జేఎన్‌టీయూఏ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం

* స్పేస్‌ డైరెక్టర్‌కు గౌరవ డాక్టరేట్‌
అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: అనంత జేఎన్‌టీయూ ఆరో స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం చేశామని ఉపకులపతి ఆచార్య లాల్‌కిషోర్‌ వెల్లడించారు. డిసెంబర్ 22న జేఎన్‌టీయూలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో స్నాతకోత్సవం ఏర్పాట్లపై వీసీ మాట్లాడుతూ జేఎన్‌టీయూలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని డిసెంబర్ 24న నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌ స్పేస్‌ కేంద్రానికి చెందిన డైరెక్టర్, శాస్త్రవేత్త ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నామన్నారు. ఆయ‌న ముఖ్య అతిథిగా స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు. జేఎన్‌టీయూతో పాటు అనుబంధ కళాశాలల్లో మొత్తం 27 మందికి ఈ స్నాత‌కోత్సవంలో గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తారు. స్నాతకోత్సవంలో మొత్తం 20,851 మందికి పట్టాలు ప్రదానం చేయనున్నాం. జేఎన్‌టీయూ ఏర్పాటైన ఆరేళ్లకే ఇతర సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ధీటుగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య అందివ్వడమే ధ్యేయంగా ముందుకెళుతున్నామ‌ని, అందరి సహకారంతో వర్సిటీని ప్రగతి పథంలో పయనింప చేస్తున్నామని వీసీ తెలిపారు.
వెబ్‌సైట్‌: http://www.elsat.tv/convocation-live-1.html

Posted on 23-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning