సైన్స్‌, ఇంజినీరింగ్‌ల్లో పీహెచ్‌డీ

శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో, నిష్ణాతుల పర్యవేక్షణలో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పొందే అరుదైన అవకాశాన్ని కల్పించే ప్రకటన వెలువడింది. ఇంజినీరింగ్‌ లేదా సైన్స్‌ విభాగాల్లో డాక్టరేట్‌ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను జాతీయ సంస్థ ఏసీఎస్‌ఐఆర్‌కు పంపవచ్చు.

సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థుల కోసం ఒక ప్రకటన వెలువడింది. ఈ విభాగాల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతీయ ప్రాధాన్య సంస్థగా అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రిసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌)ను ఏర్పాటు చేశారు. 40కు పైగా జాతీయ సంస్థల నుంచి సీఎస్‌ఐఆర్‌కు చెందిన రెండు వేల మందికి పైగా శాస్త్రవేత్తలు ఇక్కడ ఫ్యాకల్టీ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ఆయా రంగాల్లో నిష్ణాతులు సైతం తమ సేవలు అందిస్తారు. ఈ సంస్థ ద్వారా పీహెచ్‌డీకి ఎంపికైనవారు సీఎస్‌ఐఆర్‌కు చెందిన ప్రయోగశాలల్లో పరిశోధనలు కొనసాగించుకోవచ్చు.
సైన్స్‌లో పీహెచ్‌డీకి అర్హతలు
ఇంజినీరింగ్‌/మెడిసిన్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా సైన్సెస్‌లో పీజీతోపాటు బయలాజికల్‌, కెమికల్‌, ఫిజికల్‌, మ్యాథమేటికల్‌, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ల్లో ఎందులోనైనా ఉన్నతస్థాయి పరిశోధనలు చేయాలనే ఆసక్తి ఉండాలి. సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/డీబీటీ/డీఎస్‌టీ/ ఇన్‌స్పైర్‌ లేదా తత్సమానమైన ఫెలోషిప్‌కు ఎంపికై ఉండాలి. సైన్స్‌ లేదా అనుబంధ సబ్జెక్టుల్లో యూజీ డిగ్రీతోపాటు కనీసం 8.5 స్కోర్‌ లేదా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచినవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్పాన్సర్‌ విధానంలోనూ ఇండస్ట్రీ తరఫున తగు అర్హతలు ఉన్నవారికి పీహెచ్‌డీ అందిస్తున్నారు.
ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీకి అర్హతలు
ఎంటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌తోపాటు ఏదైనా ఫెలోషిప్‌కు ఎంపికై ఉండాలి లేదా ఏసీఎస్‌ఐఆర్‌ నిర్దేశించిన అర్హతలు కలిగి ఉండాలి.
బీటెక్‌ లేదా ఎమ్మెస్సీ చదివినవారు ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌కి అర్హులు. వీరు ఎంపికై విజయవంతంగా కోర్సు, పరిశోధనలు పూర్తిచేస్తే ఎంటెక్‌తోపాటు పీహెచ్‌డీని ప్రదానం చేస్తారు.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రతిభ, అందుబాటులో ఉన్న ఖాళీల ప్రాతిపదికన పీహెచ్‌డీలోకి తీసుకుంటారు. అభ్యర్థులు తమ పరిశోధనల కోసం మూడు సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌లను ఎంచుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 24
వెబ్‌సైట్‌: http://acsir.res.inPosted on 16-05-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning