విమానయాన కోర్సుకు ఆన్‌లైన్లో సమాచారం

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్న అవకాశాలు వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు సంఘాలుగా ఏర్పడి తోటి వారికి సమాచారం అందించడం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన విద్యను అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తోంది. పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో విమానయాన రంగంపై విద్యార్థులు దృష్టి సారిస్తున్నారు. ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. సొసైటీగా ఏర్పడుతున్నారు. అంతర్జాతీయ సంఘాల్లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకు దేశీయంగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా దోహదపడుతున్న తీరుపై న్యూస్‌టుడే ప్రత్యేక కథనం.
మెదక్ జిల్లా లో ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఏరోనాటికల్ కోర్సుపై ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు తగినట్టుగా కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఏర్పాటయ్యే ఏరోనాటికల్ సొసైటీల్లో సభ్యులుగా చేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిల్లో చేరిన వారికి అన్ని రకాల పుస్తకాలు ఆన్‌లైన్లో లభ్యమయ్యేటట్టు ప్రత్యేకంగా పాస్‌వర్డ్ ఇస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఖర్చులు తగ్గుతున్నాయి. అటు అధ్యాపకులు కూడా సభ్యులుగా చేరి పరిశోధనలపై దృష్టి సారించి మరింత మెరుగైన ఉద్యోగాల్లో చేరుతున్నారు.
ఏరోనాటికల్ సొసైటీ ఇలా..
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది ప్రత్యేకంగా నిపుణులతో ఏర్పడిన సంఘం. ఇది దేశవ్యాప్తంగా పనిచేస్తోంది. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఉంది. దీనిలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కళాశాలల విద్యార్థులు సభ్యులతో పాటు అధ్యాపకులు, పరిశ్రమల ప్రతినిధులు చేరుతున్నారు. సభ్యత్వం తీసుకున్న మరుక్షణం వెబ్‌సైట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్ జారీ చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులు ఖర్చులు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వెబ్‌సైట్లో పాఠ్య పుస్తకాలు సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్‌లైన్ పాఠాలు కూడా వినే అవకాశం ఉంటుంది. సదస్సులు, సమావేశాలు, నిపుణుల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో ఉంచుతారు. దీనికి అమెరికా సొసైటీ కార్యకలాపాలను అనుసంధానిస్తారు. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఏస్ట్రోనాటిక్స్ సొసైటీ వారు మరిన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులను తెలిపే విధంగా కొన్ని రకాల జర్నల్స్‌ను ఆన్‌లైన్లో ఉంచారు. ఇవి విద్యార్థులకు ఖర్చులు తగ్గిస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయాలంటే మార్కెట్లో ఒక్కో పుస్తకం కొన్ని వేల రూపాయల ఖరీదు ఉండటంతో అందరికీ సాధ్యమయ్యే పనికాదు. వాటిని ఉచితంగా ఆన్‌లైన్లో చదువుకునే అవకాశం ఏర్పడుతోంది. ఆన్‌లైన్ పాఠాలు కూడా బోధిస్తున్నారు.

కొన్ని జర్నల్స్ ఇలా..
* ఆక్టా ఆస్ట్రోనాటికా
* జర్నల్ ఆఫ్ జెట్ ప్రొపల్షన్
* కాంపోజిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ
* జర్నల్ ఆఫ్ స్ప్రే అండ్ కంబ్షన్
* ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
* జర్నల్ ఆఫ్ సౌండ్ అండ్ వైబ్రేషన్
* జర్నల్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్
ఏరోనాటికల్ సొసైటీలో సభ్యుడిగా ఉండటం వల్ల అంతర్జాతీయంగా పరిచయాలు పెరుగుతాయి. మనకు తెలియని విషయాలు విదేశీయులను అడిగి తెలుసుకోవచ్చు. కాకపోతే కాస్తంత ఓపిక అవసరం. విలుమైన సమాచారం లభ్యమవుతుంది. ఒక విమానం ప్రయాణం చేసే సందర్భంలో విద్యుత్తు ఉత్పత్తి జరగాలి. గాల్లో ఎగురుతుంది కాబట్టి తేలికపాటి ఇంజిన్ల పరికరాలు ఉండాలి.పరిశోధన రంగంలో ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు విమానరంగంలో చోటు చేసుకుంటున్న సాంకేతిక మార్పులపై అవగాహన పెరుగుతుంది.

USEFULL WEBSITES:
http://www.journals.elsevier.com/acta-astronautica
http://arc.aiaa.org

- న్యూస్ టుడే, మెదక్
 • Industry      Interaction

  Higher Education

  Job Skills

  Soft Skills

  Comm. English

  Mock Test

  E-learning