పనిచేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాల్లో భారత్‌ది 18వ స్థానం

* పనిచేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాల్లో భారత్‌ది 18వ స్థానం
న్యూఢిల్లీ: పనిచేయడానికి ఎక్కువ మంది కోరుకునే దేశాల్లో భారత్‌కు 18వ స్థానం దక్కింది. సర్వేలో పాల్గొన్న 70-80 శాతం మంది భారతీయులు బయట పనిచేయడానికి సిద్ధంగా ఉండడం గమనార్హమని ఓ నివేదిక స్పష్టం చేస్తోంది. జాబితాలో అమెరికాకు అగ్రస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్‌లు నిలిచినట్లు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు, టోటల్‌జాబ్స్‌.కామ్‌, ద నెట్‌వర్క్‌లు సంయుక్తంగా తయారుచేసిన జాబితా వెల్లడిస్తోంది. ఇంకా ఫ్రాన్స్‌(6), ఆస్ట్రేలియా(7), స్పెయిన్‌(8), ఇటలీ(9), స్వీడన్‌(10)లు సైతం టాప్‌-10లో చోటు సంపాదించుకున్నాయి. ఇక భారత్‌ 18వ స్థానంలో నిలిచింది. ఆ నివేదిక విశేషాలు..
* అమెరికా, ఐరోపాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్‌ ప్రాంతం పనిచేయడానికి ఆసక్తిని పురికొల్పడం లేదని తెలుస్తోంది.
* ఆయా ప్రాంతాల్లోనే వివిధ భాషల సమ్మేళనమే అందుకు కారణమని.. అయితే కొన్ని ఆసియా దేశాలు మాత్రం తాము పోగొట్టుకున్న సిబ్బందిని తిరిగి రప్పించుకోవడానికి పనులు మొదలుపెట్టాయి.
* అంతర్జాతీయంగా ప్రతీ అయిదు మందిలో ఒకరికి అంతర్జాతీయ పని అనుభవం ఉంది. దాదాపు 64 శాతం మంది మరో దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
* సర్వేలో పాల్గొన్న 70-80 శాతం మంది భారతీయ సిబ్బంది విదేశాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
* ఇక 97 శాతం మంది పాకిస్థానీయులు బయట దేశంలో పనిచేయడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
* 94 శాతం నెదర్లాండ్స్‌ వాసులూ(సర్వేలో పాల్గొన్నవారిలో) విదేశాల్లో కొలువుకే ఇష్టపడుతున్నారు.
* ఇక అమెరికా, జర్మనీ, బ్రిటన్‌.. ఈ మూడు దేశాల ప్రజలు మాత్రం స్వదేశంలోనే ఉండి పనిచేయాలనుకుంటున్నారు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning