నియామక ప్రక్రియలో మార్పులు వచ్చాయ్‌!

ద్యోగ నియామక విధానం దాన్ని నిర్వహించే సంస్థల తీరుపై ఆధారపడి ఉంటుంది. కోర్‌ సంస్థలతో పోలిస్తే ఐటీ సంస్థలు పాటించే విధానాలు వేరు. సేవల తీరు, ఈ రంగంలో ఏర్పడిన మాంద్యం కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఐటీ సంస్థలు పాటించే విధానాల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి.
రాత పరీక్ష, హెచ్‌ఆర్‌ రౌండ్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగానే గతంలో ఈ కంపెనీలు నియామకాలు జరిపేవి. సంస్థలకు సాంకేతిక నైపుణ్యాల అవసరం పెరుగుతున్నకొద్దీ అభ్యర్థులనుంచి వారు చదివిన కోర్సుల్లోని కోర్‌ సబ్జెక్టుల ప్రాథమిక జ్ఞానాన్ని ఆశిస్తున్నాయి. మాంద్యం ఫలితంగా సంస్థలు తాజా అభ్యర్థుల (ఫ్రెషర్స్‌) కంటే అనుభవమున్నవారికే ప్రాధాన్యమిస్తున్నాయి.

 • సంబంధిత సబ్జెక్టులో విద్యార్థులు అనుభవం సంపాదించివుండాలని అవి ఆశిస్తున్నాయి. అందుకోసం ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లను అందిస్తూ శిక్షణ వ్యయం తగ్గించుకుంటున్నాయి.
  మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ కార్పొరేషన్‌ మొదలైన సంస్థలు ఎంపిక ప్రక్రియలో జావా సర్టిఫికేషన్‌, డీబీ2, ఆర్‌ఏడీ, మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కోర్సు మొదలైన విలువ ఆధారిత సర్టిఫికేషన్‌ కోర్సులు చేసినవారికే ప్రాధాన్యమిస్తున్నాయి.

  మూడు అంశాల్లో మార్పులు

  చాలా సంస్థలు విద్యార్థుల రీజనింగ్‌, వెర్బల్‌, రాత నైపుణ్యాలను పరీక్షించడానికి రాతపరీక్షను నిర్వహిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల్లో వచ్చిన మార్పేమిటంటే.. చాలా సంస్థలు రాతపరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడానికి అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను నియమించుకుంటున్నాయి. ఫలితంగా ఎక్కువమంది విద్యార్థులూ రాయవచ్చు. అలాగే ప్రశ్నలు పునరావృతం కాకుండానూ ఉంటాయి.
  చాలామంది విద్యార్థులు కోర్‌ సబ్జెక్టుల్లో తగినంత జ్ఞానం లేకపోవడం వల్ల టెక్నికల్‌ రౌండ్‌లో విఫలమవుతున్నారు. కాబట్టి విద్యార్థులు కోర్సు చేస్తున్నపుడే దానిపై ఆసక్తి పెంచుకోవాలి.
  గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు హెచ్‌ఆర్‌ రౌండ్‌లో విఫలమవుతున్నారు. భావవ్యక్తీకరణ నైపుణ్యాలు కొరవడడం, నిపుణుల కమిటీ అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం. తగినంత సాధారణ పరిజ్ఞానం (జనరల్‌ నాలెడ్జ్‌) లేకపోవడం వల్ల కూడా మౌఖికపరీక్షల్లో వైఫల్యం పొందుతున్నారు.
  నేర్చుకోవాల్సిన పాఠాలు
  * కోర్‌ సబ్జెక్టుల్లోని ప్రాథమింకాంశాలు, తమ రంగంలో ఆచరణాత్మక అన్వయంపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.
  * భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన అంశాలపై అవగాహనను మెరుగుపరచుకోవడానికి ఆంగ్ల దినపత్రికలు చదవడం, వార్తా చానళ్లను చూడడం అలవాటు చేసుకోవాలి.
  * వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఐఈఐ, ఐఎస్‌టీఈ, సీఎస్‌ఐ, ఐఈటీఈ, ఐఈఈఈ మొదలైన సొసైటీలను ఆశ్రయించవచ్చు.
  కావాల్సిన నైపుణ్యాలు
  మాంద్యం వల్ల ఏర్పడిన అధిక పోటీ దృష్ట్యా అభ్యర్థులు విద్యాపరమైన విషయాలతోపాటు కింది ఇచ్చిన అదనపు నైపుణ్యాలపైనా దృష్టిసారించాలి.
  * కొత్త టెక్నాలజీలతో పనిచేసేలా ఉండాలి.
  * కోర్‌ సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై పట్టు ఉండాలి.
  * వివిధ భావనల ఆచరణ/వినియోగం తెలిసుండాలి.
  * ఆటోకాడ్‌, డీబీ2, రాడ్‌, స్టాడ్‌ ప్రో, కాడెన్స్‌ మొదలైన అదనపు నైపుణ్యాలను సంపాదించుకోవాలి.
  * పారిశ్రామిక శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లలో మంచి జ్ఞానం సంపాదించుకోవాలి.
  * సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచుకోవాలి.
  అభ్యర్థి తన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కార్పొరేట్‌ వ్యక్తులతో ఎలా సంబంధబాంధవ్యాలు నిర్వహిస్తున్నాడో కూడా కొన్ని సంస్థలు తెలుసుకుంటున్నాయి. ఇందుకోసం లింకెడిన్‌ వంటి సోషల్‌ వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాయి. ఈ విషయాన్ని విద్యార్థులు మనసులో ఉంచుకుని తమ ఆన్‌లైన్‌ వ్యాపకాలను నిర్వహించాలి.
  సూచనలు
  * డ్రెస్‌ కోడ్‌ అభ్యర్థి వ్యక్తిత్వం, క్రమశిక్షణలను వ్యక్తీకరిస్తుంది. ఇంట్లో అద్దం ముందు రిహార్సల్‌ చేయడం మంచిది. తద్వారా డ్రెస్‌ ఎంపిక, బాడీ లాంగ్వేజ్‌లను సరిచూసుకోవడానికి తోడ్పడుతుంది.
  * ముఖకవళికలు ఆహ్లాదకరంగా, ఆకట్టుకునేలా ఉండాలి. చెప్పే సమాధానానికి అనుగుణంగా హావభావాలు ఉండాలి.
  * ఐటీ సంస్థల్లో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తల్లిదండ్రులూ, స్నేహితులూ, అధ్యాపకులతో రోజువారీ సంభాషణలను ఆంగ్లంలో కొనసాగిస్తుండటం మంచిది.
  * కాన్ఫరెన్సుల్లో పాల్గొనడం, టెక్నికల్‌ ఫెస్టులు, డిబేట్లు, అధ్యాపకులతో చర్చలు ఈ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సహకరిస్తాయి.
  * తరగతిలో ఉపాధ్యాయులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే అలవాటు చేసుకుంటే అది సబ్జెక్టుపై పట్టు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
  * సంస్థలో, సమావేశాలు, సదస్సుల్లో మర్యాదపూర్వక ప్రవర్తన మీ ప్రవర్తనా నైపుణ్యాలను అంచనా వేయడానికి సహకరిస్తాయి.
  రెజ్యూమె తయారీ
  రెజ్యూమెలో విద్యా సంబంధ విషయాలు, వృత్తి సంబంధమైన సంస్థల్లో సభ్యత్వం, కమ్యూనిటీల్లో ప్రమేయం, సహపాఠ్య కార్యకలాపాలు, ప్రత్యేక నైపుణ్యాలు, చేసిన ప్రాజెక్టు, ఇతర కార్యకలాపాలు, వ్యక్తిగత వివరాలుండాలి.
  పేపర్‌ ప్రెజెంటేషన్‌, కాన్ఫరెన్సుల్లో పాలుపంచుకోవడం వంటి సహపాఠ్య కార్యకలాపాలకు సంస్థలు ఎక్కువ ప్రాముఖ్యానిస్తాయి. చదువుకునే సమయంలో ఏదైనా పని చేసుంటే దాన్ని రెజ్యుమెలో ప్రముఖంగా పేర్కొనాలి.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning