టీసీఎస్‌ ఉద్యోగాహ్వానం!

2019లో కోర్సు పూర్తిచేసుకోబోయే ఇంజినీరింగ్‌ విద్యార్థ్థులకు ప్రసిద్ధ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) ఒక శుభవార్తను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని టెక్నికల్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలను అందించనుంది. క్వాలిఫయర్‌ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా తగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది!

టీసీఎస్‌ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్ల నుంచి నింజా డెవలపర్లను ఎంచుకోనుంది. బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ- 2019లో రెగ్యులర్‌ విధానంలో పూర్తయ్యేవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజినీరింగ్‌ అన్ని స్పెషలైజేషన్లవారూ, ఎంఎస్‌సీ కంప్యూటర్‌సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాలవారూ, డిగ్రీలో బీఎస్‌సీ/ బీసీఏ/ బీకాం/ బీఏల్లో మేథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌ చదివి, ఆపై ఎంసీఏ చేసినవారూ అర్హులు. పది, ఇంటర్మీడియట్‌, డిగ్రీ/ డిప్లొమా, పీజీల్లో 60% మార్కులు తప్పనిసరిగా కలిగివుండాలి. పరీక్ష రాసేనాటికి బ్యాక్‌లాగ్‌ ఒకటికి మించి ఉండకూడదు. విద్యాపరంగా రెండేళ్లకు మించి విరామం ఉండకూడదు.

ఎంపిక ఎలా?
నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి- 90 నిమిషాలు. ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, కోడింగ్‌ అంశాలపై ప్రశ్నలుంటాయి. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దానిలో విజయం సాధించినవారికి టీసీఎస్‌ ఉద్యోగ ఆఫర్‌ లభిస్తుంది.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థులు ముందుగా.. http://www.careers.tcs.comలో బిగినర్స్‌ ట్యాబ్‌ కింద ఉన్న ‘న్యూ యూజర్‌’ను ఎంచుకోవాలి. దానిలో ఐటీని క్లిక్‌ చేసి, దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేయాలి. ‘అప్లికేషన్‌ రిసీవ్‌డ్‌’ అని వచ్చాక ‘అప్లై ఫర్‌ డ్రైవ్‌’ మీద క్లిక్‌ చేసి ప్రక్రియను పూర్తిచేయాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 20, 2018
పరీక్ష తేదీలు: 2018 సెప్టెంబరు 2, 3 తేదీలుPosted on 13-08-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning