సాఫ్ట్‌వేర్ల కంటే డేటా విశ్లేషకులకే అధిక వేతనాలు

* కోక్యూబ్స్‌ టెక్నాలజీస్‌
ముంబయి: తాటిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంట. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు అధిక వేతనాలను పొందటం పరిపాటే. ఇప్పుడు వీరిని మించి వేతనాలను పొందే మరొక వర్గం అవతరించింది. ఆ వర్గమే డేటా విశ్లేషకులు (డేటా ఎనలిస్ట్స్‌). ఆయా సంస్థలు ఖాతాదారుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన సమాచారాన్ని అందించడమే వీరి పని. అందుకే వీరికి రోజురోజుకి ఆదరణ పెరిగిపోతోంది. అయితే ఈ నిపుణులు తక్కువగా లభిస్తుండటంతో వీరి కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆకర్షించేందుకు సంస్థలు అధిక వేతనాలు ఇవ్వజూపుతున్నాయి. ప్రారంభస్థాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు సగటు వార్షిక వేతనం రూ.3.20 లక్షలు అయితే, అదే ప్రారంభస్థాయి డేటా విశ్లేషకుడి సగటు వార్షిక వేతనం రూ.7 లక్షలు. చేసే పని, లభించే ఇతర ప్రయోజనాల ఆధారంగా ఇది ఒకో సారి రూ.10 లక్షల వరకూ ఉంటోంది. ‘గైడ్‌బుక్‌ ఫర్‌ హైరింగ్‌ ఎంట్రీ లెవల్‌ ఎనలిటిక్స్‌ టాలెంట్‌’ పేరిట కన్సల్టింగ్‌ సంస్థ కోక్యూబ్స్‌ టెక్నాలజీస్‌ విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇంకా నివేదికలోని ముఖ్యాంశాలు..
* 2017-18 నాటికి దేశీయ డేటా విశ్లేషణ పరిశ్రమ సుమారు రూ.16,000 కోట్లు (2.3 బిలియన్‌ డాలర్లు)కు చేరొచ్చు.
* నియామకాల విషయంలో ప్రథమశ్రేణి కళాశాలల విద్యార్థులకు సంస్థలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు.
* పెద్దగా నైపుణ్యం అవసరం లేని ఉద్యోగాలకు ద్వితీయ, తృతీయ శ్రేణి కళాశాలల విద్యార్థులను నియమించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి.

Posted on 24-06-2016

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning