నైపుణ్యాలు పెంచుకుంటేనే మనుగడ

* ఆటోమేషన్‌ ప్రభావంతో తగ్గనున్న అవకాశాలు
* నవీకరణ వైపు మొగ్గుచూపుతున్న సాఫ్ట్‌వేర్‌ నిపుణులు
* ట్రిపుల్‌ ఐటీ-హైదరాబాద్‌ టాలెంట్‌ స్ప్రింట్‌ సర్వేలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతిక నైపుణ్యాలను ఆకళింపు చేసుకొని ఎక్కువ మంది నిపుణులు తమను తాము నవీకరించుకుంటున్నారని (అప్‌గ్రేడ్‌) సర్వేలో తేలింది. కృత్రిమ మేధస్సు(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) టెక్నాలజీలో నైపుణ్యం సాధించడానికి ఉద్యోగుల సన్నద్ధత తెలుసుకునేందుకు ట్రిపుల్‌ ఐటీ- హైదరాబాద్‌ టాలెంట్‌ స్ప్రింట్‌ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ముఖ్యాంశాలు
1. ఐటీలో అయిదేళ్లకన్నా ఎక్కువ అనుభవమున్న వారు నవీకరించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
2. ప్రస్తుతం పనిచేస్తున్న నిపుణుల నుంచి ఏఐ, ఎంఎల్‌ ప్రోగ్రాంలకు అధికంగా డిమాండ్‌ ఉంది.
3. అంకుర సంస్థలు, చిన్నతరహా సంస్థలు నూతన సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి.
4. అయిదేళ్లకన్నా తక్కువఅనుభవమున్న మహిళా, యువ నిపుణుల్లోనవీకరించుకోవాలన్న అవగాహన లేదు.
నివేదికలో వివరాలు..
* దరఖాస్తుదారుల్లో 33శాతం మందికి పదేళ్ల అనుభవముంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం సాధించాలనే తపన సీనియర్‌లలో ప్రారంభమైంది.
* 73శాతం దరఖాస్తులు ఐటీసంస్థల నుంచే వచ్చాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాలైన ఏఐ/ఎంఎల్‌ల ప్రభావం ఈ సంస్థలపై చూపడం మొదలైంది.
* అంకుర, చిన్న సంస్థలకు చెందినవారు 44 శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఐ/ఎంఎల్‌ వంటి ఆధునిక సాంకేతికతలను ఇప్పటికే అనుసరిస్తున్నారు.
ఐటీ పరిశ్రమలో కొత్త సవాళ్లు - డాక్టర్‌ పీజేనారాయణన్‌, డైరెక్టర్‌, ట్రిపుల్‌ ఐటీ, హైదరాబాద్‌
ఐటీ పరిశ్రమ నేడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న ఐదేళ్లలో కీలకం కానున్న ఏఐ/ఎంఎల్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించే, ప్రచారం చేసే ఓ పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి.
నూతన సాంకేతికతలతోనే భవిత - డాక్టర్‌ శంతన్‌పాల్‌, ఎండీ, సీఈవో, టాలెంట్‌ స్ప్రింట్‌
కొందరు మధ్యస్థాయి నిపుణులు ఆటోమేషన్‌ ప్రభావాన్ని తట్టుకోవడంలో నిస్సహాయులుగా ఉన్నారు. నూతన సాంకేతికతలను ఆకళింపు చేసుకోవడం మాత్రమే వారి భవిష్యత్తుకు తోడ్పడతాయని అర్థం చేసుకోవాలి.

Posted on 29-12-2017

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning