ఏసీ, ప్లంబింగ్‌లలో శిక్షణ

* పదేళ్లలో 82,000 మందికి!
* ఎన్‌ఎస్‌డీసీతో ధనుశ్‌ ఇంజి జట్టు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌, ఎయిర్‌ కండీషనింగ్‌ (ఏసీ) మరమ్మతు, ప్లంబింగ్‌లలో శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ)తో హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్న ధనుశ్‌ ఇంజిసర్వీసెస్‌కు చెందిన ఎంఈపీ కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఈపీ (మెకానికల్‌/ఏసీ, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌) రంగంలో శిక్షణ ఇవ్వడంలో ధనుశ్‌ ఇంజిసర్వీసెస్‌కు పదేళ్ల అనుభవం ఉంది. ఒప్పందంలో భాగంగా వచ్చే పదేళ్లలో 82,000 మందికి విద్యుత్‌, ఏసీ మరమ్మతు, ప్లంబింగ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు ధనుశ్‌ ఇంజిసర్వీసెస్‌ ఎంఈపీ కేంద్రం సీఈఓ చక్రధర్‌ తెలిపారు. అయిదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదువుకున్న 44,626 మందిని ఎలక్ట్రీషియన్లు, ఏసీ, ప్లంబింగ్‌ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దాలని, ఈ రంగాల్లో 37,050 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు కేరళ, దిల్లీ తదితర ప్రదేశాల్లో కూడా కంపెనీకి కార్యాలయాలు ఉన్నాయి. నాణ్యమైన శిక్షణను భారీ స్థాయిలో ఇచ్చే వృత్తివిద్యా శిక్షణ ఇచ్చే సంస్థలను ప్రోత్సహించడానికి ఎన్‌ఎస్‌డీసీ కృషి చేస్తోంది. నిర్మాణ రంగంలో లభిస్తున్న ప్రతి వంద ఉద్యోగాల్లో 40 ఉద్యోగాలు ఎంఈపీ విభాగంలోనే ఉంటాయి. పెద్ద, పెద్ద నివాస, వ్యాపార భవనాలతోపాటు విమానాశ్రయాల వంటి మౌలిక సదుపాయాలు భారీగా నిర్మిస్తున్నందున ఎలక్ట్రీషియన్లు, ఏసీ, ప్లంబింగ్‌ టెక్నీషియన్లకు గిరాకీ అధికంగా ఉంది. శిక్షణ కాలం 45 రోజలు ఉంటుందని, రూ.8,000 రుసుము వసూలు చేస్తామని చక్రధర్‌ చెప్పారు.

Posted on 29-12-2014

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning