ఇంజినీరింగ్ విద్యార్థులకు రైల్వే కొలువులు !

* ఆరువేలకు పైగా ఉద్యోగాలు
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 19గడువు

నల్గొండ, న్యూస్‌టుడే: విభిన్నమైన బ్రాంచీలలో డిప్లమో, ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు సువర్ణావకాశం. ఏదొక ఉద్యోగం కాకుండా తమ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనుకునే అభిరుచి ఉన్న విద్యార్థులకు భారతీయ రైల్వేశాఖ చేసిన ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ ప్రకటన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రైల్వేశాఖ ఇంజనీరింగ్ స్థాయి కొలువుల నియామానికి చాలా కాలం తర్వాత పచ్చజెండా ఊపింది. కేంద్రప్రభుత్వశాఖలో జూనియర్,సీనియర్ సెక్షన్‌ ఇంజినీరుగా స్థిరపడాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. కొంచెం శ్రమిస్తే అత్యన్నత కొలువును సాధించేం వీలుంది .ఇంజినీరింగ్‌ చదువుతున్న నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగం...పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తున్నారు. రైల్వే కొలువుల నియామకాలకు ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు అక్టోబ‌ర్ 19 తో ముగియనుంది.
ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు అవకాశం..
జూనియర్‌ ఇంజినీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ సహాయకులు, సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు, ముఖ్య డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఇంజినీరింగ్‌ డిప్లమో, డిగ్రీ పాసైన వారికి అవకాశం కల్పించింది.
ఉద్యోగాల అర్హత ఇవే...
* సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు (ఎస్‌ఎస్‌ఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్‌ ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఆటో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంప్యూటర్స్‌, ఇన్‌స్ట్రూమెంటేషన్‌ బీఈ లేదా బీటెక్‌ ఉన్న వారు అర్హులు.
* జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) గ్రూపు ఉద్యోగాలకు సివిల్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఆటో మొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌ ఇన్‌స్ట్రూమెంట్‌ బ్రాంచి డిప్లమో ఉన్నవారు అర్హులు.
* మరికొన్ని ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌ డిప్లమో, గ్రాడ్యుయేషన్‌ కాకుండా ఇతర కోర్సులు పూర్తి చేసిన వారు కూడా అర్హులు. పీజీడీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్‌ సైన్స్‌ లేదా బీసీఏ, డీవోఈఏసీసీ సర్టిఫికెట్‌ లేదా తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు.
* కెమికల్‌ మెటలర్జికల్‌ సహాయకులు ఉద్యోగాలకు మెటలర్జీ కెమికల్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
* సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు ఉద్యోగానికి 2015 జనవరి 1వ తేదీ నాటికి 20 నుంచి 35 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు అర్హులు. జూనియర్‌ ఇంజినీరు ఉద్యోగాలకు 2015 జనవరి 1వ తేదీ నాటికి 18 నుంచి 33 ఏళ్లమధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.
* ఓబీసీలకు మూడేళ్లు ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు,, ఓబీసీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 13 ఏళ్ల సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ పదేళ్ల సడలింపు ఉంటుంది.
పరీక్షలు డిసెంబర్‌లో...
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు అక్టోబ‌ర్ 19 చివరి తేదీ. జూనియర్‌ ఇంజినీరు గ్రూపుపరీక్ష డిసెంబర్‌ 14న నిర్వహిస్తారు. సీనియర్‌ ఇంజినీరు గ్రూపు పరీక్ష డిసెంబర్‌ 21న నిర్వహిస్తారు.
ఫీజు వివరాలు:
రిజర్వేషన్‌ లేని వారికి, ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ.100 ఫీజు చెల్లించాలి. మిగతా వారికి ఫీజులో మినాయింపు ఉంది. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. ఎస్‌ఎస్‌ఈ, జీఈలకు రెండింటికిఅర్హత ఉన్న అభ్యర్థులు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తులు చేయాలి.
పరీక్ష కేంద్రాలు:
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ పేరిట దరఖాస్తు చేసుకున్న వారికి సికింద్రాబాద్‌, హైదరాబాదు, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు వీలుంటుంది.
* ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. నెగిటివ్‌ మార్కులుంటాయి. ఒక తప్పు సమాధానానికి వన్‌ బై త్రీ మార్కు కోత విధిస్తారు. ఆంగ్లం, హిందీ, ఉర్దూతో పాటు స్థానిక భాషను మాధ్యమంగా ఎంపిక చేసుకోవచ్చు.
వీటిపై దృష్టి పెట్టాలి..
* జనరల్‌ సైన్స్‌
సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీరు గ్రూపు పరీక్షలో జనరల్‌ సైన్స్‌కు సంబంధించి ఇంటర్‌ స్థాయి ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్‌. కెమిస్ట్రీ, బయాలజీ, ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకుంటే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. జేఈ పరీక్షకు 1 నుంచి 10వ తరగతి మధ్య స్థాయి ప్రశ్నలుంటాయి.
* టెక్నికల్‌ ఎబిలిటీ
ఎస్‌ఎస్‌ఈ ప్రశ్నపత్రంలో సివిల్‌, మోకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మేజర్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌, గ్రాఫిక్స్‌పై ప్రశ్నలుంటాయి. జూనియర్‌ ఇంజినీరు పోస్టులకు కూడా ఇవే ప్రశ్నలుంటాయి.
ప్రణాళికతోనే విజయం: ఎ.జానకిరాంరెడ్డి, గణిత అధ్యాపకులు
ఆర్‌ఆర్‌బీ సెక్షన్‌ ఇంజినీరు, సహాయక ఇంజినీరు తదితర ఉద్యోగాల పరీక్షల కోసం ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం సాధించవచ్చు. వందమార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. 40 మార్కులు అర్థమెటిక్‌ రీజనింగ్‌, 60శాతం జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ ఆఫైర్స్‌పై ఉంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning