చిక్కులకు చక్కని ఉపాయం

ఇచ్చిన ప్రశ్నకు అప్పటికే తయారైన జవాబును గుర్తుంచుకుని పరీక్షలో బాగా రాసినంతమాత్రాన ప్రతిభావంతుడిగా పరిగణించాల్సిందేనా? సివిల్‌ సర్వీసుల్లో అభ్యర్థి సమస్యాపరిష్కార సామర్థ్యం ఎలా ఉందో పసిగట్టటం ముఖ్యం. ఆ లక్ష్యసాధనకు ప్రవేశపెట్టినవే 'కేస్‌ స్టడీ' ప్రశ్నలు!
సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష 2013లో పూర్తిగా కొత్తరూపు ధరించింది. అలఘ్‌ కమిటీ, ఇతర కమిటీల సిఫార్సుల ఆధారంగా ప్రశ్నలు అడిగే తీరులో, మూల్యాంకనంలో కూడా మార్పులు తెచ్చారు. అలాంటివాటిలో ముఖ్యమైనది- కేస్‌ స్టడీ పద్ధతి!
ప్రధానంగా జనరల్‌స్టడీస్‌ ఎథిక్స్‌ పేపర్లో ఈ తరహా ప్రశ్నలు ఇస్తున్నారు. దీనికి దాదాపు 50 శాతం మార్కులు (125/250) కేటాయించారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, మేనేజ్‌మెంట్‌ మొదలైన ఆప్షనల్స్‌లో కూడా ఈ ప్రశ్నలను చూడొచ్చు. హ్యూమానిటీస్‌ ఆధారిత ఇతర ఆప్షనల్స్‌లోనూ వీటిని ఆశించవచ్చు.
స్వరూపం
పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఒక పరిస్థితిని గానీ, పరిష్కరించాల్సిన సమస్యను గానీ వివరించేదే కేస్‌ స్టడీ. అది ఒకానొక ప్రైవేటు/ప్రభుత్వ సంస్థలో నిజంగానే ఎదురైన వాస్తవిక పరిస్థితి కావొచ్చు. లేదా ఊహాత్మకమైన అంశమైనా కావొచ్చు. ఎక్కువ కేస్‌ స్టడీల్లో అభ్యర్థి మేనేజర్‌/పాలనాధికారి స్థానంలో ఉండి నిర్ణయం తీసుకోవటం ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన సందర్భం ఉంటుంది.
ఎందుకు ప్రవేశపెట్టారు?
సాంప్రదాయిక థియరిటికల్‌ ప్రశ్నలకు అభ్యర్థి చదవటం ద్వారా కానీ, శిక్షణ తరగతులకు హాజరవటం ద్వారా గానీ అభ్యర్థి సిద్ధం కావొచ్చు. జ్ఞాపకశక్తికి మాత్రమే ఈ పద్ధతిలో ప్రాధాన్యం. దీన్ని సివిల్‌ సర్వీసుల సంస్కరణల కమిటీలన్నీ వ్యతిరేకిస్తూవచ్చాయి. ప్రశ్నపత్రాలు అభ్యర్థి సహజ ప్రతిభను పరీక్షించాల్సివుందని ఆ కమిటీలు సూచించాయి. కేస్‌స్టడీ విధానం ఈ అవసరాన్ని తీరుస్తుంది. జ్ఞానాత్మక కార్యాచరణ ద్వారా సమస్యను అభ్యర్థి పరిష్కరించగలడా అనేది పరీక్షించటమే ఈ పద్ధతిలో ప్రశ్నల లక్ష్యం.
ఎలా సిద్ధమవ్వాలి?
కేస్‌ స్టడీలు ఎన్నో రకాలు. అన్నిటినీ ఊహించటం కష్టం. కానీ యూపీఎస్‌సీ విడుదల చేసిన నమూనాలూ, గత ఏడాది ప్రశ్నల ఆధారంగా ఆ తరహా ప్రశ్నలకు అభ్యర్థులు సిద్ధం కావొచ్చు.
ప్రతి కేస్‌స్టడీ మరోదానికంటే భిన్నం. దానికదే ప్రత్యేకం. అయినప్పటికీ పాత ప్రశ్నల ఆధారంగా కేస్‌స్టడీలకు జవాబులు రాయటానికి ఒక ప్రామాణిక విధానం రూపొందించుకోవచ్చు.
జవాబు కనుక్కునే క్రమం
* దీనిలో ఉన్న నైతికపరమైన తికమక ఏమిటి?
* ఏ అదనపు సమాచారం సేకరించవచ్చు?
* సమస్యను విశ్లేషించేటపుడు ఏ అంచనాలు వచ్చాయి?
* ఏ నైతిక భావనలు/ సిద్ధాంతాలు అనువర్తించారు?
* ఏ చట్టమైనా దీనికి వర్తిస్తుందా?
* పరిష్కారం కనుగొనడంలో అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాలేమిటి?
* వాటిలో అత్యుత్తమమైనది ఏమిటి? ఎందుకు?
* అనుకూల, ప్రతికూలాంశాల చర్చ
* అత్యుత్తమ పరిష్కారాన్ని ఎలా అమలు చేస్తారు?
* అలాంటి చిక్కు సమస్య తిరిగి ఏర్పడకుండా నివారణచర్యలు ఏం సూచిస్తారు?
పరిష్కారం: మూడు అవకాశాలు
1. Win- Lose: నైతికతకు పట్టం; కానీ సంబంధిత వ్యక్తులకు కష్టం
2. Lose- Win: నైతికతలో కొంత సర్దుబాటు; సంబంధిత వ్యక్తికి ఊరట
3. WIN- WIN: నైతికతకు పట్టం. సంబంధిత వ్యక్తి పరివర్తనకు/ అనైతిక చర్యల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశమివ్వటం.
ఒక ఉదాహరణ చూద్దాం
You have been appointed as the district collector of a backward district. Your predecessor has done a lot of good work in trying to eradicate the practice of manual scavenging. One such individual is Kumar. Kumar who belongs to a caste which has been traditionally involved in manual scavenging work has stopped that work and has opened a tea shop. However, the people of the community are not visiting his shop and are discriminating against him based on his caste and earlier profession. Unable to run his shop, and take care of his family he wants to close it and return to his old profession. He approaches you for help...
1) How would you deal with the situation?
2) Your predecessor has done excellent work . Even then why do you think this situation has arisen ?
3) Make out a sustainable action plan to eradicate manual scavenging in your district.
ఇలాంటి పరిస్థితులు ఏర్పడే కారణాలు ముందు గుర్తించాలి. 1) అసంపూర్ణ పునరావాసం 2) మానసికంగా ఆ పని నుంచి విముక్తి చేసే ప్రయత్నం చేయకపోవటం 3) ఆ పనివారిని సమాజ స్రవంతిలో కలపటంలో ప్రయత్నలోపం 4) మరుగుదొడ్ల నిర్మాణంపై అశ్రద్ధ.
* ఇతరుల్లో చైతన్యం పెంచేలా అక్కడ మీరే టీ తాగవచ్చు. మీ కార్యాలయానికి అతడు టీ సరఫరా చేసేలా చేయటం.
* ఉపాధి, సామాజిక భద్రత, ఆర్యోగం, విద్య, సమాజంలో భాగస్వాములను చేయటం లాంటివాటితో సంపూర్ణ పునరావాసం కల్పించటం.
* స్వల్ప వ్యయమయ్యే ఫ్లష్‌ టాయిలెట్ల నిర్మాణం ప్రోత్సహించటం.
* పారిశుద్ధ్య ప్రాముఖ్యం, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన పెంచటం.

Posted on 15-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning