ఇంటి నుంచే ఇంటర్నేషనల్‌ డిగ్రీ!

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో విద్యారంగంలో హద్దులు చెరిగిపోతున్నాయి. అంతర్జాలం (ఇంటర్నెట్‌) ద్వారా మీకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. కాలేజీ మెట్లు ఎక్కకుండానే జ్ఞానదాహం తీర్చుకోవచ్చు. మనదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్‌ యూనివర్సిటీలు, అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌, ఎంఐటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, బర్మింగ్‌హామ్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం లాంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆన్‌లైన్‌ పద్ధతిలో ఎన్నో కోర్సులను అందిస్తున్నాయి.

చాలా ఆన్‌లైన్‌ సంస్థలు ఉచితంగా కోర్సు కంటెంట్‌ను అందిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ చేసుకొని పాఠాలు వినొచ్చు. బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌, మెక్‌ఆర్థర్‌ ఫౌండేషన్‌, నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌, స్టాన్‌ఫర్డ్‌, హార్వర్డ్‌ యూనివర్సిటీలు, ఎంఐటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, కాల్‌టెక్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (ఆస్టిన్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (బెర్క్‌లీ), శాన్‌ జోస్‌ యూనివర్సిటీ, ఖాన్‌ అకాడమీ తదితర సంస్థలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. కోర్స్‌ ఎరా, విజ్‌ ఐక్యూ, ఉడాసిటీ, ఓపెన్‌ లెర్నింగ్‌, ఓపెన్‌ క్లాస్‌రూమ్స్‌, షా అకాడమీ తదితర కంపెనీలు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే ఈ కంపెనీలు కూడా ప్రఖ్యాత యూనివర్సిటీల అధ్యాపకుల ద్వారా వీడియో తరగతులు నిర్వహిస్తున్నాయి.
కోర్సులు ఏ తరహా?
సైకాలజీ, సోషియాలజీ, మేనేజ్‌మెంట్‌ లాంటి సాంప్రదాయిక కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ లాంటి అధునాతన అంశాలను కూడా ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగానికి సంబంధించి చాలా అడ్వాన్స్‌డ్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌ఎక్స్‌ సంస్థ వెబ్‌ డెవలప్‌మెంట్‌, డిజిటల్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌, పైథాన్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఫొటోగ్రఫీ, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ లాంటి అధునాతన అంశాల్లో శిక్షణ ఇస్తోంది. వీటిని మైక్రోసాఫ్ట్‌, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌, హార్వర్డ్‌, అడిలైడ్‌ యూనివర్సిటీ, బోస్టన్‌ యూనివర్సిటీ, ఐఐటీ బాంబే, ఐఐఎం బెంగళూరు తదితర సంస్థలు నిర్వహిస్తున్నాయి. అన్ని కోర్సులను అనువర్తిత (అప్లయిడ్‌) స్వభావంతో సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి ఉపయోగపడే విధంగా రూపొందించడం విశేషం.
ఆన్‌లైన్‌ కోర్సుల వేదికలివే..
Stanford Online: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ
Coursera: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌ కాలేజ్‌ పార్క్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయి
Khan Academy WizIQ: ఐఐటీ దిల్లీ, డెస్‌ మోయిన్స్‌ ఏరియా కమ్యూనిటీ కాలేజ్‌
Canvas Network: శాంటా క్లారా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఉతా, యూనివర్సిటీ లిలె 1
Peer to Peer University Udacity: జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, శాన్‌ జోస్‌ స్టేట్‌ యూనివర్సిటీ, గూగుల్‌, సేల్స్‌ఫోర్స్‌ డాట్‌కామ్‌, ఫేస్‌బుక్‌, క్లౌడ్‌ఎరా, ఎన్‌విడియా, ఆటోడెస్క్‌, క్యాడెన్స్‌.
Eliademy: ఆల్టో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌
openHPI: వర్సిటీ ఆఫ్‌ పోస్ట్‌డామ్‌, జర్మనీ
FutureLearn: యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌, ఓపెన్‌ యూనివర్సిటీ, మోనాష్‌ వర్సిటీ, ట్రినిటీ కాలేజ్‌ డబ్లిన్‌, వార్విక్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ బాత్‌, యూనివర్సిటీ ఆఫ్‌ సౌథాంప్టన్‌.
OpenClassrooms: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబీఎం, జెన్‌డెస్క్‌, ఇకోల్‌ పాలిటెక్నిక్‌
OpenLearning: యూనివర్సిటీ ఆఫ్‌ న్యూసౌత్‌వేల్స్‌, టేలర్స్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ కాన్‌బెర్రా
EdX: ఎంఐటీ, హార్వర్డ్‌ వర్సిటీ, బోస్టన్‌ వర్సిటీ, యూసీ బర్క్‌లీ, క్యోటో వర్సిటీ, ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌, యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌, ఐఐటీ బాంబే, ఐఐఎం బెంగళూరు, డార్ట్‌మౌత్‌ కాలేజ్‌, కర్టిన్‌ వర్సిటీ, కార్నెల్‌ వర్సిటీ
iversity: యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరెన్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హాంబర్గ్‌
One Month: స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్స్‌
NovoEd: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌, ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ, డార్డెన్‌, కామ్‌కాస్ట్‌, కార్నెగీ ఫౌండేషన్‌
Coursmos: స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, డ్రాపర్‌ యూనివర్సిటీ, ఎంఐటీ
Open2Study: జేమ్స్‌ కుక్‌ యూనివర్సిటీ, గ్రిఫిత్‌ వర్సిటీ, సిడ్నీ ఇన్‌స్టిట్యూట్‌, స్విన్‌బర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూక్యాజిల్‌, జోర్డాన్‌ వర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ టాస్మానియా, సౌత్‌ చైనా వర్సిటీ, కర్టిన్‌ వర్సిటీ.
Kadenze: స్టాన్‌ఫర్ట్‌ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్‌ వర్సిటీ, యూసీఎల్‌ఏ, మేరీల్యాండ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌, గోల్డ్‌ స్మిత్స్‌ కాలేజ్‌, ప్యారిస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌, నేషనల్‌ వర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, కార్నిష్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌
POLHN: WHO, మినిస్ట్రీస్‌ ఆఫ్‌ హెల్త్‌
ALISONLynda Shaw Academy
Udemy: స్ట్రేయర్‌ యూనివర్సిటీ
మనదేశంలో ‘స్వయం’
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వయం’ (స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ యాస్పైరింగ్‌ మైండ్స్‌) పేరుతో 900కు పైగా ప్రత్యేక ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తోంది.
ఇంజినీరింగ్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, సైన్సెస్‌, మేనేజ్‌మెంట్‌, తదితర సబ్జెక్టులకు సంబంధించిన కోర్సులు https://swayam.gov.in/ లో ఉన్నాయి. వీడియో లెక్చర్లు, స్టడీ మెటీరియల్‌, అసైన్‌మెంట్‌లు, క్విజ్‌ల రూపంలో కోర్సులను నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు, సెంట్రల్‌ యూనివర్సిటీల అధ్యాపకులు బోధిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తి చేయడం ద్వారా సాధించే క్రెడిట్‌లను మీ రెగ్యులర్‌ కోర్సు క్రెడిట్‌లకు కలుపుకోవచ్చు.
* ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌లే కాకుండా ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, లా, మెడిసిన్‌, అగ్రికల్చర్‌లకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో మార్కెట్లో గిరాకీ ఉన్న ఆధునిక కోర్సులెన్నో ఉండటం విశేషం.
* అన్ని కోర్సులను ఉచితంగా చేయవచ్చు. సర్టిఫికెట్‌ కావాలంటే మాత్రం ఫీజు చెల్లించాలి.
* ప్రస్తుతం ఐఐటీలు (బాంబే, మద్రాస్‌, కాన్పూర్‌, గువాహటి), దిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, ఇగ్నో, ఐఐఎం కలకత్తా, ఐఐఎం బెంగళూరు, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్‌, అనేక విదేశీ విద్యాసంస్థలకు చెందిన అధ్యాపకులు ఈ కోర్సుల నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో కనీసం కోటి మంది విద్యార్థులకు ఈ కోర్సులను అందించాలని లక్ష్యం.
* అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ప్రస్తుతం 587 రకాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని... అడ్వర్టయిజింగ్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, గ్రాఫ్‌ థియరీ, డిజిటల్‌ స్పీచ్‌ ప్రాసెసింగ్‌, జెనెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, బేసిక్స్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ, ప్రాచీన్‌ హిందీ కావ్య, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ మొదలైనవి.
* పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయి కోర్సులు: ప్రస్తుతం 307 రకాల కోర్సులున్నాయి. వాటిలో కొన్ని... మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ ఫర్‌ డెసిషన్‌ మేకింగ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, క్లినికల్‌ సైకాలజీ, ఆడియో - విజువల్‌ మీడియా, డిజిటల్‌ లైబ్రరీ, ఫారెస్ట్‌ బయోమెట్రీ, సైంటోమెట్రిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్‌ సిస్టమ్‌ అండ్‌ సర్వీసెస్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌, పెరిసైక్లిక్‌ రియాక్షన్స్‌ అండ్‌ ఆర్గానిక్‌ ఫొటోకెమిస్ట్రీ, డిస్ట్రిబ్యూటెడ్‌ సిస్టమ్స్‌, ఇంట్రడక్షన్‌ టు మార్కెటింగ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, కార్పొరేట్‌ ఫైనాన్స్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజీ అండ్‌ సస్టెయినబుల్‌ ఎంటర్‌ప్రైజ్‌, క్రియేటింగ్‌ కాంపిటీటివ్‌ అడ్వాంటేజ్‌, ఫేజ్‌ డయాగ్రమ్స్‌ ఇన్‌ మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎక్స్‌పెరిమెంటల్‌ స్ట్రెస్‌ అనాలిసిస్‌, పీడీఈ ఫర్‌ ఇంజినీర్స్‌ - సొల్యూషన్‌ బై సెపరా, ఇంట్రడక్షన్‌ టు ప్రాసెస్‌ మోడలింగ్‌ ఇన్‌ మెంబ్రేన్‌ సెపరేషన్‌ ప్రాసెస్‌, ప్రొటీన్స్‌ అండ్‌ జెల్‌ బేస్డ్‌ ప్రొటియోమిక్స్‌, మాస్‌ స్పెక్టోమెట్రీ బేస్‌డ్‌ ప్రొటియోమిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, ఎర్రర్‌ కంట్రోల్‌ కోడింగ్‌, కండక్షన్‌ అండ్‌ కన్వెక్షన్‌ హీట్‌ ట్రాన్స్‌ఫర్‌, ప్రాబబిలిటీ మెథడ్స్‌ ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవి.
* సర్టిఫికెట్‌ కోర్సులు: ప్రస్తుతం సర్టిఫికెట్‌ కోర్సులు 17 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్‌ అండ్‌ లైబ్రరీ సర్వీసెస్‌, టెక్నాలజీ ఆఫ్‌ ఫెర్మెంటెడ్‌, చీజ్‌, ఐస్‌క్రీమ్‌ అండ్‌ బై ప్రొడక్ట్స్‌, డాక్యుమెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ ఆర్గనైజేషన్‌, ఇండియన్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌, సస్టెయినబుల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బయోడైవర్సిటీ, ఇంట్రడక్షన్‌ టు పౌల్ట్రీ ఫార్మింగ్‌.
ఆన్‌లైన్‌ కోర్సుల తీర్మానం
ఇటీవల టైమ్స్‌ జాబ్స్‌ 1200 మంది వృత్తినిపుణులైన ఉద్యోగార్థులతో సర్వే చేసింది. దీనిలో పాల్గొన్నవారిలో సగం మంది నూతన సంవత్సర తీర్మానం ఏమిటంటే... ఆన్‌లైన్‌ కోర్సులు చేయటం! తమ నైపుణ్యాలను ‘అప్‌గ్రేడ్‌’ చేసుకోవాలనే ఉద్దేశమే ఈ నిర్ణయానికి కారణమని వారు తెలిపారు.


Posted on 10-01-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning