విశాఖలో ఐఐఎం

* దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఐఐఎంల ఏర్పాటు
దిల్లీ: దేశవ్యాప్తంగా మరో ఆరు ఐఐఎంలను (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేయటానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌), బోధ్‌గయ (బిహార్‌), సిర్మార్‌ (హిమాచల్‌ప్రదేశ్‌), నాగ్‌పూర్‌ (మహారాష్ట్ర), సంబల్‌పూర్‌ (ఒడిశా), అమృత్‌సర్‌ (పంజాబ్‌)లలో కొత్త ఐఐఎంలు ఏర్పాటుకానున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిల్లో కోర్సులు ప్రారంభమవుతాయి. పీజీకోర్సుకు తొలుత 140 మంది విద్యార్థులను తీసుకుంటాయి. ఏడేళ్ల తర్వాత ఈ సంఖ్య 560కి చేరుకుంటుంది. జూన్ 24న కేంద్రమంత్రివర్గ సమావేశానంతరం విడుదలైన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గతంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. కొత్తగా ఐదు ఐఐఎంలను ఏర్పాటుచేయనున్నట్లుగా తెలిపారు. వీటితోపాటు.. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఐఐఎంను నెలకొల్పనున్నట్లుగా వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒడిశాలో రాజధాని భువనేశ్వర్‌లో కొత్త ఐఐఎంను ఏర్పాటుచేయాలని మొదట భావించినప్పటికీ.. పశ్చిమ ఒడిశా ప్రజల కోరిక మేరకు సంబల్‌పూర్‌ను నిర్ణయించారు. దీనికి కూడా కేంద్రం అంగీకరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 ఐఐఎంలున్నాయి.
Posted on 25 - 06 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning