ఐటీఐఆర్‌తో సుమారు 1.80 లక్షల మేర ఉద్యోగాలు

* విస్తరణ ప్రణాళికలను రూపొందించుకున్న గూగుల్‌, హెచ్‌ఎస్‌బీసీ, కాగ్నిజెంట్‌, విప్రో తదితర కంపెనీలు
* శాసనసభకు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టుపక్కల ఐటీ రంగ అభివృద్ధికి మంజూరైన ఐటీఐఆర్‌పై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం మొదలుపెట్టింది. దీనిలో తన వాటాగా వచ్చే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై కేంద్రం ఈ అధ్యయనం చేపట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. దీనిలో అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ వాటాగా రూ. 13వేల కోట్ల మేర భరించాలని అంచనావేసినట్టు తెలిపింది. శాసనసభలో వివిధ పార్టీల సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానాలిచ్చింది. మౌలిక సదుపాయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.3,275 కోట్ల ఇవ్వనుందని, ఇంకా నిధులు విడుదల కాలేదని తెలిపింది. గూగుల్‌, హెచ్‌ఎస్‌బీసీ, కాగ్నిజెంట్‌, విప్రో తదితర కంపెనీలు విస్తరణ ప్రణాళికలను రూపొందించుకొన్నాయని, ఆ విషయాలు చర్చల దశలో ఉన్నాయని తెలిపింది. ఐటీఐఆర్‌ ప్రారంభమైతే మొదటి మూడేళ్లలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సుమారు 1.80 లక్షల మేర ఉంటాయని వెల్లడించింది.

Posted on 11-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning