డేటా గోప్యత, క్లౌడ్‌లపై మైక్రోసాఫ్ట్‌ ఉచిత కోర్సు

డేటా పరిరక్షణ నిబంధనలూ, భద్రత, అనుమతులపై దృష్టిపెడుతూ టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌.. ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ ఆన్‌లైన్‌ కోర్సును ప్రవేశపెట్టింది. దీన్ని ఉచితంగా అందించటం విశేషం. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇదో మంచి అవకాశం! కంప్యూటర్‌/లాప్‌టాప్‌/స్మార్ట్‌ ఫోన్‌/టాబ్లెట్‌ ఉండి, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉన్న ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు!

క్లౌడ్‌ టెక్నాలజీ, డేటా గోప్యత, భద్రతలపై దేశంలో అవగాహన పెంచడమే లక్ష్యంగా లర్నింగ్‌ పార్ట్‌నర్‌ ‘మై లా’తో కలిసి మైక్రోసాఫ్ట్‌ ఈ కోర్సును ఆరంభించింది. విద్యార్థులతో పాటు వ్యాపార, న్యాయ నిపుణులు, మొత్తం లీగల్‌ అండ్‌ కాంప్లియన్స్‌ కమ్యూనిటీలకు ఈ కోర్సు ఉపయోగకరం. ఇవి క్లౌడ్‌లోని డేటా పరిరక్షణ, జనరల్‌ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (జీడీపీఆర్‌) ప్రాథమికాంశాలు, భద్రత మొదలైన అంశాలపై అవగాహన పెంచుతాయి.

డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ కోర్సులోని మొదటి దశ క్లౌడ్‌ కంప్యూటింగ్‌. జీడీపీఆర్‌, భారతీయ సమాచార భద్రత వంటి చట్టాలు ఈ విభాగంలోని సమస్యలపై ఎలా స్పందిస్తున్నాయనే అంశాలూ సిలబస్‌లో ఉంటాయి. రెండో దశ- క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ఆధునిక సమాచార నిర్వహణకు అవసరమైన ఇతర నియంత్రణ విధానాల గురించి ఉంటుంది.

ఈ కోర్సును mylaw.in, myLaw ఆప్‌ ద్వారా తక్కువ పరిధిలో, తేలికగా నిర్వహించగలిగేలా రూపొందించారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా, మై లా సంయుక్తంగా కోర్స్‌వర్క్‌ను రూపొందించాయి. ఇది 2-3 గంటల స్వల్పవ్యవధితో ఉంటుంది. ఈ ఆడియో-విజువల్‌ కోర్సుకు అదనంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యం గల సప్లిమెంటరీ కంటెంట్‌తోపాటు రిఫరెన్స్‌ మెటీరియల్‌నూ అందిస్తున్నారు. సమాచార పరిరక్షణ చట్టాలపై తాజా సమాచారాన్ని కూడా నెలవారీగా ఈ వేదిక ద్వారా అందించనున్నారు.Posted on 08-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning