జోడించి చదివితేనే జయం!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో తొలి, మలి దశలైన ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు పూర్తిగా వేర్వేరని చాలామంది అభ్యర్థులు అపోహపడుతుంటారు. మొదట వీటిలో ఒకదానికొకటి సంబంధం ఉందని తెలుసుకోవాలి. దీంతోపాటు సివిల్స్‌ ఆశావహులు గ్రహించాల్సిన ముఖ్యాంశాలు...
అభ్యర్థులు చాలామంది ప్రిలిమినరీ కోసం బిట్లు చదువుకుంటుంటారు. ప్రిలిమ్స్‌లోని 2 పేపర్లలోనూ బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి కాబట్టి వీరిలా చేస్తుంటారు. అది పూర్తయిన తర్వాత మెయిన్‌ పరీక్షకు సన్నద్ధం అవ్వచ్చని భావిస్తుంటారు. కానీ ఈ పద్ధతి సరైంది కాదు. ఈ విధంగా చదివితే సివిల్స్‌ పరీక్షలో నెగ్గటం చాలా కష్టం!
పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ, విశ్లేషించుకుంటూ, కథ మాదిరిగా ఇష్టంగా చదవాలి. అలా కాకుండా ప్రిలిమినరీ కోసం పాఠ్యాంశాలను చదవకుండా, వాటి నుంచి ఎవరో తయారుచేసిన బిట్లు మాత్రమే చదివితే ప్రయోజనం శూన్యం.
గత కొన్ని సంవత్సరాల ప్రిలిమినరీ, మెయిన్స్‌ సిలబస్‌, ప్రశ్నల సరళులను ప్రతి విభాగం నుంచీ పరిశీలించి చూస్తే సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) సన్నద్ధత అవసరమని తెలుస్తుంది.
ప్రిలిమినరీలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి Economic and Social Development, Sustainable Develop ment, Poverty, Inclusion, Demographics, Social sector initiatives మొదలైనవి పేర్కొన్నారు.
మెయిన్స్‌ జనరల్‌ స్టడీస్‌ మొదటి 3 పేపర్లలో ఇవే విషయాలు ఉన్నాయి. మొదటి పేపర్‌లో Population and associated issues ఇచ్చారు. ప్రిలిమినరీలోని Demographics అంటే ఇదే.
ప్రిలిమినరిలోని Social Development, Social sector initiativesలను కూడా మొదటి పేపర్‌లోని Social empowerment, 2వ పేపర్‌లోని Social Justiceలో చూడవచ్చు. ప్రిలిమినరీలోని Inclusionను మెయిన్స్‌ 3వ పేపర్‌లో Inclusive growth and issues arising from it అని ఇచ్చారు. ప్రిలిమినరీలో ఇచ్చిన povertyకు అనుగుణంగా మెయిన్స్‌లో Growth, Development, Employment అని ఇచ్చారు.
అంతేగాక ప్రిలిమినరీలో Economic Development అని ఇచ్చారు. ఇది అర్థం కావాలంటే మెయిన్స్‌ జనరల్‌స్టడీస్‌ 3వ పేపర్‌లోని Planning, PDS, Infrastructure, Agricultural- Insdustrial పాలసీలతో పాటు బ్యాంకింగ్‌, బడ్జెట్‌లపై సంపూర్ణ అవగాహనకు రావాలి.
ఈ విధంగా ప్రతి అంశానికీ సంబంధించి సిలబస్‌ను ప్రధానంగా అధ్యయనం చేయాలి. అవగాహనతో ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లోని పాత ప్రశ్నలను పరిశీలించాలి.
ఉదాహరణకు బ్యాంకింగ్‌ రంగంపై మెయిన్స్‌లో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలించండి.
1. What is bank rate? What is the bank rate in India at present?
2. What are lead banks?
3. What is statutory liquidity requirement of commercial banks?
4. What is Cash Reserve Ratio?
5. What does "Priority sector lending" mean?
6. What do you understand by "repo rate" and "reverse repo rate"? What are the implications in raising these rates?
మెయిన్స్‌లో పై ప్రశ్నల సరళిని పరిశీలించండి. రోజూ పేపర్‌ చదివే అలవాటున్న ఎవరైనా వీటికి సమాధానం రాయగలరు. సంవత్సరంలో రెండుసార్లు ఆర్‌బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించే సమయంలో అన్ని ప్రధాన పత్రికల్లో సంబంధిత వ్యాసాలూ, విశ్లేషణలూ వస్తాయి. వీటిని తప్పక పరిశీలించాలి. అందులో ఉండే వర్తమాన విషయాలు పరిశీలించాలి. అంటే CRR, SLR, Bank rate ఎంత ఉంది? ఏమన్నా మార్పులు చేశారా? చేస్తే ఎందుకు చేశారు? దాని ప్రభావం ధరలపై ఏ విధంగా ఉండవచ్చు లాంటి విశ్లేషణలు చేయాలి.
అంటే వర్తమాన విషయాల వెనుక ఉన్న భావనలను సమగ్రంగా కారణం- ప్రభావం సంబంధంతో అర్థం చేసుకోవాలి. అర్థవంతంగా చదివితేనే మెయిన్స్‌లో ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతారు.
ఇదే బ్యాంకింగ్‌ రంగం నుంచి 2013 ప్రిలిమినరీలో అడిగిన ప్రశ్నలను కూడా పరిశీలించండి.
1. The Reserve Bank of India regulates the commercial banks in matters of
1. Liquidity of Assets 2. Branch expansion
3. Merger of banks 4. Winding-up of banks
2. An increase in the Bank Rate generally indicates that the
(a) market rate of interest is likely to fall
(b) Central Bank is no longer making loans to commcercial banks
(c) Central Bank is following an easy money policy
(d) Central Bank is following a tight money policy
ఈ విధంగా ఒక రంగంపై ప్రశ్నలు సరైన విశ్లేషణతో అర్థవంతంగా చదవాలి. లేకపోతే ప్రిలిమినరీలో కూడా సమాధానం గుర్తించలేము.
భారతదేశంలోని సామాజిక సమస్యలను జనరల్‌స్టడీస్‌లోని అన్ని పేపర్లతోపాటు సాధారణ వ్యాసంతో పోల్చి చూడండి. ఈ సమీకృత (ఇంటిగ్రేటెడ్‌) విధానంలో సామాజిక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వ్యాసాన్నీ, జనరల్‌ స్టడీస్‌లోని అన్ని పేపర్లలో కొన్ని ప్రశ్నలనూ సరిగా రాయగలుగుతాం. మౌఖిక పరీక్షలో కూడా ఏ సమస్యపైన అయినా స్పష్టంగా జవాబిచ్చే అవకాశం ఉంటుంది.
మనదేశంలోని సామాజిక సమస్యల విభాగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూల్లో రాణించాలంటే ఈ నేపథ్యం అవసరం. జనరల్‌ స్టడీస్‌లో ఆంత్రోపాలజీ కోణం అంటే ఇదే.
సామాజిక సమస్యల నేపథ్యం నుంచి గతంలో కింది సాధారణ వ్యాసాలను ఇచ్చారు.
1. Globlisation Vs. Nationalism - 2009
2. National identity and patriotism - 2008
3. How has satellite television brought about cultural change in Indian mindsets. - 2007
4. Globalization and its impact on Indian culture - 2004
5. As civilization advances culture declines. - 2003
ఈ వ్యాసాలను సమగ్రంగా రాయాలంటే అన్ని సామాజిక సమస్యలపై అవగాహన తప్పనిసరి. 2011లో ఇచ్చిన ప్రశ్న- Benefits and potential drawbacks of cash transfers to BPL households. అంటే ప్రతి సామాజిక సమస్యనూ వర్తమాన అంశంతో ముడిపెట్టి ప్రశ్నను అడుగుతున్నారు. 2010లో PDSపై ప్రముఖంగా ప్రస్తావితమైన వాద్వా కమిషన్‌ గురించీ, 2009లో రాష్ట్రీయ గ్రామీణ్‌ వికాస్‌నిధి గురించీ ప్రశ్నలు వచ్చాయి.
ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకూ సంబంధించి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సిలబస్‌లను దగ్గర పెట్టుకుని గత 30 సం||లలో ఇచ్చిన ప్రశ్నలను విశ్లేషిస్తే జనరల్‌స్టడీస్‌తోపాటు వ్యాసం సన్నద్ధత కూడా అయిపోయినట్టే!

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning