హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్‌ అభివృద్ధి కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: దుబాయ్‌కి చెందిన విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్‌ హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రాన్ని (ఐడీసీ)ని ఏర్పాటు చేయనుంది. కంపెనీకి చెందిన ఐటీ, టెక్నాలజీ కార్యకలాపాల నిర్వహణ, వినూత్న సొల్యూషన్ల అభివృద్ధిని ఈ కేంద్రం పర్యవేక్షిస్తుందని ఫ్లైదుబాయ్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లోని అభివృద్ధి కేంద్రం కంపెనీ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్ల అభివృద్ధి, పరిశోధనకు కేంద్రంగా ఉంటుందని ఫ్లైదుబాయ్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (సీఐఓ) రమేశ్‌ వెంకట్‌ తెలిపారు. తన అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌ ఇంటర్‌ఫేస్‌ (ఏపీఐ) ‘యాప్‌స్టోర్‌’ను విస్తృతం చేయడానికి హైదరాబాద్‌కు చెందిన అంకుర కంపెనీ హ్యాక్‌మోనియాతో చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా భారత్‌లో వరుసగా హ్యాక్‌థాన్‌లను నిర్వహిస్తుంది. ట్రావెల్‌, ప్రయాణ అనుభవాలను మెరుగుపరచడంలో కొత్త ఆలోచనలు ఉన్న వారు ఈ హ్యాక్‌థాన్‌లలో పాల్గొనవచ్చు. ఈ హ్యాక్‌థాన్‌లలో ఎంపికైన వారికి ఇంటర్న్‌షిప్‌తో పాటు వారి ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి మద్దతుగా నిలుస్తుంది. హ్యాక్‌థాన్‌ల నిర్వహణలో భాగంగా జులై 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని టి-హబ్‌లో హ్యాక్‌థాన్‌ను నిర్వహించనుంది. ఇందులో పాల్గొనాలనుకునే వారు వచ్చే 5 లోపు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని కంపెనీ వెల్లడించింది.
http://www.hackerbay.co/

Posted on 10-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning