టెక్నాలజీ కొత్తపుంతలు...

* కొత్త పరిజ్ఞానం వైపు విద్యార్థుల చూపు
* వర్తమానంలో రెండు కొత్త టెక్నాలజీలే ట్రెండ్‌
* అవగాహనకు జేఎన్‌టీయూ వేదికగా జాతీయ సదస్సు
* తరలివచ్చిన రీసెర్చ్‌ స్కాలర్లు, ఇంజినీరింగ్‌ విద్యార్థులు

న్యూస్‌టుడే, విజయనగరం అర్బన్‌: సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది... కొంగొత్త పరిజ్ఞానం తెలుసుకునేందుకు పరిశోధకులతో పాటు ఉన్నత విద్యాకోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు... కంపెనీలు కూడా మార్కెట్లోకి వచ్చే కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకుని తమకు అనుగుణంగా మలుచుకునే దిశగా దృష్టిసారిస్తున్నాయి... అయితే కొత్త సాంకేతికతలో ముందులో ఉన్నవి క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌డేటా అని చెప్పవచ్చు... ఇవి ఇంజినీరింగ్‌ రంగంలో నిపుణులు, విద్యార్థుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి... ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ విజయనగరం ప్రాంగణం 'రీసెర్చ్‌ అండ్‌ చాలెంజెస్‌ అండ్‌ ఇష్యూస్‌ ఆన్‌ బిగ్‌డేటా అండ్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌' అంశంపై చేపట్టిన జాతీయస్థాయి సదస్సు టెక్నాలజీలకు వేదికగా నిలిచింది... వారంరోజుల జరిగిన ఈ సదస్సు జనవరి 31వ తేదీతో ముగియనుంది... సదస్సుకు టీసీఎస్‌, ఐడీఆర్‌బీటీ, ఐఐఐటీ హైదరాబాద్‌, కేంద్రియ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌, ఉస్మానియా విద్యాయలం, కాకినాడ జేఎన్‌టీయూ నిపుణులు హాజరయ్యారు. వీరితో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి ఫ్యాకల్టీ, ఇంజినీరింగ్‌ పీజీ విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్లు పాల్గొన్నారు. రెండు కొత్త పరిజ్ఞానాలపై అవగాహన నేపథ్యంలో వారు 'న్యూస్‌టుడే'తో ముచ్చటించారు. వారి మాటల్లోనే...
* కొత్త సాంకేతిక పరిజ్ఞానం.. బిగ్‌ డేటా - ఆర్‌.రాజేశ్వరరావు, సదస్సు సమన్వయాధికారి
ఇదో కొత్త సాంకేతిక పరిజ్ఞానం. ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న పరిజ్ఞానం ఇదే. ఓటర్ల వివరాలు, రుణమాఫీ, రేషనుకార్డుల్లో పరిజ్ఞానం ఉపయోగిస్తుంది. ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు, పారదర్శకత పెంచేందుకు పరిజ్ఞానం తోడ్పడుతుంది. రిటైల్‌ రంగంలో ఉత్పత్తులకు తెలుసుకునేందుకు, ఎవరెవరు ఏఏ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఉపయోగం. మార్కెట్‌ను విశ్లేషణ చేయడానికి, అందుకనుగుణంగా అంచనాలు రూపొందించుకోవడం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు ఉపయోగం.
* క్లౌడ్‌ కంప్యూటింగ్‌ - డి.రాజ్యలక్ష్మి, సదస్సు సమ్వయాధికారిణి
అంతర్జాల పరిజ్ఞానం ఇది. అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్‌ ద్వారా కొత్త అప్లికేషన్లు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించుకోచ్చు. కంపెనీలకు ఇటువంటి పరిజ్ఞానంతో పెట్టుబడులు, ఖర్చు తగ్గుతుంది. ప్రైవేటు రంగాలకు ఎక్కువ ఉపయోగకరం. ఉన్నడేటాను ఎలా విశ్లేషించుకోవాలి? ఎలా క్రోడీకరించుకోవాలి? పరిజ్ఞానం ద్వారా సులభతరం అవుతుంది. ఏఏ రంగాల్లో నిష్ణాతులు అవసరం, భవిష్యత్తు ఏమిటి అన్నది రూపొందించడానికి పరిజ్ఞానం ఉపయోగం ఎక్కువ. పరిజ్ఞానంలో సేవలు మేరకు వ్యయం చేసి ఉపయోగించుకోవచ్చు.
* సబ్జెక్టులో మెరుగైన విజ్ఞానం - బి.శ్రీసిగ్ధ, ఎంటెక్‌ సీఎస్‌ఈ ద్వితీయ సంవత్సరం
పరిశోధనకు, ఉద్యోగ అవకాశాలకు రెండు పరిజ్ఞానాలు ఎంతో ఉపయోగకరం. ఇప్పటివరకు థియరీగా తెలుసుకున్నాం. టెక్నాలజీని అప్లయి చేసుకునే విధానం తెలిసింది. కరికులంలో సబ్జెక్టుగా ఉంది. సబ్జెక్టు మీద విజ్ఞానం ముఖ్యం. సదస్సుకు ఎక్కువ మంది రావడంతో ఇతరుల ఆలోచనలతో కొత్త విషయాలు తెలిశాయి.
* అత్యవసర పరిజ్ఞానం - ఎస్‌.ప్రత్యూష, ఎంటెక్‌ విద్యార్థిని
డేటా స్టోరేజ్‌, కంప్యూటింగ్‌ ప్రొసెస్‌ చేయడం కష్టమైన పని. ఎలాంటి విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాలు ఐఐటీ, ఎన్‌ఐటీ, టీసీఎస్‌ కంపెనీల నిపుణులు తెలియజేశారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. పారిశ్రామిక సంస్థలకు అత్యవసర టెక్నాలజీగా ఉపయోగిస్తున్నారు. అందుకే చదువుతో పాటు పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం.
* రాబోయే తరానికి ఆధారం - కె.నిర్మల, ఫ్యాకల్టీ, శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, తిరుపతి
డేటా మైనింగ్‌పై పీహెచ్‌డీ చేస్తున్నాను. పిల్లలను ప్రాజెక్ట్సులో గైడ్‌ చేసేందుకు సదస్సు ఉపయోగపడుతుంది. రాబోయే తరం బిగ్‌డేటా మీదే ఆధారపడక తప్పదు. ఎక్కువ కంపెనీలు దీనిపై ఫోకస్‌ పెట్టాయి. ఉద్యోగాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. సదస్సు ప్రాక్టికల్‌గా ఉపయోగపడింది.
* పరిజ్ఞానంపై పరిశోధన - ఎ. రమణలక్ష్మి, ఫ్యాకల్టీ, పీవీపీ సిద్ధార్థ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విజయవాడ
బిగ్‌డేటా పరిజ్ఞానంపై పరిశోధన చేస్తున్నాను. ఇండస్ట్రీ నుంచి రిసోర్స్‌ పర్సన్లు రావడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కరికులం బోధించేందుకు ఉపయోగపడుతుంది. డేటాను ఎక్కువగా ఉపయోగించే విధానంలో పరిజ్ఞానం ఆవశ్యకత ఉంది. హుద్‌ హుద్‌ వంటి తుపాన్లు రాబోయే తరాలకు తెలియజేసేందుకు సమాచారాన్ని అట్టిపెట్టుకోవాల్సి ఉంది. ఇందుకోసం బిగ్‌డేటా పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

Posted on 31-1-2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning