గట్టి పోటీకి పొట్టి కోర్సులు!

* వేసవి సెలవుల సద్వినియోగం

వేసవి సెలువులు వచ్చేశాయ్‌! ఇప్పుడేం చేద్దాం... అక్కడికెళదాం, ఇక్కడ చూద్దాం అనుకుంటున్నారా? మంచిదే! కానీ సెలవులన్నీ అలాగే ఖర్చు పెట్టేస్తే పోటీలో వెనకబడే ప్రమాదం ఉంది. తరగతుల్లో మంచి మార్కులు వస్తున్నాయని తలెగరేసి నైపుణ్యాలు నేర్చుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగవేటలో ఉసూరుమనాల్సి వస్తుంది. అందుకే ఈ సెలవుల్లో అవసరమైన స్కిల్స్‌లో శిక్షణ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, కమ్యూనికేషన్‌ ఆధారిత కోర్సులకు బాగా గిరాకీ ఉంది. దాదాపు సగం ఇంజినీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులు ఈ కోర్సులనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కానీ ఎక్కువమంది ఇంజినీరింగ్‌ డిగ్రీని భావి ఉద్యోగాల కోసం ఒక అర్హతగా చూస్తూ, ఆ డిగ్రీలో ఉన్న సబ్జెక్టులపైనే దృష్టిసారిస్తుంటారు. కానీ ప్రతి ఇంజినీరింగ్‌ విభాగానికీ¨, ఇతర ఇంజినీరింగ్‌ విభాగాలతో అనుసంధానత ఉంటుంది. ఉదాహరణకు- మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు ఐటీలో భాగమైన క్యాడ్‌ ఇంజినీరింగ్‌ అవసరం. వీటినే ఇంటర్‌ డిసిప్లినరీ ఇంజినీరింగ్‌ విభాగాలు అంటారు. ఎక్కువగా వీటిని ఆప్షనల్‌ సబ్జెక్టులుగా విద్యార్థులు ఎంచుకుంటారు. కానీ అలాంటి ఆప్షన్‌ సబ్జెక్టులు అన్నింటినీ ఎంచుకునే సమయం ఉండకపోవచ్చు.

ఇంజినీరింగ్‌ కోర్సులు ఎక్కువగా ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఆధారంగా ఉంటాయి. మెషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతల వల్ల ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చన్న హెచ్చరికలున్నాయి. అలాంటి టెక్నాలజీలపై దృష్టిపెడుతున్న వారికి మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయన్న వార్తలను ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదువుతున్నవారు స్ఫూర్తిగా తీసుకోవాలి. వాటికోసం సమయాన్ని కేటాయించుకోవాలి. అందుకోసం తోడ్పడేదే- వేసవి కాలం.
రెండున్నర నెలల వరకూ వేసవి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తాము ఏ సబ్జెక్టులో వెనకబడ్డారో వాటిని సమీక్షించుకోవటానికి ఈ కాలాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఆసక్తి ఉన్న మల్టీ డిసిప్లినరీ సబ్జెక్టులపై అవగాహన కల్పించుకోవడానికి వినియోగించుకోవచ్చు. ఏదైనా పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా సంబంధిత పరిశ్రమపై పరిజ్ఞానం పెంచుకోవచ్చు. తద్వారా పోటీలో ముందు నిలబడటానికి అవకాశం ఉంటుంది.
క్షేత్రస్థాయి (ఫీల్డ్‌) పనితీరు గురించి లోతైన జ్ఞానాన్ని ఇచ్చే వేసవి శిక్షణ డిగ్రీలో చాలా ముఖ్యమైన భాగమని గుర్తించాలి. అందుకే రెగ్యులర్‌ టెస్ట్‌ క్వాలిఫయింగ్‌, ఇతర అకడమిక్‌ ప్రాజెక్టులు పూర్తికానివారు కూడా వేసవి శిక్షణపై దృష్టిపెట్టటం మంచిది!
వేసవి సెలవుల్లో ఎలాంటి కోర్సులు చేసే అవకాశాలుంటాయో తెలుసుకుందాం.
స్వల్పకాలిక కోర్సులు
ఏదో ఓ డిగ్రీ సంపాదించి దాని ఆధారంగా దీర్ఘకాలం పని చేయాలంటే నేటి వేగవంతమైన, ఆధునిక ప్రపంచంలో కష్టం. అలా అని జీవితకాలం డిగ్రీలూ, అధిక అర్హతలూ సాధిస్తూపోవాలని కాదు. కొత్త సాంకేతికతలకు అనుగుణమైన స్వల్పకాలిక (షార్ట్‌టర్మ్‌) కోర్సులు చేస్తూ నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించుకోవచ్చు. ఇవి ఇంజినీరింగ్‌ విద్యార్థుల మెయిన్‌ కోర్సులకు వంతెనలుగా (బ్రిడ్జ్‌ కోర్సులు) ఎంతో ఉపయోగపడతాయి. చదువుతున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్టులకు ప్రస్తుతం లేదా ఉద్యోగావసరాలకు అవసరమైన టెక్నాలజీల్లో ఉన్న ఖాళీని భర్తీ చేయడానికి కూడా ఉపయోగపడతాయి.
ఒక కార్యాలయంలో సంపాదించిన నైపుణ్యాలను సరిచేసుకోవాలన్నా, విశ్వవిద్యాలయం ద్వారా పొందిన అర్హతలపై కెరియర్‌ను నిర్మించుకోవాలన్నా వివిధ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఒకరోజు నుంచి వారం.. రెండు లేదా మూడు నెలల నుంచి ఏడాది వరకూ వ్యవధి ఉండే చిన్న కోర్సులను షార్ట్‌టర్మ్‌ కోర్సులుగా పరిగణిస్తారు. ఉద్యోగావకాశాలు పెంచుకోవటానికీ, ఉద్యోగంలో చేరివుంటే పదోన్నతి అవకాశాలకూ, కొత్త కెరియర్‌ ఆరంభించటానికీ ఇవి దోహదపడవచ్చు. ఆసక్తి, సృజనాత్మకత కలగలిపి నేర్చుకుంటే స్వల్పకాలిక కోర్సులు విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా మార్చేయగలవు.
ఈ కోర్సులను ఎంచుకునే సమయంలో ఈ కింది అంశాలను గుర్తుంచుకోవాలి.
1. ఎంచుకున్న ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన కోర్సు అవునో కాదో చూసుకోవాలి. సంబంధించిన కోర్సే అయితే ఒకటి, రెండేళ్లలో దానిలో భవిష్యత్‌ ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయనేది చూసుకోవాలి. ఒకవేళ సంబంధించిన కోర్సు కాకపోతే దీర్ఘకాలంలో దాని ప్రభావం ఇంజినీరింగ్‌ మీద ఎంత ఉంటుందో చూసుకోవాలి.
2. ఎక్కువగా ప్రాక్టికల్స్‌కు అవకాశమున్న కోర్సులను ఎంచుకోవాలి. ప్రాక్టికల్స్‌ ద్వారా సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు.
3. నేర్చుకున్న టెక్నాలజీని ఒక పేపర్‌గా సబ్‌మిట్‌ చేయాలి. ఆ పేపర్‌లో ఇప్పటివరకూ ఎక్కడా చదవని అంశాన్ని చేర్చాలి. అంటే ఎవరికీ తెలియనిదాన్ని చెప్పడం ద్వారా ఆ సబ్జెక్టులో నైపుణ్యం ప్రదర్శించే అవకాశాలున్నాయి.
మరో మార్గం..
ఐటీ రంగంలో ముఖ్యమైన పరిజ్ఞానం, నైపుణ్యాలు, అనుభవాన్ని పొందడానికి చక్కటి మార్గం- ఇంటర్న్‌షిప్‌లు. అకడమిక్‌ కోర్సుకూ, ఉద్యోగ సంబంధిత పనులకూ మధ్యనున్న అంతరాన్ని తొలగించడానికి ఇవి ఉపయోగపడతాయి.
* విద్యార్థి తన సామర్థ్యాన్నీ, లక్ష్యాలనూ తెలుసుకోవడం, వాటిని ఎలా ఉత్తమంగా సాధించాలనేది తెలుసుకోవడానికి ఇంటర్న్‌షిప్‌ ఎంతో సాయపడుతుంది. ఇంటర్న్‌షిప్‌ వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా స్వీయ అవగాహనకూ తోడ్పడుతుంది.
* సమాచార మార్పిడి, విద్యార్థి కెరియర్‌ను ముందుకు తెచ్చే పరిచయాలు, సంబంధాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఏర్పడేదే నెట్‌వర్కింగ్‌. ఈ నెట్‌వర్కింగ్‌ ద్వారా లోతైన సంబంధాలను ఏర్పరచడానికి ఇంటర్న్‌షిప్‌లు ఉపకరిస్తాయి.
* మీరు ఇంటర్న్‌షిప్‌ చేసే సంస్థ యజమానులు మీకు శిక్షణనివ్వడానికి సమయం, డబ్బు పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆసక్తిగా కృషి చేస్తే తరువాత మిమ్మల్ని నియమించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందువల్ల ఇంటర్న్‌షిప్‌ను నిబద్ధతతో చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఇంటర్న్‌షిప్‌ కోసం ముందుగా ఏ ఏరియాలో చేద్దామనుకుంటున్నారో, దాన్నే ఎందుకు ఎంచుకున్నారో ఒక దరఖాస్తు రూపంలో రాసుకోవాలి. అలా రాసుకున్న తరువాత ఆ ఏరియాల్లో పనిచేస్తున్న సంస్థల వివరాలు తెలుసుకోండి. కళాశాల ప్రిన్సిపల్‌ నుంచి ఒక రెకమెండేషన్‌ లెటర్‌ ద్వారా మీ దరఖాస్తును సంస్థకు పంపాలి. సంస్థలో ఉన్న ఖాళీలనుబట్టి మీకు అవకాశం లభించవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్‌ చేయటానికి ఉపయోగపడే సైట్లు..
https://internshala.com,
www.goabroad.com, www.hellointern.com,
www.twenty19.com, www.letsintern.com
సరికొత్త సాంకేతికత
కంప్యూటర్‌ సైన్స్‌ పట్టభద్రులకు అందుబాటులో వివిధ స్వల్పకాలిక కంప్యూటర్‌ కోర్సులున్నాయి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్‌ మీద పని చేస్తుంటారు. కాబట్టి వారు ఏదో ఒక ప్రోగ్రామింగ్‌లో నిష్ణాతులయ్యే ఉంటారు. అలాంటివారు ప్రస్తుతమున్న డిగ్రీ సబ్జెక్టుతోపాటు డేటా సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌ వంటి కోర్సులు చేస్తే ఉపయోగం.
* డేటా సైన్సెస్‌ (టెక్నికల్‌) షార్ట్‌టర్మ్‌ కోర్సులు- డేటాసైన్స్‌ విత్‌ ఆర్‌, డేటా సైన్స్‌ విత్‌ పైథాన్‌ కోర్సులు
https://www.cdac.in/index.aspx?id=edu_ctp_DataScience
https://www.simplilearn.com/big-data-andanalytics/
https://www.cdac.in/index.aspx?id=edu_ctp_Short-term-Data-Science-Courses-CDACMBroc
పైన చెప్పిన షార్ట్‌టర్మ్‌ కోర్సులతోపాటు ఆన్‌లైన్‌ కోర్సులను చేయడం కూడా ఈ ఎండాకాలంలో ఉపయోగకరమే.
https://www.edx.org/course/cs50s-introduction-computer-science-harvardx-cs50x
https://www.coursera.org/learn/python
https://www.coursera.org/learn/data-structures
* మెషిన్‌ లర్నింగ్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ షార్ట్‌టర్మ్‌ కోర్సులు
http://www.analyticspath.com/artificialintelligencetraininginhyderabad
https://www.coursera.org/learn/machinelearning
https://in.udacity.com/course/machinelearningud262
పై వాటితోపాటు కింది కోర్సులు కూడా ఎంతో ఉపయోగపడతాయి.
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ వెబ్‌ డిజైనింగ్‌
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ పీహెచ్‌పీ
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ సైబర్‌ ఫోరెన్సిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ లా
* సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ యానిమేషన్‌ ఈ కోర్సుల కోసం కింది వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
http://beta.nielit.gov.in/content/short-termcourses-software


Posted on 26-04-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning