పనిచేస్తూనే.. 'పట్టా' తెచ్చుకో..!

 • * పరిశ్రమల్లో ఉద్యోగం చేసే వారికి కొత్త కోర్సులు
  * జేఎన్‌టీయూహెచ్‌ లో వచ్చే ఏడాది నుంచి మరిన్ని కోర్సులు

  హైద‌రాబాద్‌, న్యూస్‌టుడే: పనిచేస్తూ ఉన్నత చదువులు చదువుకొని మంచి స్థానాలను అధిరోహించాలనేకునే అభ్యర్థులకు జేఎన్‌టీయూ హైద‌రాబాద్‌ లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు.
  ఇవి దూరవిద్య తరహాలోనే ఉన్నా.. ఏడాదిలో మూడు, నాలుగు విడతలుగా 30 రోజుల పాటు తరగతులకు హాజరు కావాలి.

  ఆ సమయంలో సెలవులు పెట్టుకుంటే సరిపోతుందని ఆచార్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై పలు పరిశ్రమల్లో ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
  స్పాట్‌ అడ్మిషన్స్‌ డిసెంబ‌రు 21న...
  పీజీ డిప్లోమా ఇన్‌ ఇండస్ట్రీయల్‌ సేఫ్టీ కోర్సుకు డిసెంబ‌రు 21న వర్సిటీ ప్రవేశాల భవనంలో స్పాట్‌ అడ్మిషన్స్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కంటిన్యూయింట్‌ ఒప్పంద పద్ధతిలో దీన్ని నిర్వహించనున్నామని, సుమారు 100 సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. విడతల వారీగా ఏడాదిలో 40 రోజులపాటు తరగతులు ఉంటాయి. కోర్సు ఫీజు రూ.30వేలుగా నిర్ణయించారు. పరిశ్రమల నిర్వాహకుల సూచనలు, సలహాలతోనే డిప్లొమా కోర్సులు ప్రారంభించినట్లు రిజిస్ట్రార్‌ రమణారావు తెలిపారు.
  వచ్చే ఏడాది మరిన్ని..
  2013-14 విద్యా సంవత్సరంలో మరిన్ని డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను వర్సిటీ ఆఫర్‌ చేయనుంది. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటిలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు, కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను డిప్లొమా కింద.. రిమోట్‌సెన్సింగ్‌, జీఐఎస్‌, రెగ్యులేటరీ అఫైర్స్‌ తదితర కోర్సులను సర్టిఫికెట్‌ తరహాలో అందించేందుకు ప్రణాళికలుగా పెట్టుకున్నామని ఎస్‌సీడీఈ సంచాలకుడు డా.బి.వెంకటేశ్వరరావు తెలిపారు.
  పార్ట్‌టైం కోర్సులకు ప్రతిపాదనలు..
  పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. సీసీసీ తరహాలో బీటెక్‌ తరగతులు ఆపేసిన నేపథ్యంలో పార్ట్‌టైం కోర్సులను ప్రవేశపెట్టే యోచనలో అధికారులు ఉన్నారు. షిఫ్ట్‌ల వారీగా ఉన్న ఉద్యోగులు రోజూ సాయంత్రం వేళ తరగతులకు హాజరవుతారా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. ఈ కోర్సులకు ఎంటెక్‌ పార్ట్‌టైం కోర్సుల్లాగే నిర్వహించాలని కొందరు ప్రతిపాదిస్తున్నారు.
  ఎస్‌సీడీఈకి పూర్వవైభవం..!
  1983లో ప్రారంభమైన ఎస్‌సీడీఈ (స్కూల్‌ ఆఫ్‌ కంటిన్యూయింగ్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌) సీసీసీ తరహాలో ఏడాదికి వెయ్యిమంది పట్టాదారులను బయటకు పంపించాం. ముఖ్యంగా పాలిటెక్నికల్‌ చదివి ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థానాల్లో స్థిరపడాలనే ఆకాంక్ష ఉన్న వారికి ఇదొక వరంగా మారింది. టెక్నికల్‌ కోర్సులను దూరవిద్య తరహాలో నిర్వహించరాదని ఢిల్లీలో తీసుకున్న నిర్ణయం మేరకు అన్నీ రాష్ట్రాల్లో ఈ తరహా కోర్సులను ఆపేయడంతో మేము ఇక్కడ 2010నుంచి ప్రవేశాలు నిలిపివేశాం.
  మరిన్ని వివరాలకు www.jntuh.ac.inవెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
                                                          - డా.బి.వెంకటేశ్వరరావు, ఎస్‌సీడీఈ
                                                            సంచాలకుడు, జేఎన్‌టీయూ-హెచ్‌.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning