ఆన్‌లైన్‌లో ఉన్నతవిద్య

* పాఠ్యాంశాల రూపకల్పనలో భారత్‌, యూరప్‌ విశ్వవిద్యాలయాలు
ఈనాడు, హైదరాబాద్‌: మరో మూడేళ్లు ఆగండి... ఇంటి దగ్గర నుంచే డిగ్రీలను ఆన్‌లైన్‌లో పూర్తి చేయొచ్చు. అందుకు ఈ-క్వాల్‌ పేరిట భారత్‌, యూరప్‌కు చెందిన విశ్వవిద్యాలయాలు ఓ ప్రణాళికను చేపట్టి పాఠ్యాంశాల తయారీలో నిమగ్నమయ్యాయి. దీనికి అవసరమైన నిధులను యురేపియన్‌ యూనియన్‌ (ఈయూ) సమకూర్చుతోంది. ఈ-క్వాల్‌( ఎన్‌హ్యాన్స్‌ క్వాలిటీ, యాక్సిస్‌, గవర్నెన్స్‌ ఆఫ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఇండియా) పేరిట చేపట్టిన ఈ ప్రాజెక్టును 2017 మే నాటికి పూర్తి చేయాలి. దీంట్లో భారత్‌ నుంచి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం (ఢిల్లీ), శివ్‌ నాడార్‌ విశ్వవిద్యాలయం (ఢిల్లీ), జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం (కోల్‌కతా), యురేపియన్‌ యూనియన్‌ నుంచి కింగ్స్‌ కళాశాల (లండన్‌), బొలొగ్న విశ్వవిద్యాలయం (ఇటలీ)లు భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి బ్రిటీష్‌ కౌన్సిల్‌ నాయకత్వ భాగస్వామి(లీడ్‌ పాట్నర్‌)గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సహజ వనరుల నిర్వహణ, సుస్థిర అభివృద్ధి పాఠ్యాంశాలను తయారు చేస్తోంది.

Posted on 28-11-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning