టెక్‌మహీంద్రాలో మరో 30,000 నియామకాలు

* రెండేళ్లలో సీట్ల సామర్థ్యం 1.25 లక్షలకు
* హైదరాబాద్‌, విశాఖ కేంద్రాల విస్తరణ

హైదరాబాద్‌: హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రాల విస్తరణ సహా అంతర్జాతీయంగా సీట్ల సామర్థ్యాన్ని రెండేళ్లలో 1.25 లక్షలకు విస్తరించనున్నట్లు టెక్‌ మహీంద్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సీపీ గుర్నానీ చెప్పారు. ప్రస్తుతం 95,000 సీట్ల సామర్థ్యం ఉందని, మరో 30,000 జత చేస్తామని తెలిపారు. వీటిలో అత్యధికం హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలలో జతచేస్తామని, రెండో అంచె నగరాలైన విశాఖపట్నం, జయపుర, భువనేశ్వర్‌లలో కూడా ఉంటాయని వెల్లడించారు. 20,000 మందికి పైగా నిపుణులతో హైదరాబాద్‌ తమకు అతిపెద్ద కేంద్రంగా ఉందని గుర్నానీ తెలిపారు. హైదరాబాద్‌ శివార్లలోని బహదూర్‌పల్లిలో ఇన్నోవేటివ్‌ ల్యాబ్స్‌ నిర్మాణానికి 100 మిలియన్‌ డాలర్లు (రూ.600 కోట్లు) వెచ్చించామన్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం 1,500 మంది నిపుణులున్నారని, అక్కడ విస్తరణకు మరికొంత స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. భువనేశ్వర్‌లో నిర్మించిన కొత్త సముదాయంలో 600 మందికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. తమ ఆదాయంలో 2-3 శాతాన్ని పరిశోధన-అభివృద్ధికి కేటాయిస్తున్నాం అన్నారు. విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా కొత్త సంస్థలకు ప్రారంభానికీ ఈ నిధులు వినియోగిస్తున్నట్లు వివరించారు.
బీపీఓ సంస్థల్లో షిఫ్టుల్లో ఒక సీటుకు ఇద్దరు చొప్పున ఉద్యోగులు పనిచేసినా, ఐటీ సంస్థల్లో సాధారణంగా ఒక సీటు అంటే ఒక ఉద్యోగిగా పరిగణించవచ్చు. 30,000 సీట్ల విస్తరణ అంటే మరో రెండేళ్లలో ఈ సంస్థ మరో 30,000 మందికి ఉద్యోగావకాశం కల్పించనుంది.

Posted on 22-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning