ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో ఏ మార్పులు?

ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే పోటీ పరీక్షల్లో యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఈఎస్‌ఈ) ఎంతో ప్రాధాన్యమున్నది. 2017 నుంచి ఈ పరీక్ష విధానంలో, సిలబస్‌లో మార్పులను ప్రకటించారు. వాటిని ఆకళింపు చేసుకోవటంలో రేపటి అభ్యర్థులకు తోడ్పడే కథనమిది...
జాతీయస్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు వంటి ‘గ్రూప్‌ ఎ’ ఉద్యోగాల భర్తీ కోసం ఈఎస్‌ఈను నిర్వహిస్తున్నారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. ఇండియన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిలిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజినీరింగ్‌, నావల్‌, సెంట్రల్‌ పవర్‌, టెలికాం, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి. 7వ వేతనసంఘం సిఫార్సులతో మొదటి నెల జీతం 70- 75వేల రూపాయల వరకు లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, అత్యున్నత స్థాయికి చేరుకొనే పదోన్నతులు, ఉద్యోగ భద్రత ఉంటాయి. ఈ 2016 వరకు ఈఎస్‌ఈలో ఉన్నది రెండు దశలు మాత్రమే. మొదటిది రాత పరీక్ష (ఐదు పేపర్లు, 1000 మార్కులు), రెండోది మౌఖిక పరీక్ష (200 మార్కులు). మొత్తం 1200 మార్కులు.
స్టేజ్‌ 1 + స్టేజ్‌ 2 = 1100 మార్కులు
ఈ పరీక్ష స్టేజ్‌ 1 నుంచి మూడు/ నాలుగు నెలల తర్వాత జులై 2017లో ఉండవచ్చు. ఈ రెండు పేపర్లలో కనీస అర్హత మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది.
కొత్త విధానంలో కన్వెన్షనల్‌ ప్రశ్నపత్రాలకు 600 మార్కులు. పాత విధానంలో 400 మార్కులు మాత్రమే. అంటే కన్వెన్షనల్‌ ప్రశ్నపత్రాల వెయిటేజి పెరిగింది. కన్వెన్షనల్‌ ప్రశ్నలు డిజైన్‌ ఆధారిత అధిక నిడివి గలవిగా ఉంటాయి. చదవడంతోపాటు వీటిని రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.
స్టేజ్‌ 3: మౌఖిక పరీక్ష (పర్సనాలిటీ టెస్ట్‌): 200 మార్కులు
* ఈ రెండు స్టేజ్‌లలో సాధించిన మార్కుల ఆధారంగా (1100 మార్కులకుగాను) అభ్యర్థులను 1:2 నుంచి 1:2.5 నిష్పత్తిలో స్టేజ్‌ 3 (పర్సనల్‌ ఇంటర్వ్యూ) పరీక్షకు అనుమతి ఇస్తారు.
* దీనిలో అభ్యర్థి ఆలోచన విధానం, శక్తి సామర్ధ్యాలు, నీతి నిజాయతీలను అంచనా వేస్తారు. రెండు సంవత్సరాలుగా ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలకూ, హాబీలకూ కొంత ప్రాముఖ్యమిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు.
* ఉద్యోగం చేస్తున్నా, ఎంటెక్‌ చేస్తున్నా సంబంధిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక, వర్తమాన అంశాల గురించి కూడా అడగవచ్చు. అన్నిరకాలుగా సిద్ధంగా ఉండి ప్రణాళిక ప్రకారం వెళితే అధిక మార్కులు సాధించవచ్చు.
తుది ఎంపిక జాబితా: మూడు స్టేజ్‌లలో కలిపి 1300 మార్కులకు గాను వచ్చిన మార్కుల ఆధారంగా, ఉన్న ఖాళీలకు అనుగుణంగా జాబితాను రూపొందిస్తారు.
కొత్త విధానంలో సిలబస్‌
స్టేజ్‌ 1 (ప్రిలిమినరీ): దీనిలో రెండు పేపర్లు ఉన్నాయి.
మొదటి పేపర్‌ సిలబస్‌: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌. నూతన విధానంలో జనరల్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టు ఉండదు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులకు కొంత మేలు జరుగుతుంది. సంప్రదాయ జనరల్‌ స్టడీస్‌ విషయాలైన హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, లైఫ్‌ సైన్స్‌లను తొలగించారు. ఈ పేపర్‌ గత సంవత్సరాల మొదటి పేపర్‌తో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఇందులో మొత్తం పది అంశాలతో కలిపి కొత్త సిలబస్‌ను రూపొందించారు.
నూతన విధానంలో జనరల్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టు ఉండదు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులకు కొంత మేలు జరుగుతుంది. సంప్రదాయ జనరల్‌ స్టడీస్‌ విషయాలైన హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, లైఫ్‌ సైన్స్‌లను తొలగించారు. ఈ పేపర్‌ గత సంవత్సరాల మొదటి పేపర్‌తో పోలిస్తే చాలా విభిన్నం.
జనరల్‌ స్టడీస్‌లో నిర్దేశించిన మొదటి అంశం తప్ప మిగతా అంశాలు చాలావరకు ఇంజినీరింగ్‌ అభ్యర్థులు తమ 4 సంవత్సరాల బీటెక్‌/ బీఈలో చదువుతారు.
* మొదటి అంశానికి వర్తమాన అంశాలపై తగిన అవగాహన ఉంటే సరిపోతుంది. గతంతో పోలిస్తే ఈ పేపర్‌ చాలా తేలిక. అంతేకాదు, ఉద్యోగంలో చేరిన తర్వాత నిత్యం ఉద్యోగ నిర్వహణలో ఈ అంశాలపై అవగాహన ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఉద్యోగ సామర్థ్యం పెరగడంతోపాటు సమాజానికి మేలు జరుగుతుంది.
* జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో నిర్దేశించిన పది అంశాల నుంచి కనీసం 5 శాతం అంటే 10 మార్కులు, గరిష్ఠంగా 15 శాతం అంటే 30 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.
రెండో పేపర్‌ సిలబస్‌: అభ్యర్థి సంబంధిత కోర్‌ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుకు సంబంధించి ఉంటుంది.
గమనిక: కోర్‌ సబ్జెక్టుల్లో కూడా సిలబస్‌లో స్వల్ప మార్కులు చోటు చేసుకున్నాయి. ఆ సమాచారం యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో క్లుప్తంగా పొందుపరిచారు.
* వివిధ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో అనేక నూతన ఆవిష్కరణలు, అప్లికేషన్స్‌ అవసరం. దీనికి అనుగుణంగా ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల సిలబస్‌ కూడా 15- 20 శాతం వరకూ పెంచారు. కొన్ని కాలం చెల్లిన విషయాలను తొలగించారు.
స్టేజ్‌ 2 (మెయిన్స్‌):
స్టేజ్‌ 1లోని ఇంజినీరింగ్‌ సిలబస్‌ని రెండు పేపర్లుగా విభజించారు. ఈ రెండు పేపర్లూ సంబంధిత కోర్‌ సబ్జెక్టులకు సంబంధించినవే.
* కొత్త విధానంలో మార్కులతోపాటు సమయం కూడా పెరిగింది. కాబట్టి ప్రాథమికాంశాలతో పాటు అడ్వాన్స్‌డ్‌ విషయాలపై పూర్తిస్థాయి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉండవచ్చు.
కొత్తగా చేర్చిన సబ్జెక్టులు బీటెక్‌లో ఎలక్టివ్‌గా లేదా ఎంటెక్‌ ప్రథమ సంవత్సరంలో చదివే విషయాలు ఉన్నాయి. కానీ ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. క్రమబద్ధంగా, పటిష్ఠ ప్రణాళికతో నాలుగు సంవత్సరాల బీటెక్‌ సిలబస్‌ చదివితే సరిపోతుంది.
ఇలా సిద్ధమైతే మేలు
ఈఎస్‌ఈ-2016 వరకూ అందరూ జనవరి/ ఫిబ్రవరిలో జరిగే గేట్‌ వరకు కామన్‌ సబ్జెక్టులను అధ్యయనం చేసేవారు. తర్వాత అదనపు ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు, జనరల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌లపై దృష్టి పెట్టేవారు. ఆ పద్ధతి ఇకపై చెల్లదు. ఎందుకంటే స్టేజ్‌ 1 ప్రిలిమినరీ ఫిబ్రవరిలో ఉండవచ్చు. అందుకే మొత్తం సిలబస్‌ (జనరల్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు) ముందుగానే చదవాలి. స్టేజ్‌ 1 వరకూ పూర్తి కాన్సెప్టులతోపాటు ముఖ్యమైన డెరివేషన్స్‌, వివిధ రకాల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు, కొన్ని ఎక్కువ నిడివిగల ప్రశ్నలు సాధన చేయడం ఎంతైనా మంచిది. స్టేజ్‌ 1 తర్వాత స్టేజ్‌ 2 వరకు ఉన్న మూడు- నాలుగు నెలల సమయంలో ఎక్కువ నిడివిగల అన్నిరకాల ప్రశ్నల సాధనా చేయవచ్చు.
నమూనా ప్రశ్నపత్రాలు: గతంలో సివిల్‌ సర్వీసెస్‌ విధానం మారినప్పుడు యూపీఎస్‌సీ వారు మాదిరి ప్రశ్నపత్రాలు తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. అదేవిధంగా మారిన ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ విధానానికి అనుగుణంగా మాదిరి ప్రశ్నపత్రాలను యూపీఎస్‌సీ తమ వెబ్‌సైట్‌లో త్వరలో పొందుపరిచే అవకాశం ఉంది.


Posted on 07-03-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning