సివిల్స్‌ ఇంటర్వ్యూహం


సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో ప్రధానాంగమైన పర్సనాలిటీ టెస్ట్‌ (మౌఖిక పరీక్ష) ప్రాధాన్యం దృష్ట్యా దీనికి సమగ్రంగా సన్నద్ధమవటం చాలా ముఖ్యం. ఇందుకు ఏయే అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి?

సివిల్స్‌ ఇంటర్వ్యూ బోర్డులో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయనతో పాటు 6 నుంచి 8 మంది సభ్యులుంటారు. విభిన్న నేపథ్యాలకు చెంది వివిధ రంగాల్లో అనుభవమున్న వ్యక్తులు వీరు. ఎక్కువమందికి 55 సంవత్సరాల పైబడే వయసుంటుంది. అందువల్ల ఇంటర్వ్యూ బోర్డులో దాదాపు అన్ని రంగాల్లోనూ పరిజ్ఞానం ఉన్నవారే ఉంటారు.
అభ్యర్థుల నేపథ్యం- వారిని వేసే ప్రశ్నలకు ప్రాతిపదికను ఏర్పరుస్తుంది. సొంత రాష్ట్రం, వారి విద్యార్హత, అభిరుచులు, విద్యేతర కార్యక్రమాలు కూడా ఆధారమే. రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పరిస్థితులపై అభ్యర్థుల అవగాహనను కూడా ప్రశ్నిస్తారు. తమ నేపథ్యంతో లంకె ఉన్న అంశాలతో సంబంధమున్న వర్తమాన అంశాలు అభ్యర్థులకు బాగా తెలిసివుండాలని ఇంటర్వ్యూ బోర్డు ఆశిస్తుంది.
ఈ రకంగా అభ్యర్థి నేపథ్యం, వర్తమాన అంశాలపై అతడి అవగాహనపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
ఐదు అంశాల్లో...
సివిల్స్‌ ఇంటర్వ్యూకు రాదగ్గ ప్రశ్నలను ఐదు స్థూల అంశాలుగా వర్గీకరించవచ్చు.
1. వ్యక్తిగతం: అభ్యర్థిపేరు, వూరు, జిల్లాలకు సంబంధించినవి. ఆ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలు. 'ప్రభుత్వ సర్వీసును ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నావు?' తరహా ప్రశ్నలు రావొచ్చు.
'ఇదే నేపథ్యం ఉన్న ఫలానా వ్యక్తి ఇంటర్వ్యూలో విఫలమయ్యాడు. మీరు సఫలమవుతారని ఎందుకనుకుంటారు?'; 'ఒక ఐపీఎస్‌ అధికారిని చంపేశారు. మరో వ్యక్తి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా మీరీ సర్వీసులో చేరాలనుకుంటున్నారా?' ... ఇలాంటి ప్రశ్నలూ ఎదురుకావొచ్చు.
2. విద్యాపరమైనవి: మీ డిగ్రీకీ, ఈ ఇంటర్వ్యూకీ మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకోవటం అవసరం. డిగ్రీ/పీజీ సబ్జెక్టుకు పదును పెట్టుకోవటం అవసరం.
3. ఆప్షనల్‌: మెయిన్స్‌లో అభ్యర్థి ఆప్షనల్లో ప్రతిభను నిరూపించుకునివున్నాడు కాబట్టి దీనిలో లోతైన ప్రశ్నలు అడిగే అవకాశం తక్కువ. అయితే డిగ్రీ సబ్జెక్టుకంటే భిన్నమైనది ఎంచుకునివుంటే మాత్రం ప్రశ్నలను ఆశించవచ్చు.
4. వర్తమాన అంశాలు: రాష్ట్రం, దేశం, అంతర్జాతీయం... దేనినుంచైనా అడగవచ్చు. వార్తాపత్రిక... ముఖ్యంగా జాతీయ పత్రికల సంపాదకీయాలు (ఎడిటోరియల్స్‌) చదవటం అవసరం.
5. అభిరుచులు: ఖాళీ సమయాల్లో మీ కార్యకలాపాలపై ప్రశ్నలను అడిగే అవకాశముంది. ఒకవేళ మీకేమీ అభిరుచి లేకపోతే దాన్ని నిజాయతీగా చెప్పండి. అభిరుచి ఉంటే మాత్రం దానిపై కొన్ని ప్రాథమిక ప్రశ్నలను ఎదుర్కోవటానికి సిద్ధం కండి!
ఇతర, కొత్త తరహా ప్రశ్నలకు కూడా అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి.
* జీవితంలో మీ వ్యక్తిగత లక్ష్యాలు ఏమిటి?
* మీ బలాలూ బలహీనతలేమిటి?
* ఈ ఉద్యోగంలో మీరు ఏం ఆశిస్తున్నారు? మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేయాలి?
* ఐఎఫ్‌ఎస్‌, ఐఏఎస్‌, ఐఆర్‌ఎస్‌ లేదా కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోమంటే దేనికి మీ ప్రాధాన్యం? ఎందుకని?
* ఏ ప్రాంతం/ రాష్ట్రంలో పోస్టు రావాలని మీకు ఆసక్తి? కారణం?
* ఇప్పటినుంచి ఐదారు సంవత్సరాల తర్వాత మీరు ఏ హోదాలో ఉండాలనుకుంటున్నారు?
* మీ మిత్రుడి గురించి అప్రియమైన వదంతిని ఇతర స్నేహితుల ద్వారా వింటే మీ స్పందన ఎలా ఉంటుంది?మీరేం చేస్తారు?ఇలాంటి ప్రశ్నలకు జవాబులను రాసుకుని, అభ్యాసం చేయాలి.

'వర్తమాన' ప్రశ్నలు?
వర్తమాన అంశాల ఆధారంగా ఉండే ప్రశ్నలు ఇంటర్వ్యూలో ఎదురవుతాయి.
అభ్యర్థి వివిధ సమస్యల విషయంలో ఏదో ఒక నిర్దిష్ట అభిప్రాయం తెలపాల్సివుంటుంది.

1) You think the success of the AAM AADMI party in Delhi signifies a major change in the values of the society or was it just the knee- jerk response to rising prices and Corruption.
2) You are from Andhra Pradesh. A party called Lok satta was floated on the same lines in your state. However, it failed to make a mark, whereas the AAM AADMI party had a spectacular win. WHAT DO YOU THINK IS THE REASON ?
3) Do you think Sachin Tendulkar deserved the Bharat Ratna ? Give reasons.

క్రమబద్ధంగా వార్తాపత్రిక చదవటం, వివరంగా వర్తమాన సంఘటనలను విశ్లేషించే మ్యాగజీన్లు చదవటం వల్ల ఉపయోగం ఉంటుంది.

ఏ లక్షణాలు పరిశీలిస్తారు?
సివిల్స్‌ పర్సనాలిటీ టెస్టులో అభ్యర్థికి సంబంధించిన కొన్ని లక్షణాలను పరిశీలిస్తారు. వాటిలో ప్రధానమైనవి-
1) మానసిక సంసిద్ధత
2) విషయాలను సమన్వయం చేసుకోగల శక్తియుక్తులు
3) స్పష్టత, తార్కిక సామర్థ్యం
4) నిర్ణయంలో సమతుల్యత

5) ఆసక్తుల్లో వైవిధ్యం, లోతు
6) సామాజిక దృక్పథం, నాయకత్వ ప్రతిభ
7) మేధో, నైతికపరమైన నిబద్ధత
బోర్డు ఏ అంశాలు చూస్తుంది?
* అభ్యర్థి మానసిక సామర్థ్యపు స్థాయి ఏమిటి? అతడు తార్కికంగా, సమర్థంగా ఆలోచిస్తున్నాడా?
* మరీ ఫక్తు వ్యాపార ధోరణితో ఉన్నాడా? ఏదైనా పథకం స్థూల మార్గదర్శక సూత్రాలతో పాటు దాని ఆచరణపై ఇతడికి ఆసక్తి ఉన్నదా?
* చదివింది చెప్పటం మాత్రమే చేస్తున్నాడా? నిర్మాణాత్మకంగానూ, వూహాశక్తితోనూ కనిపిస్తున్నాడా?
* స్పష్టంగా తనను వ్యక్తీకరించుకోగలుగుతున్నాడా?
* అవసరమైనపుడు పట్టువిడుపులు ప్రదర్శించగలుగుతున్నాడా?
* పబ్లిక్‌ సర్వీసు అవసరాలకు తగ్గట్టుగా అభ్యర్థి ఆకాంక్షలు ఉన్నాయా?

వసరమైనన్నీ ప్రాజెక్టులున్నాయని సంస్థ ఇటీవల ప్రకటించింది. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండి..పనిలో నేర్పరితనం గల లక్షణాలుంటే కచ్చితంగా ఎంపికవుతారు.అభ్యర్థుల అకాడమిక్ ట్రాక్ రికార్డు స్థిరంగా, ప్రగతిశీలకంగా ఉండటం అవసరం.

 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning