట‌రీ, హ్యుమానిటీస్‌, మ్యాథ్స్ అండ్ డాటా ఎనాల‌సిస్, మెడిసిన్ అండ్ ప‌బ్లిక్ హెల్త్‌, రెలిజియ‌న్ అండ్ స్పిరిచ్యువాలిటీ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, సోష‌ల్ సైన్స్‌...త‌దిత‌ర అంశాల్లో ఆన్‌లైన్‌లో స‌మాచారం, కోర్సులు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: http://online-learning.harvard.edu
అన్ని కోర్సులూ ఒకే చోట‌
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉచితంగా ఆన్‌లైన్‌లో వివిధ సంస్థ‌లు, యూనివ‌ర్సిటీలు అందిస్తోన్న స‌మాచారం అంతా ఒకే వేదిక‌పైకి తెచ్చింది ఓపెన్ ఎడ్యుకేష‌న్ క‌న్సార్టియం. ఇందులో కావాల్సిన స‌బ్జెక్టును సెర్చ్‌లో చేర్చితే ఆ స‌బ్జెక్టుపై వివిధ సంస్థ‌లు అందించిన స‌మాచారం అంతా వ‌స్తుంది. కావాల్సిన స‌మాచారం ఆర్ట్స్‌, సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌...ఇలా ఏదైన‌ప్ప‌టికీ ఇందులో సెర్చ్ చేస్తే చాలు విశ్వ‌వ్యాప్తంగా ఉండే ఉన్న‌త స‌మాచారమంతా ఇక్క‌డ డిస్‌ప్లే అవుతుంది. మ‌సాచ్యుసెట్స్‌, కాలిఫోర్నియా, మిచిగాన్‌...ఇలా ప్ర‌సిద్ధ యూనివ‌ర్సిటీలు రూపొందించిన పాఠాల‌న్నీఈ వెబ్‌సైట్ ద్వారా పొందే వీలుంది.
వెబ్‌సైట్‌: http://www.oeconsortium.org/
అండ‌గా ఆలిస‌న్‌
ఐటీ, ఫైనాన్స్‌, హెల్త్ సేఫ్టీ, ప‌ర్స‌నాలిటీ డెవ‌ల‌ప్‌మెంట్...త‌దిత‌ర ఆన్‌లైన్ కోర్సుల‌కు అడ్డా ఆలిస‌న్‌. ఉచితంగా స‌ర్టిఫైడ్ కోర్సుల‌ను అందించ‌డం ఆలిస‌న్ ప్ర‌త్యేక‌త‌. వివిధ అంశాల్లో డిప్లొమా కోర్సుల‌ను ఈ సంస్థ అందిస్తోంది. ఈ కోర్సుల‌ను ఆ రంగానికి చెందిన ప్ర‌ముఖ సంస్థ‌ల‌తో క‌లిసి రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌లో వైవిధ్య‌మైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అనాట‌మీ, యాప్ డెవ‌ల‌ప్‌మెంట్‌, ప్లంబింగ్‌, ప్రొజెక్ట్ మేనేజ్‌మెంట్‌, ఫొటోషాప్‌, ఫిజిక్స్‌, ఇంజినీరింగ్‌, యోగా, ఇంగ్లిష్‌...ఇలా 93 భిన్న స‌బ్జెక్టుల్లో ఆన్‌లైన్ వీడియో కోర్సుల‌ను అలిస‌న్ అందిస్తోంది. .
వెబ్‌సైట్‌: http://alison.com
మ‌రికొన్ని....
ఉడాసిటీ వివిధ అంశాల్లో ఆన్‌లైన్‌లో ఉచితంగా వీడియో పాఠాలు అందిస్తోంది.
వెబ్‌సైట్: https://www.udacity.com
వివిధ స‌బ్జెక్టుల్లో ఖాన్ అకాడెమీ 3900కు పైగా లెక్చ‌ర్ల‌ను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలో చాలా వ‌ర‌కు వీడియో పాఠాల‌ను ఉచితంగా చూడొచ్చు. ఐఐటీ జేఈఈ లాంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు కావాల్సిన స‌మాచారం చాప్ట‌ర్ల‌వారీ అందిస్తోంది.
వెబ్‌సైట్‌: https://www.khanacademy.org
అలాగే ఓపెన్ క‌ల్చ‌ర్‌, కాస్మోలెర్నింగ్‌,యాక్సెల‌బ్రేట్‌, కోర్స్ఎరీనా, ఎలియాడెమీ, ఎడెక్స్‌, లెర్న్ స్ట్రీట్‌, సీకే ట్వ‌ల్వ్‌, స్ట్ర‌యిట‌ర్ లైన్‌, ద సైల‌ర్ ఫౌండేష‌న్‌, టెక్‌ఛేంజ్‌...త‌దిత‌ర సంస్థ‌లు ఆన్‌లైన్‌లో వివిధ కోర్సుల‌ను అందిస్తున్నాయి.
వికీపీడియా, యూట్యూబ్ ద్వారా కూడా వివిధ కోర్సుల‌కు సంబంధించిన స‌మాచారం ల‌భిస్తుంది.
ఇంగ్లిష్ మేడ్ ఈజీ
ఆంగ్ల‌మంటే మీకు భ‌య‌మా? వ్యాక‌రణం, ఉచ్చార‌ణ‌ను శాస్త్ర‌బ‌ద్ధంగా తెలుసుకోవాల‌నుందా? స‌రైన స‌మాచారం ఎక్క‌డ దొరుకుతుంద‌ని అన్వేషిస్తున్నారా? అయితే మీకోస‌మే బ్రిటిష్ కౌన్సిల్ సిద్ధంగా ఉంది. ఉచితంగా ఇంగ్లిష్ నేర్ప‌డానికి ఒక వెబ్‌సైట్‌ని చాలా ఏళ్ల నుంచి నిర్వ‌హిస్తోంది. వ్యాక‌ర‌ణం, ఒకాబుల‌రీ...త‌దిత‌ర అంశాల్లో ఆడియో, వీడియో త‌ర‌గ‌తులు ఈ వెబ్‌సైట్‌లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి. చిన్నారులు, టీనేజ్ విద్యార్థుల కోసం ప్ర‌త్యేక విభాగాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లిష్ బోధించేవాళ్ల‌కోసం కూడా ప్ర‌త్యేక పేజీ ఏర్పాటు చేశారు.
మ‌రెందుకాల‌స్యం క్లిక్ చేయండి http://learnenglish.britishcouncil.org/en/
బీబీసీ కూడా ఆంగ్లంలో వ్యాక‌ర‌ణం, ప‌ద‌సంప‌ద‌, ఉచ్ఛార‌ణ‌..త‌దిత‌ర అంశాల్లో ఆడియో, వీడియో పాఠాలు అందిస్తోంది.
వెబ్‌సైట్‌: http://www.bbc.co.uk/worldservice/learningenglish
హిందీ మే బోలో...
ఆన్‌లైన్‌లో హిందీ నేర్చుకోవాల‌నే ఆస‌క్తి ఉన్న‌వాళ్ల‌కు http://www.learn-hindi-online.com/
వెబ్ సైట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నేర్చుకునే ప్ర‌క్రియ‌లో మీకొచ్చే సందేహాలు కూడా నివృత్తి చేస్తారు.
విదేశీ భాష‌ల కోసం..
ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌...లాంటి విదేశీ భాష‌ల‌ను ఉచితంగా ఆన్‌లైన్‌లో నేర్చుకోవాల‌నుకుంటున్నారా? అయితే దానికోసమూ కొన్ని వెబ్‌సైట్లు సిద్ధంగా ఉన్నాయి. కేవ‌లం ఆస‌క్తి ఉంటే చాలు. వాటిని సులువుగా, ప‌ద్ధ‌తి ప్ర‌కారం నేర్చుకోవ‌చ్చు.
www.busuu.com
www.learnlanguage.com
www.languageguide.org
ఫొటోగ్ర‌ఫీ సులువే...
మంచి ఫొటోలు తీయాల‌ని ఎవ‌రికుండ‌దు చెప్పండి. అందులోనూ సెల్ఫీలు, ఫేస్‌బుక్కులూ రాజ్య‌మేలుతున్న ఈ కాలంలో వావ్ అనిపించే ఫొటోలు తీసి లైక్‌లు కొట్టించుకోవాల‌నుకునేవాళ్ల సంఖ్య కూడా త‌క్కువేమీ కాదు. అలాగే ఫొటోగ్ర‌ఫీనే కెరీర్ ఫ్యాష‌న్‌గా భావించేవాళ్లూ త‌క్కువేమీ కాదు. వీరంద‌రికోసం నెట్టింట్లో విలువైన ఉచిత స‌మాచారం సిద్ధంగా ఉంది. ఫొటో ప్ర‌పంచానికి సంబంధించి ఎన్నో టిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఫొటోలు తీయడంలో బేసిక్స్‌తోపాటు ఫొటో ఎడిటింగ్‌, లైటెనింగ్‌...అంశాల‌న్నీ ఉచితంగా నేర్చుకోవ‌చ్చు. మ‌రెందుకాల‌స్యం క్లిక్ చేయండి
www.picturecorrect.com
http://photographycourse.net

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning