ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీల్లో సర్టిఫికేషన్‌ కోర్సులు

చదువుతున్నప్పుడే ప్రోగ్రామింగ్‌లో ప్రావీణ్యం ఉంటే, దానికి గుర్తింపుగా సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ను సాధించడం మేలు. ఇది క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో, డిగ్రీ తర్వాత ఉద్యోగాన్వేషణలో విద్యార్థికి ఎంతగానో ఉపయోగ పడుతుంది.
ముందుగా సి లాంగ్వేజీలో ఉన్న సర్టిఫికేషన్లను పరిశీలిస్తే..
1. మైక్రోసాఫ్ట్‌ టెక్నాలజీ అసోసియేట్‌- డెవలపర్‌ ప్రోగ్రామ్‌: విద్యార్థి ప్రోగ్రాం నైపుణ్యాలు, కాన్సెప్టులను అభివృద్ధిచేయగల సామర్థ్యాలను పరీక్షిస్తూ వివిధ డెవలప్‌మెంట్‌ టూల్స్‌పై ఉన్న అవగాహనను పరిశీలిస్తుంది. వివరాలకు-
https://www.microsoft.com/en-in/learning/mta-developer-certification.aspx
2. సి++ సర్టిఫైడ్‌ అసోసియేట్‌ ప్రోగ్రామర్‌: ఇది కూడా సి++ నైపుణ్యాలను పరీక్షించి సర్టిఫికెట్‌ను ఇస్తుంది. దీనిలో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ యూనివర్సల్‌ కాన్సెప్టుల మీద సి++, సింటక్స్‌, సెమాంటిక్స్‌, డేటా టైప్స్‌, ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ ఇన్‌ సి++, ఇంప్లిమెంటేషన్‌పై పరీక్షించే అవకాశం ఎక్కువ. వివరాలకు-
https://cppinstitute.org/cpa-c-certified-associate-programmer-certification
3. ఒరాకిల్‌, జావా కాన్సెప్టుల మీద సర్టిఫికేషన్‌: ముఖ్యంగా మూడు విభాగాల్లో- అసోసియేట్‌, ప్రొఫెషనల్‌, మాస్టర్‌ లెవెల్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మూడు విభాగాల్లో జావా 6/ 7/ 8 ఎడిషన్లలో విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి అసోసియేట్‌, ప్రొఫెషనల్‌ లేదా మాస్టర్‌ అవడానికి అవకాశాలుంటాయి. వివరాలకు-
https://education.oracle.com/pls/web_prod-plq-dad/db_pages.getpage?page_id=654&get_params=p_id:154
ఈ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలను నేర్చుకుంటే కెరియర్‌కు ఢోకా ఉండదు. వీటిని ఆన్‌లైన్‌లో ప్రపంచ ప్రసిద్ధ ప్రొఫెసర్ల నుంచి ఇంటిదగ్గరే నేర్చుకోవచ్చు. ఐఐటీ, ఎన్‌ఐటీ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో చెప్పే లెక్చర్లను కూడా ఆన్‌లైన్‌లోనే నేర్చుకోవచ్చు. ఈ కోర్సులన్నీ ఉచితమే. వీటిని పూర్తిచేస్తే క్రెడిట్లను దక్కించుకునే అవకాశమూ ఉంది.
ప్రొఫెసర్‌ టోమీ జాక్కోల మెషీన్‌ లెర్నింగ్‌ ఎంఐటీ ఓపెన్‌ కోర్సు-
https://ocw.mit.edu/courses/electrical-engineering-and-computer-science/6-867-machine-learning-fall-2006/index.htm
ప్రొ. ఫిలిప్‌ రిగోలెట్‌ ఓపెన్‌ లెర్నింగ్‌ కోర్సు-
https://ocw.mit.edu/courses/mathematics/18-657-mathematics-of-machine-learning-fall-2015/index.htm
ప్రొ. పాట్రిక్‌ హెన్రీ విన్స్టన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓపెన్‌ కోర్సు-
https://ocw.mit.edu/courses/electrical-engineering-and-computer-science/6-034-artificial-intelligence-fall-2010/index.htm
ప్రొ. సుదేషన ఉ సర్కార్‌, ఐఐటీ ఖరగ్‌పుర్‌ కోర్స్‌వేర్‌-
https://onlinecourses.nptel.ac. in/noc17_cs26/preview
ప్రొ. బలరాం రవీంద్రన్‌ ఐఐటీ మద్రాస్‌ కోర్స్‌వేర్‌-
https://onlinecourses.nptel.ac.in/noc17_cs17/preview
ఈ ఆన్‌లైన్‌ కోర్సులో వచ్చిన టాప్‌ 5% పూర్తి చేసినవారికి సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం కలుగుతుంది. Posted on 07-08-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning