77 శాతం ఎక్కువ పెరిగిన ఐఎస్‌బీ ప్రాంగణ నియామకాలు

* 21% మందికి కన్సెల్టింగ్‌ కంపెనీల్లో అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈసారి నియామకాలకు (ప్లేస్‌మెంట్స్‌)కు ఆఫ్రికా కంపెనీలు కూడా వచ్చాయి. హైదరాబాద్‌, మొహాలి ప్రాంగణాలలో నియామకాల ప్రక్రియ సాగుతోందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీల నియామకాలు 77 శాతం అధికంగా ఉన్నాయని ఐఎస్‌బీ వెల్లడించింది. ఈ సారి కూడా యాక్సెంచర్‌, డెలాయిట్‌, కేపీఎంజీ, మెకిన్సే, వెక్టర్‌ కన్సెల్టింగ్‌ వంటి ప్రముఖ కన్సెల్టింగ్‌ కంపెనీలు అధికంగా ఐఎస్‌బీ విద్యార్థులకు అవకాశం ఇచ్చాయి. 2015 క్లాస్‌ మొత్తం విద్యార్థుల్లో 21 శాతం మంది కన్సెల్టింగ్‌ కంపెనీల్లో చేరనున్నారని ఐఎస్‌బీ డైరెక్టర్‌ (కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ సర్వీసెస్‌) ఎం.పద్మనాభన్‌ తెలిపారు. అంతర్జాతీయ కన్సెల్టింగ్‌ సేవల్లో పాలుపంచుకోవడానికి డెలాయిట్‌ వంటి కంపెనీలు ఏడాదికి 30 నుంచి 40 మంది విద్యార్థుల నియమించుకుంటున్నట్లు వివరించారు. యాపిల్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి హై టెక్నాలజీ కంపెనీలు, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, విప్రో వంటి ఐటీ ఉత్పత్తులు, సొల్యూషన్ల కంపెనీలు, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఇ-కామర్స్‌ కంపెనీలు మొత్తం విద్యార్థుల్లో దాదాపు 38 శాతం మందికి ఆఫర్లు ఇచ్చాయి.
ఈసారి వర్థమాన దేశాలకు చెందిన కంపెనీల నుంచి ఆఫర్లు అధికంగా ఉన్నాయి. అనేక మంది ఐఎస్‌బీ విద్యార్థులకు ఐఎస్‌బీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజిమెంట్‌ (పీజీపీ) కోర్సులో చేరడానికంటే ముందే విదేశాల్లో పని చేసిన అనుభవం ఉండడం, వర్థమాన దేశాల మార్కెట్ల ధోరణులు తెలియడం వంటి సానుకూల అంశాల కారణంగా సింగపూర్‌, చైనా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్‌ ప్రాంతాల్లో పని చేయడానికి కంపెనీలు విద్యార్థులను నియమించుకుంటున్నాయి. ఐఎస్‌బీ నుంచి ప్రతి ఏడాది 760 మంది పీజీపీ పూర్తి చేస్తున్నారు.

Posted on 26 - 02 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning