గెలుపు పిలుపు విందామా?

దేశంలోనే అత్యున్నత స్థాయిలో యువత పోటీపడే పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌. దీనిలో గెలుపు బావుటాను ఎగురవేసిన ప్రతి ఒక్కరి ప్రయాణం స్ఫూర్తినిచ్చేదే. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉన్నప్పటికీ సడలని సంకల్పం, అవిరళ కృషీ అందరికీ ఒకటే.
పత్రికా వ్యాసాల చర్చలు పట్టు పెంచాయి
పరిజ్ఞానానికి పదును పెట్టుకుంటూ, లోపాలను సవరించుకుంటూ, 65వ ర్యాంకుతో ఆశించిన ఐఏఎస్‌ను మూడో ప్రయత్నంలో సాధించింది వల్లూరు క్రాంతి. కర్నూలుకు చెందిన ఈమె తన సివిల్స్‌ ప్రస్థాన విశేషాలను ‘చదువు’తో పంచుకుంది. అవన్నీ తన మాటల్లోనే..
సివిల్స్‌ రాయటానికి ప్రేరణ మా నాన్నగారే. చిన్నప్పటినుంచీ ఐఏఎస్‌ అవ్వాలని నన్ను ప్రోత్సహించేవారు. ‘అత్యుత్తమ సర్వీసుల్లో ఐఏఎస్‌ ఒకటి’ అని చెపుతుండేవారు. ఐఐటీ దిల్లీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (2008-2012) చదివేటపుడు నాక్కూడా ఇదే అనిపించింది. ఈ ఒక్క ఉద్యోగంలోనే ప్రజాసేవకు వీలు, నాయకత్వ అవకాశాలు, వైవిధ్యం ఉన్నాయని గ్రహించాను. దీంతో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నా.
నిర్మాణాత్మకంగా నా ప్రయత్నాలు ప్రారంభించింది 2012 జూన్‌ నుంచి. జనరల్‌స్టడీస్‌, మ్యాథమేటిక్స్‌ కోచింగ్‌ దిల్లీలో తీసుకోవడం మొదలుపెట్టాను. రోజూ వార్తాపత్రికలు చదివి, నోట్సు రాయటం ఆరంభించాను. ఈ రకంగా సివిల్స్‌ సమరంలో అడుగుపెట్టాను.
2013 సివిల్స్‌ పరీక్షను మొదటిసారి రాశాను. మ్యాథ్స్‌ ఆప్షనల్‌ చదవటానికి ఏడాది పడుతుంది. నాకు సమయం సరిపోలేదు. జనరల్‌స్టడీస్‌లో, మ్యాథ్స్‌లో సగటు మార్కులే వచ్చాయి. ఇంటర్‌వ్యూలో 198 మార్కులు తెచ్చుకున్నందుకు ర్యాంకు (562) వచ్చింది. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌)లో చేరాను.
జనరల్‌ స్టడీస్‌, మ్యాథ్స్‌లో నా స్థాయిని మెరుగుపరుచుకోవటానికి చాలా అవకాశం ఉందని గ్రహించాను.
2014 సివిల్స్‌ పరీక్షకు 6 నెలల వ్యవధి మాత్రమే దొరికింది. మ్యాథ్స్‌ అయితే స్కోరింగ్‌. కాబట్టి జనరల్‌ స్టడీస్‌ కంటే మ్యాథ్స్‌కు సమయం ఎక్కువ కేటాయిస్తే ఫలితం ఎక్కువ ఉంటుందని అనుకున్నాను.
రోజుకు ఐదు గంటలు మ్యాథ్స్‌ చేసేదాన్ని. అంతకుముందు సంవత్సరం వ్యాసం (ఎస్సే)లో చాలామందికి 140 మార్కులు వచ్చాయి. నాకేమో 100 మార్కులే వచ్చాయి. అందుకని బాగా సాధన చేశాను. 15-20 వ్యాసాలు రాసి, అవి ఏ రకంగా ఉన్నాయో అభిప్రాయాలు తీసుకున్నాను. జనరల్‌ స్టడీస్‌కి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను.
మార్కులు కూడా అలాగే వచ్చాయి. మ్యాథ్స్‌: 306, ఎస్సే: 145; జీఎస్‌: 304 (చాలామందికి దాదాపు 360 వచ్చాయి).
ఇంటర్వ్యూ ముందు ఒక సర్జరీ అయినందువల్ల మార్కులు సరిగా రాలేదు. 176 మార్కులు మాత్రమే వచ్చాయి. 230 ర్యాంకు లభించింది! ఈసారి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాను.
నాగ్‌పూర్‌లో శిక్షణ. నా ఐఏఎస్‌ మధుర స్వప్నం ఇంకా అలాగే ఉంది!
టాప్‌ 100లో ర్యాంకు రావాలంటే అన్ని సబ్జెక్టుల్లోనూ మార్కులు బాగా రావాలనిపించింది. ఇక మూడో ప్రయత్నమే చివరి ప్రయత్నమని నిశ్చయించుకున్నాను. జనరల్‌ స్టడీస్‌లో మార్కులు బాగా తెచ్చుకోవాలనుకున్నాను.
నా మూడో ప్రయత్నం- 2015 సివిల్స్‌ పరీక్ష రాయటం.
జనరల్‌స్టడీస్‌లో ప్రతిసారీ మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయో స్నేహితులతో చర్చలు చేశాను. లోపాలేమిటో గ్రహించాను. అవి-
* జవాబులు (ఆన్సర్‌ రైటింగ్‌) అభ్యాసం చేయకపోవటం.
* కరంట్‌ అఫైర్స్‌ విశ్లేషణ సరిగ్గా చేయకపోవటం.
దీంతో దాదాపు ప్రతిరోజూ 'Insights of India'వెబ్‌సైట్‌ నుంచి మూడు ప్రశ్నలు ఎంచుకుని సమాధానాలు రాస్తూవచ్చాను. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు కూడా విశ్లేషించటం మొదలుపెట్టాను. స్నేహితులతో చర్చించేదాన్ని. పత్రికల్లో వచ్చే వ్యాసాలపై బృందంగా చర్చించేవాళ్ళం. టెస్ట్‌ సిరీస్‌ను శ్రద్ధగా రాశాను.అన్ని అంశాలపై దృష్టి పెడుతూ ఐఏఎస్‌ వచ్చే మంచి ర్యాంకు తెచ్చుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగాను. 65వ ర్యాంకు సాధించాను... నా అభిలాష నెరవేరింది!
నా సివిల్స్‌ సాధనకు అమ్మానాన్నలు వేంకట రంగారెడ్డి, వరలక్ష్మి; అధ్యాపకులూ, సీనియర్లూ, స్నేహితులూ ఎంతో తోడ్పడ్డారు. మార్గదర్శనం చేసిన నితీష్‌ కె. (మ్యాథ్స్‌), ఆశీష్‌ సంగ్వాన్‌ (జీఎస్‌), జోసెఫ్‌ (ఎస్సే)లకు కృతజ్ఞతలు తెలుపుకోవడం నా బాధ్యత.
ఆశావహులూ...ఇవి ప్రధానం!
సివిల్స్‌కు 1 - 2 సంవత్సరాల అంకితభావంతో కూడిన సన్నద్ధత అవసరం.
* పాఠశాల దశ నుంచే వార్తాపత్రికలను చదవటం అలవాటు చేసుకోవటం మేలు.
* సానుకూల దృక్పథంతో, స్థిర సంకల్పంతో ఉండాలి.
* నిలకడగా కష్టపడి అధ్యయనం చేయడానికి సిద్ధపడాలి.
* బాగా ఆసక్తి ఉన్న, మార్గదర్శకత్వం లభించే వీలున్న ఆప్షనల్‌ను ఎంచుకోండి.
* ఒత్తిడి లేని, ప్రణాళికాబద్ధమైనదే అత్యుత్తమ ప్రిపరేషన్‌. ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకుంటుండాలి.

ఎన్నో కోచింగ్‌ కేంద్రాల టెస్ట్‌ సిరీస్‌కు జవాబులు రాశాను. వివిధ అంశాలపై స్నేహితులతో చర్చించాను. దీనిమూలంగా క్లిష్టమైన, అస్పష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు రాయగలిగాను!

సివిల్స్‌ మూడు దశల్లో అభ్యర్థుల వ్యూహం ఎలా ఉండాలో నా అనుభవంతో చెప్తున్నా...
ప్రిలిమ్స్‌: ఈ పరీక్షను నెగ్గటం చాలా కష్టం. అందుకని దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు.
* పాలిటీ, ఎకానమీ, హిస్టరీ లాంటి సబ్జెక్టులను పక్కాగా అధ్యయనం చేయాలి. ఎన్‌సీఈఆర్‌టీ లాంటి ప్రామాణిక పుస్తకాలను అనుసరించాలి.
* సంవత్సర కాలపు వార్తాపత్రికల పరిజ్ఞానం చాలా ముఖ్యం. పర్యావరణం, మానవ హక్కులు మొదలైన అంశాల్లో అంతర్జాతీయ సంస్థలపై దృష్టిపెట్టాలి. వివిధ అంశాల నేపథ్యాన్ని కుతూహలంతో తెలుసుకోవాలి. దీనికి అంతర్జాలం (ఇంటర్నెట్‌)ను ఉపయోగించవచ్చు. వార్తలను చదివేటపుడు ప్రిలిమ్స్‌కే కాకుండా మెయిన్స్‌కూ ఉపయోగపడేలా నోట్సు రాస్తుండాలి.
* పూర్వపు సంవత్సరాల ప్రశ్నలను సాధన చేయాలి. టెస్ట్‌ సిరీస్‌ను శ్రద్ధగా రాయాలి.
* చదివిన అంశాలను పునశ్చరణ చేస్తుండాలి.
* సంస్కృతి మొదలైనవాటికంటే ముఖ్యమైన అంశాలైన పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీలకు ఎక్కువ సమయం వెచ్చించాలి.
మెయిన్స్‌: ‘మీరు చదివినంతమాత్రాన్నే మార్కులు వచ్చెయ్యవు. మీరేం రాశారో, అవి మాత్రమే మార్కులను సాధించిపెడతాయి’. కాబట్టి జవాబులు రాయటం, సాధన చేయడం చాలా ప్రధానమైన విషయం.
* వార్తాపత్రికల పఠనం చాలా చాలా ముఖ్యం.
* ఏది ముఖ్యమైన వార్త, ఏది కాదు అనే తేడా గమనించి చదవాలి.
* కోచింగ్‌ నోట్సు కాకుండా సొంతంగా నోట్సు సిద్ధం చేసుకోవాలి.
* నేను వివిధ కోచింగ్‌ కేంద్రాల టెస్ట్‌ సిరీస్‌ ప్రశ్నపత్రాలను కొన్నాను. వాటికి జవాబులు రాశాను. వాటన్నిటిపై చర్చించాను. దీనిమూలంగా క్లిష్టమైన, అస్పష్టమైన ప్రశ్నలకు కూడా జవాబులు రాయగలి గాను!
* జనరల్‌ స్టడీస్‌ జవాబులను మెరుగుపర్చుకోవడానికి స్పాట్‌లైట్‌ అనాలిసిస్‌, బిట్‌ పిక్చర్‌ వీడియోలు (ఎంపిక చేసినవి), పీఐబీ వెబ్‌సైట్‌ ఉపకరించాయి.
* మ్యాథ్స్‌ అయితే ఎంతో సాధన చేసేదాన్ని. టెస్ట్‌ సిరీస్‌ రాశాను.
ఇంటర్వ్యూ: ఈ మౌఖిక పరీక్ష చాలా కీలకమైనది. దీన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మెయిన్స్‌ అయిపోయిందని రిలాక్స్‌ అయిపోకూడదు. ఇంటర్వ్యూకు కూడా ఎంతో చదవాల్సివుంటుంది.
* బయోడేటా- పేరు, వూరు, విద్యార్హతలు, అభిరుచులు (హాబీలు) గురించి సంపూర్ణ అవగాహనతో ఉండాలి.
* వర్తమాన అంశాల మీద సమతూకమైన అభిప్రాయాలతో ఉండాలి.
* అద్దం ముందు వివిధ అంశాలపై మాట్లాడటం సాధన చేయాలి. రోజూ పది నిమిషాలు ఇలా చేస్తే చాలా ఉపయోగం.
* ఇంటర్వ్యూలో ఆహ్లాదకరంగా, ఆత్మవిశ్వాసంతో కనిపించటం అవసరం. కళ్ళలోకి చూస్తూ మాట్లాడగలగాలి.
* సన్నద్ధ సమయంలో గానీ, ఇంటర్వ్యూ సందర్భంగా గానీ ఒత్తిడికి గురవకూడదు. దానివల్ల పూర్తిస్థాయిలో ప్రతిభను చూపలేకపోయే ప్రమాదముంది.
ఈసారి ఇంటర్వ్యూకు శిక్షణలో ఉండటం వల్ల సరిగా సిద్ధం కాలేకపోయాను. నెలరోజులు మాత్రమే తయారయ్యాను. ఇంటర్వ్యూలో కూడా తెలియని ప్రశ్నలు వచ్చాయి. కానీ అభిప్రాయాల మీద ఆధారపడిన ప్రశ్నలు బాగానే చెప్పినందుకు కొంత సంతృప్తి కలిగింది. ఉదాహరణకు...నన్ను అడిగిన కొన్ని ప్రశ్నలూ వాటికి నా సమాధానాలూ చూడండి.
Which state has tackled well with naxalism ?
West Bengal to some extent after it brought in land reforms, operation Barga etc . Andhra Pradesh dealt the security angle well with Grey Hounds.
Tell us two good and two bad things that you observed in US?
1. In US I have observed that wherever we go good infrastructure is created for differently abled people so that they are self reliant. They can alone board buses, trains, visit places etc
2. Tourism infrastructure is very good like roads, waterways etc.
Things I did not like:
1. Racial discrimination is still there
2. Family system is not doing well
Do you support high speed rail especially when there is need to improve freight ?
Both freight and high speed rail development should go simultaneously. High speed rails are important for business activity, Tourism and technology.Posted on 16-05-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning