35000 మందిని తీసుకుంటాం: టీసీఎస్‌

ముంబయి: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35,000 ప్రాంగణ నియామకాల లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని టీసీఎస్‌ సీఈఓ, ఎండీ ఎన్‌.చంద్రశేఖరన్‌ అన్నారు. నాస్‌కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరమ్‌ 2015లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే ప్రాంగణ నియామకాలను చేపడతామని చెప్పారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో నూతన, అనుభవజ్ఞుల ఉద్యోగుల నియామకాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నాస్‌కామ్‌ నిర్ణయించుకున్న ఐటీ ఎగుమతుల లక్ష్యం 12-14 శాతంపైనే తమ వృద్ధి రేటు ఉంటుందని అన్నారు. ఐటీ రంగానికి 2015-16వ సంవత్సరం ప్రోత్సాహకరంగానే ఉండొచ్చని, క్లయింట్ల బడ్జెట్లు, వ్యయాలు పెరగడానికి అవకాశం ఉందని చెప్పారు.

Posted on 12 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning