ఏరోస్పేస్‌ ఏరోనాటిక్స్‌లో ఆధునిక కోర్సులు

* ఐఐఎఎస్‌టీఎమ్‌ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: ఏరోస్పేస్‌, ఏరోనాటిక్స్‌ వంటి ఆధునిక కోర్సులతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎఎస్‌టీఎమ్‌) సంస్థ మే 18న ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థ డిప్లమో ఇన్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మెయింట్‌నెన్స్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, యునిక్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం కోర్సులను అందిస్తున్నట్లు తెలిపింది. ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ కోర్సులో శాటిలైట్‌ సిస్టమ్స్‌, లాంచ్‌ వెహికల్స్‌, రాకెట్స్‌, ప్లేన్స్‌, ఇతర అంతరిక్ష సంబంధిత పరికరాలపరిశోధన, రూపకల్పన తదితర అంశాలలో శిక్షణ ఉంటుందని పేర్కొంది. వివరాలకు సంస్థ ఫోన్‌ నెం. 09347253325, 09393660097, e-mail: iiastm @yahoo.com, www.civilaviationindia.comలో సంప్రదించాలి.
సంస్థ అందించే కోర్సుల వివరాలు
* డిప్లమో ఇన్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌(3 సంవత్సరాలు)
విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* ఎయిర్‌క్రాఫ్ట్స్‌ మెయింట్‌నెన్స్‌ ఇంజినీరింగ్‌(3 సంవత్సరాలు)
విద్యార్హత: ఇంటర్ (ఎంపీసీ)లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
* బీటెక్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ (4 సంవత్సరాలు)
విద్యార్హత: ఇంటర్ ఎంపీసీ గ్రూప్‌లో ఉతీర్ణులై ఉండాలి.
* యునిక్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం(కాలపరిమితి 8సంవత్సరాలు)
( పదో తరగతి అనంతరం ఈకోర్సులో చేరితే ఎంటెక్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌తో బయటకొస్తారు)
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఇతర వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా:
Indina Institute of Aerospace Technology & Management
Sy.No. 158and160, Kompally X Roads, Kompally, Secunderabad, Telangana-500100
Tel: 09347253325, 09393660097
e-mail: iiastm@yahoo.com
www.civilaviationindia.com


Posted on 19 - 05 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning