ప్రోగ్రామింగ్‌ పోటీకి సై!

* టీసీఎస్‌ కోడ్‌విట- 2018
టెక్నాలజీల్లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే కేవలం ఆప్టిట్యూడ్‌ టెస్టుల్లోనే కాదు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ మెలకువలపై పట్టున్న అభ్యర్థులు అవసరమని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే జాతీయ అంతర్జాతీయ కోడింగ్‌, ప్రోగామింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరచినవారికి ఎర్ర తివాచీతో ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రోగ్రామింగ్‌ పోటీల్లో టీసీఎస్‌ నిర్వహించే ‘కోడ్‌విట’ అతి పెద్దది. దీని వివరాలూ, పోటీకి ఉపకరించే మెలకువలూ తెలుసుకుందామా?

‘ప్రోగ్రామింగ్‌ ఒక క్రీడ’ అనే స్ఫూర్తితో 2012లో టీసీఎస్‌ కోడ్‌విట పోటీని మొదలుపెట్టింది. 2017లో దాదాపు రెండు లక్షల దేశ విదేశాల విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. క్రమంగా ఇది ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థులు పాల్గొనే కోడింగ్‌ పోటీగా రూపుదిద్దుకుంది. దీని లక్ష్యాలు: నీ ప్రతిభావంతులైన విద్యార్థులను టీసీఎస్‌ అవసరాల కోసం గుర్తించడం నీ ప్రోగ్రామింగ్‌లోని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించడం.నీ ప్రోగ్రామింగ్‌లో మెలకువలకు పదును పెట్టుకునే అవకాశం కల్పించడం.నీ ప్రతిభావంతులకు టీసీఎస్‌లో ఉద్యోగావకాశం కల్పించి ప్రోత్సహించడం. నీ తొలిదశలో పాల్గొన్నవారికి మలిదశకు అర్హత పొందలేకపోయినా ప్రశంసాపత్రాలు ఇవ్వడం.
కోడ్‌విట-2018 ముఖ్యమైన తేదీలు
* రిజిస్టర్‌ చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 17, 2018 (ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి). ఒక్కరే లేదా టీమ్‌గా పాల్గొనవచ్చు. టీమ్‌లో వేరు వేరు శాఖలకు చెందివారైనా ఫరవాలేదు కానీ ఒకే కాలేజీ విద్యార్థులే ఉండాలి.
* ప్రి-క్వాలిఫైయర్‌ రౌండ్‌ మొదలు జులై 28, 2018; చివరి తేది ఆగస్టు 11, 2018 రి క్వాలిఫైయర్‌ రౌండ్‌ మొదలు డిసెంబర్‌ 4, 2018; చివరి తేదీ డిసెంబర్‌ 5, 2018
* గ్రాండ్‌ ఫైనల్‌ మొదలు, ఆఖరు- ఫిబ్రవరి 25, 2019
ఇంజినీరింగ్‌ చదువుతున్నవారూ, సైన్స్‌లో డిగ్రీ/ పీజీ చేస్తున్నవారూ అర్హులు. వెబ్‌సైట్‌లో పోటీకి రిజిస్టర్‌ చేసుకోవాలి.
http://campuscommune.tcs.com/enin/intro/contests/codevita-2018
మొదటి రౌండ్‌ నుంచి మంచి ప్రదర్శన కనబరిచిన టాప్‌ 300 మంది లేక పోటీలో పాల్గొన్నవారిలో 5% మంది (ఏ సంఖ్య పెద్దదైతే అంతమంది) రెండో రౌండ్‌కి అర్హత పొందుతారు. రెండో రౌండ్‌ నుంచి 15 టీమ్‌లు ఫైనల్‌కి చేరుకుంటాయి. తుది రౌండ్‌ మనదేశంలోని ఒక టీసీఎస్‌ శాఖలో జరుగుతుంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు.
కొన్ని సూచనలు
* మొదటి రౌండ్‌ నుంచి ఐదు శాతం మందే ముందు రౌండ్‌కి వెళతారు. ఇక్కడ సమాధానాల్లో కచ్చితత్వం, సమయం రెండూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ రౌండ్‌లో హైస్కూల్‌ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ముందస్తు అభ్యాసం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
* రెండో రౌండ్‌లో కోడింగ్‌ మీద ప్రశ్నలు ఉంటాయి. కోడింగ్‌లో తప్పులు దొర్లకుండా ఉండాలంటే క్రమమైన పద్ధతి అనుసరించాలి. దీనికి అల్గోరిదŸమ్‌ అభివృద్ధి అభ్యాసం చేసి ఉండాలి. ఎక్కడ ఏ నిర్మాణ క్రమాన్ని ప్రయోగించాలో బాగా తెలుసుకోవాలి.
* ఈ రౌండ్లన్నిటిలోనూ తీసుకునే సమయం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
* అన్ని ప్రశ్నలూ చక్కగా చదివి, అర్థం చేసుకుని మీకున్న పరిధిలో సులభం నుంచి అతి కష్టం వరకు ఒక క్రమంలో ప్రశ్నలను గ్రేడ్‌ చేసుకోవాలి.
అభ్యాసం ఎలా చెయ్యాలి?
‘కాంపస్‌ కమ్యూన్‌’ పోర్టల్‌లో ‘ఓపన్‌ సీసామ్‌’ అనేచోట అభ్యాసానికి వివిధ వనరు లుంటాయి. వచ్చే అనుమానాల నివృత్తి కూడా పోర్టల్‌ ద్వారానే నివృత్తి చేసుకునే వీలుంది. అధ్యాపకుల/శిక్షకుల సహాయాన్నీ తీసుకోవచ్చు. ప్రాక్టీసుకు ‘మాక్‌విట’ అనే పేర మాక్‌ టెస్టులు కూడా ఉంటాయి. ఆపై మొదటి రౌండ్‌ పోటీ మొదలవుతుంది. ఈ రౌండ్‌లో న్యూమరికల్‌ ఎబిలిటీ, వర్బల్‌ ఎబిలిటీలో టెస్టు ఉంటుంది. ఈ రౌండ్‌ ఆన్‌లైన్‌లో ఉంటుంది. రెండో రౌండ్‌లో ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పోటీదారులు తమకు ఇష్టమైన లాంగ్వేజిలో కోడింగ్‌ చెయ్యవచ్చు. డాటా స్ట్రక్చర్స్‌, అల్గొరిదŸమ్‌ అభివృద్ధిలో మంచి ప్రావీణ్యం ఉండాలి. అదనంగా అభ్యాసం చెయ్యాలనుకుంటే ఉపకరించే సైట్లు-
https://code.google.com/codejam/contest/3264486/dashboard
www.hackerearth.com/
http://code.google.com/codejam/past-contests
www.programminggeek.in/2016/07/TCS-CodeVita-Previous-years-questions.html#.WzUCANUzbIUPosted on 10-07-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning