యునినార్‌ 'యాప్‌' పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌)లను అభివృద్ధి చేసే వారిని ప్రోత్సహించేందుకు డిజిటల్‌ విన్నర్స్‌ (డీడబ్ల్యూ) 2015 పోటీని యునినార్‌ ప్రకటించింది. విద్యా రంగానికి యాప్‌లను అభివృద్ధి చేస్తున్న విద్యార్థులు, డెవలపర్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ పోటీలో పాలుపంచుకోవాలని టెలివింగ్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌ అధిపతి శ్రీనాథ్‌ కోటియన్‌ కోరారు. ఈ కంపెనీ యునినార్‌ పేరుతో టెలికాం సేవలను అందిస్తోంది. ఔత్సాహికులు తమ పేర్లను, యాప్‌ వివరాలను http://www.internetforall.in/ లో ఆగస్టు 10 వరకు నమోదు చేసుకోవచ్చు. 10 యాప్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసి నిపుణులతో కూడిన బృందం విజేతను నిర్ణయిస్తుంది. 'డిజిటల్‌ విన్నర్స్‌' విజేతకు ఈ ఏడాది అక్టోబరులో ఓస్లోలో జరిగే డిజిటల్‌ విన్నర్స్‌ కాన్ఫరెన్స్‌లో భారత్‌కు ప్రాతినిద్యం వహించే అవకాశం లభిస్తుంది. టెలినార్‌ నిర్వహించే 'ఆసియా ఉత్తమ యాప్‌' పోటీలో కూడా పాల్గొనవచ్చు. దాదాపు రూ.7.8 లక్షల బహుమతి పొందొచ్చని శ్రీనాథ్‌ వివరించారు. ఫీచర్‌ ఫోన్‌లో 2జీ టెక్నాలజీపై పని చేసే యాప్‌కు ప్రాధాన్యం ఇస్తామన్నారు.
Posted on 16 - 07 - 2015

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning