మరో 30,000 మంది విదేశీ ఐటీ నిపుణులకు అవకాశం

* 2020 నాటికి 60,000 నియామకాలు
దిల్లీ: భారత్‌ నుంచి నైపుణ్యం కలిగిన ఐటీ సాంకేతిక నిపుణులను ఎక్కువ సంఖ్యలో నియమించు కోవాలని జపాన్‌ భావిస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో 30,000 మంది విదేశీ ఐటీ నిపుణులుండగా, 2020 నాటికి వీరి సంఖ్యను 60,000కు పెంచాలన్నది లక్ష్యమని జపాన్‌ వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి యొయిచీ మియజావ తెలిపారు. అధిక నైపుణ్యం కలిగిన భారతీయ ఇంజినీర్లు వస్తేనే విదేశీ ఐటీ నిపుణులు మరో 30,000 మంది సమకూరుతారని పేర్కొన్నారు. ఏప్రిల్ 30న కేంద్ర ఐటీశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. సమాచారం, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరు మంత్రులు చర్చించారు.
Posted on 01 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning