సివిల్స్‌ మెయిన్స్‌...ఏం సూచిస్తోంది?

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ అక్టోబరు 27 నుంచి నవంబరు 3 వరకూ జరిగాయి. అత్యధిక సంఖ్యలో సివిల్స్‌ అభ్యర్థులుంటారని పేరున్న మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈసారి మెయిన్స్‌ ప్రశ్నపత్రం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? వీటి ఆధారంగా రేపటి అభ్యర్థులు గమనించాల్సిన అంశాలేమిటి? పరిశీలిద్దాం!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షపై మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన బాగా పెరుగుతూ వస్తోంది. అభ్యర్థుల భారీ సంఖ్య దీన్ని రుజువుచేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 900 మందీ, తమిళనాడు నుంచి 750 మందీ, కేరళ నుంచి 400 మందీ, కర్ణాటక నుంచి 500 మందీ అభ్యర్థులు పరీక్ష రాసివుంటారని అంచనా.
మెయిన్స్‌ రాత పరీక్షలో ఇంగ్లిష్‌, భారతీయ భాషల పేపర్లు అర్హత కోసం మాత్రమే. వీటికి 300 చొప్పున మార్కులున్నాయి.
మిగిలిన ఏడు పేపర్లల్లో ఒక్కోదానికి 250 మార్కులను నిర్దేశించారు. మొత్తం 1750 మార్కులు.
అవి: 1) ఎస్సే 2) ఇండియన్‌ హెరిటేజ్‌ అండ్‌ కల్చర్‌, హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్‌ ద వరల్డ్‌ అండ్‌ సొసైటీ 3) గవర్నెన్స్‌, కాన్‌స్టిట్యూషన్‌, పాలిటీ, సోషల్‌ జస్టిస్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ 4) టెక్నాలజీ, ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్‌, సెక్యూరిటీ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 5) ఎథిక్స్‌, ఇంటెగ్రిటీ అండ్‌ ఆప్టిట్యూడ్‌ 6) ఆప్షనల్‌ సబ్జెక్ట్‌ -1 7) ఆప్షనల్‌ సబ్జెక్ట్‌-2.
ఎస్సే (వ్యాసం)
దీనిలో రెండు సెక్షన్లు. ఒక్కోదాని నుంచి ఒక్కో అంశాన్ని ఎంచుకుని రాయాలి.
సెక్షన్‌ ‘ఎ’
1. Farming has lost the ability to be a source of subsistence for majority of farmers in India
2. Impact of the new economic measures on fiscal ties between the union and states in India.
3. Destiny of a nation is shaped in its classrooms.
4. Has the Non Alignment Movement (NAM) lost its relevance in a multipolar world?
సెక్షన్‌ ‘బి’
1. Joy is the simplest form of gratitude.
2. Fulfillment of new woman in India is a myth.
3. We may brave human laws but cannot resist natural laws.
4. ÔSocial media is inherently a selfish medium.
ఈ అంశాలను గమనిస్తే... గత సంవత్సరాల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. గత ఏడాది ఎస్సే ఎక్కువ మార్కులను స్కోరు చేసేలా వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్సేను ఎక్కువ ప్రమాణాలతో ఇచ్చినట్టు వూహించవచ్చు. వీటిలో కొన్ని నిర్దిష్టత లేని అంశాలైతే మరికొన్ని అనూహ్యమైనవీ, కొత్తవీ. మూడు అంశాలు మనదేశంతో సంబంధమున్నవి.
ఎక్కువమంది అభ్యర్థులు ఈ రెండు అంశాలనూ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 1) Impact of the new economic measures on fiscal ties between the union and states in India. 2) Fulfillment of new woman in India is a myth.
వ్యాసానికి ఇచ్చే ప్రశ్నల స్థాయి ఏటా పెరుగుతూ వస్తోంది. ప్రాంతీయ భాషలో పరీక్ష రాసేవారు ఎక్కువ కృషి చేయాల్సివుంటుందని గ్రహించాలి. మన విద్యార్థుల్లో ఎక్కువమంది ఎస్సేకు ఎంచుకున్న రెండు అంశాలూ మెయిన్స్‌ సిలబస్‌లోనివే కాబట్టి ఆ ఎంపిక సముచితమే. మొదటిదానికి జీఎస్‌టీతో సంబంధమున్నది. రెండోది జనరల్‌స్టడీస్‌లోని సొసైటీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌లో భాగం.

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1: ప్రశ్నలు ఒకదానితో ఒకటి అత్యంత సంబంధమున్నవిగా వచ్చాయి. అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉన్నాయివి. హిస్టరీ ప్రశ్నలు నిర్దిష్టంగా రాకపోవటంతో కష్టంగా అనిపించాయి. సొసైటీకి సంబంధించిన ప్రశ్నలు స్టాక్‌, తాజా అంశాల సమ్మేళనంగా ఉన్నాయి. జాగ్రఫీ మంచి మార్కులను ఇచ్చేలా ప్రాధాన్యం పెంచుకుంది.
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2: పాలిటీ ప్రశ్నలు వూహించినవీ, వాస్తవికాంశాలతో సంబంధమున్నవీ. ఉదా: గోప్యత హక్కు (రైట్‌ టు ప్రైవసీ). ఇండియన్‌ పాలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థులు గ్రహించాలి. సోషల్‌ జస్టిస్‌కు కూడా అధిక ప్రాముఖ్యం ఇవ్వడం తప్పనిసరి.
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-3: వూహించినట్లుగానే భారత ఆర్థిక అంశాలు పేపర్లో ఎక్కువ ప్రాధాన్యం పొందాయి.
జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-4: గత ఏడాది మాదిరిగానే దీన్ని రెండు సెక్షన్లుగా విభజించారు. ఈ పేపర్‌ విభిన్నంగా ఉంది.

ఆప్షనల్స్‌
అభ్యర్థులు తాము ఏ ఆప్షనల్‌ను ఎంచుకున్నప్పటికీ వారికి సంతృప్తి కలిగించేలాగానే పేపర్లు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే... అన్ని మొదటి పేపర్లూ స్టాటిక్‌ ప్రశ్నలతోనూ, రెండో పేపర్లు వర్తమాన అంశాల ప్రాధాన్యంతోనూ ఉన్నాయి. పేపర్లు సులభంగా ఉన్నపుడు వాటి మూల్యాంకనం కఠినంగా ఉంటుందని అంచనా వేయవచ్చు.
మొత్తమ్మీద పేపర్లకు జవాబులు రాయటం అంత కష్టంగా ఏమీ లేదని చాలామంది అభ్యర్థులు తమ అనుభవం చెప్పుకొచ్చారు. సివిల్స్‌ ఆశావహుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిన వాతావరణమే అన్నిచోట్లా కనిపించింది.
అభ్యర్థుల వ్యూహం ఇలా ఉండాలి!
1. ఇటలీ ఆర్థికవేత్త విల్‌ఫ్రెడ్‌ పారెటో ప్రతిపాదించిన 80:20 సూత్రం అనుసరించాలి. దీని ప్రకారం- 20 శాతం అంశాలు పరీక్షల్లో 80 శాతం విజయాన్ని నిర్దేశిస్తాయి. ఆ కీలక అంశాలను గుర్తించి వాటిపై శ్రద్ధ చూపాలి; పట్టు పెంచుకోవాలి. పూర్వ ప్రశ్నపత్రాలను బట్టి మొత్తం 7 పేపర్లలోనూ ఆప్షనల్‌, జనరల్‌ ఎస్సేలలో మార్కులే సివిల్స్‌లో గెలుపును నిర్థారిస్తున్నాయి. ఇప్పుడూ ఇదే వ్యూహం అనుసరించాలి.
2. ప్రశ్నలకు జవాబులను సాధన చేస్తూ , పరీక్ష పత్రాలను అనుభవజ్ఞులైన సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయించాలి. ఆప్షనల్‌ ప్రత్యేక సబ్జెక్టు కాబట్టి తగిన పరిజ్ఞానం ఉన్న నిపుణులు దానిలో అభ్యర్థులకు తగిన సలహాను ఇవ్వగలరు. అది ఎంతో ఉపయోగపడుతుంది కూడా. జనరల్‌ స్టడీస్‌లో ఇది ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే జనరల్‌ స్టడీస్‌కు సంబంధించి వివిధ వ్యక్తుల నుంచి వివిధ రకాల సలహాలు వస్తాయి. అందుకే ఆ వ్యూహం లాభించటం కష్టం.
3. ప్రసార మాధ్యమాల్లో విశ్లేషణాత్మకంగా చర్చకు వచ్చిన వివిధ అంశాలను గుర్తించాలి. ఇక్కడ జాతీయ అంశాలను మాత్రమే గ్రహించాలి. ఉదాహరణకు వచ్చే ఏడాది ముఖ్యమైన అంశాలను చెప్పాలంటే... freedom, Knowledge and Education, Peace, Nonviolence, Children, Youth, Child labour and Child Slavery, Law and governance and Leadership. వివిధ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు నిర్వహించిన తాజా పరీక్షల వ్యాసాలను సేకరించాలి. వాటిలో అతిముఖ్యమైనవాటిని జవాబులుగా రాయండి. యోజన, ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీలు చదివితే కూడా కొన్ని అంశాలపై అవగాహన ఏర్పడుతుంది.
4. ఎథిక్స్‌లో థియరీ ప్రశ్నలూ, కేస్‌ స్టడీస్‌ సాధన చేయాలి. ఈ పేపర్‌ సుదీర్ఘంగానే ఉంటుంది కాబట్టి సకాలంలో పూర్తిచేసేలా అభ్యాసం చేయటం ముఖ్యం.
5. తర్వాత అభ్యర్థులు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, 2, 3 ల పఠనంపై దృష్టి పెట్టాలి.

వి.గోపాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్‌, బ్రెయిన్ ట్రీ


Posted on 11-11-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning