ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ కోసం టేబుల్స్‌ టెక్నిక్‌

ప్రాంగణ నియామకాలు
క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో కొలువు కొట్టాలనేది ప్రతి విద్యార్థి కల. కానీ ఎనభైశాతం మంది మొదటి అడుగైన ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ దగ్గరే కూలబడిపోతున్నారు. కారణం చాలామంది ఆ పరీక్షల్లో చిన్న చిన్న లెక్కలు, పజిల్స్‌ మాత్రమే అడుగుతారనే అపోహలో ఉండటమే. కానీ ప్రతి ప్రశ్న ఇవ్వడంలోనూ పరమార్థం ఉంటుంది. అభ్యర్థుల సమస్యా పరిష్కార సామర్థ్యం, నిర్ణయం తీసుకునే నేర్పు వంటి నైపుణ్యాలను ఇందులో పరీక్షిస్తారు. వారి వైఖరులను అంచనా వేస్తారు. అందుకే తొలి అడుగు తడబడకుండా ఉండాలంటే కొన్ని టెక్నిక్‌లను అనుసరించాలి.. అభ్యసించాలి.

బ్యాక్‌లాగ్స్‌ లేకుండా కనీసం 60% మార్కులున్న విద్యార్థులకు ప్రాంగణ ఎంపికల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. అంటే అకడమిక్స్‌లో మంచి పట్టు ఉందో లేదో ఇక్కడ తెలిసిపోతుంది. ఈ అర్హత ఉన్న వాళ్లందరికీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కో కంపెనీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ పేపర్‌ ఒక్కోలా ఉంటుంది. కానీ ఒక్క కంపెనీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ క్లియర్‌ చేసినవాళ్లే వేరే వాటి టెస్టులు కూడా క్లియర్‌ చేస్తుంటారు. మొదటి కంపెనీ పరీక్షలో విఫలమైనవారు తరువాతి వాటిలోనూ నెగ్గలేకపోతుంటారు.
అంటే ఇక్కడ ఆప్టిట్యూడ్‌ పేపర్‌ సులువైనా, కష్టమైనా వచ్చినవాళ్లకు వస్తూనే ఉంటుంది. రానివాళ్లకు రాదు. ఎందుకిలా జరుగుతోంది?
జాబ్‌కి ఆప్టిట్యూడ్‌... క్రికెట్‌లో టెక్నిక్‌ లాంటిది. టెక్నిక్‌ అంటే ఫుట్‌ వర్క్‌, టైమింగ్‌, ప్లేస్‌మెంట్‌, జడ్జ్‌మెంట్‌ అండ్‌ టెంపర్‌మెంట్‌. ఇవన్నీ ఉన్న ఆటగాళ్లు దేశం, పిచ్‌, బౌలర్‌.. ఇలా దేన్నైనా ఎవరినైనా సునాయాసంగా ఎదుర్కొంటారు. పరుగులు చేస్తూనే ఉంటారు. ఆప్టిట్యూడ్‌ వయసుతోపాటు పెరుగుతుంది.ముందు అది మనలో ఉందని తెలుసుకోవాలి. తరువాత పెంచుకోవాలి.
ఆప్టిట్యూడ్‌ అంటే మేథమేటిక్స్‌ కాదని అర్థం చేసుకోవాలి. దీన్ని రెండు భాగాలుగా చూడొచ్చు. 1. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 2. లాజికల్‌ రీజనింగ్‌. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో నంబర్లుంటాయి. లాజికల్‌ రీజనింగ్‌లో నంబర్లుండవు. మిగతాదంతా ఒకేలా ఉంటుంది.

సొంత సమస్యలా భావించాలి
ఒక సంస్థ.. అభ్యర్థిలో సమస్య పరిష్కార సామర్థ్యం ఎంతవరకూ ఉందో పరీక్షించడానికి ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను పెడుతుంది. అది కూడా సహజమైన సామర్థ్యమో కాదో చూడాలనుకుంటుంది. అందుకే ఆ నైపుణ్యాలు బయటపడేలా ప్రశ్నలడుగుతుంది. ఒక సమస్య ఇచ్చి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఎంతవరకూ సరిగా అర్థం చేసుకుంటున్నారు? దాని పరిష్కారానికి ఎంత సమయం తీసుకుంటున్నారనేది గమనిస్తుంది. అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్‌ను సొంతదానిలా చూస్తున్నారా లేదా పరీక్షలో ఒక ప్రశ్నగా మాత్రమే చూస్తున్నారా అనేది కూడా ఇక్కడ ముఖ్యమే.
చిన్నప్పుడు గణితంలో అందరికీ ఎక్కాలు నేర్పిస్తారు. ఎక్కం ఏదైనా అది 2, 3.. మరేదైనా కావొచ్చు. ఎక్కం అంటే కూడికను సులువు చేసే పద్ధతి. 2+2+2+2+2+2+2+2+2+2 చేసే బదులుగా 2 × 10= 20 అని తెలుసుకున్నాం. టేబుల్స్‌ నేర్చుకుంటే సమయం వృథా కాకుండా కాపాడుకోవచ్చన్న సంగతిని పాఠశాల స్థాయిలోనే అర్థం చేసుకున్నాం. కానీ అవే టేబుల్స్‌ను ఆప్టిట్యూడ్‌లోని ప్రతి టాపిక్‌లో వాడుకోవచ్చని తెలుసా! టేబుల్స్‌ వేసుకుంటే ప్రతి సమస్యా సులువుగా అనిపిస్తుంది. ఒక్కో టాపిక్‌కు ఒక్కో టేబుల్‌ వేసుకుంటే చాలు...సమయం సరిపోవడం కాదు; మిగిలిపోతుంది!

ముందు ఉండటమే ముఖ్యం
అన్ని రౌండ్ల కంటే ఎక్కువ, చిన్న చిన్న తప్పులన్నీ ఇక్కడే చేస్తాం. ఎంతో పరిజ్ఞానమున్నవారు కూడా ఇక్కడే ఫెయిల్‌ అవుతుంటారు. అసలెక్కడ తప్పు జరుగుతోందో కూడా తెలుసుకోకుండా చేసిన పొరబాట్లనే తిరిగి చేస్తుంటారు. చాలామంది టెస్ట్‌ రాసిన తరువాత ‘పేపర్‌ సులువుగా వచ్చింది. 100% పాస్‌ అవుతాను’ అంటుంటారు. తీరా ఫలితాలు వచ్చాక ఫెయిలయ్యారని తెలుసుకుని షాక్‌ అవుతుంటారు. కొంతమందేమో ‘పేపర్‌ చాలా కష్టంగా వచ్చింది, తప్పకుండా ఫెయిల్‌ అవుతాం’ అనుకుని తీరా పాస్‌ అవుతుంటారు. అసలెలా పాస్‌ అయ్యామా అని వాళ్లే ఆశ్చర్యపోతుంటారు.
జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకిలా జరుగుతోందో అర్థమవుతుంది. ఈ పోటీపరీక్షలకీ కాలేజీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. కళాశాలలో అకడమిక్‌ ఎగ్జామ్‌ పేపర్‌ సులువుగా ఉంటే 80-90% మార్కులు వస్తాయి. పోటీపరీక్షలు (ప్రాంగణ నియామకాలతో సహా) వేరు. పేరులోనే పోటీ ఉంది. అంటే పేపర్‌ సులువుగా ఉందంటే మీకు మాత్రమే కాదు.. మీతో పరీక్ష రాసేవాళ్లందరికీ అలాగే ఉంటుంది. అంటే మీతోపాటు అందరూ బాగానే రాసుంటారు. పేపర్‌ సులువుగా వచ్చినా, మీరెంత బాగా రాసినా మీతోపాటు పరీక్ష రాసేవాళ్లు ఎలా రాస్తున్నారనే దానిపైనే మీ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇక్కడ పేపర్‌ ఎలా వచ్చింది, మీకెంత పర్సంటేజీ వచ్చింది అనే దానికంటే మీతోపాటు పరీక్ష రాసేవాళ్ల కంటే మీరు ముందున్నారా లేదా అనేది ముఖ్యం.

కష్టమైనా.. సులువైనా మార్కులొకటే
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో నిర్ణయం తీసుకోవడం (డెసిషన్‌ మేకింగ్‌) చాలా ముఖ్యం. ఎందుకంటే సాధారణంగా ఏ సంస్థ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో అయినా 50 ప్రశ్నలుంటాయి. 30-40 నిమిషాల సమయమిస్తారు. ఆ 50 ప్రశ్నల్లో సుమారు 20 సులువుగా, 20 మధ్యస్థంగా, 10 కష్టంగా ఉంటాయి. దాదాపుగా ఎవరూ కూడా 50కి 50 స్కోర్‌ చేయలేరు. ఎందుకంటే సరిగా సాధన చేస్తే 20 ప్రశ్నలను 15 నిమిషాల్లో చేసేయొచ్చు. 20 మధ్యస్థంగా ఉన్న ప్రశ్నలకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. 10 కఠిన ప్రశ్నలకు ఇంకో 30 నిమిషాల సమయం కచ్చితంగా అవసరమవుతుంది. అంటే ఆ పేపర్‌ మొత్తం చేయడానికి మనకు కనీసం 75-80 నిమిషాలు పడుతుంది. కానీ మనకు ఇచ్చే సమయం 30 నిమిషాలు. కాబట్టి ముందుగా వేటిని చేయాలో నిర్ణయించుకోవాలి.
ముందుగా సులువుగా ఉన్నవాటిని గుర్తించి చేయాలి. ఆ తరువాత మధ్యస్థంగా ఉన్నవాటిని చేయాలి. కష్టమైనా, సులువైనా ఒకే మార్కులు కాబట్టి కష్టమైన వాటిని వదిలేయాలి. మనకు రాక కాదు.. చేయడం ఇష్టం లేక వదిలేయాలి.

పరుగులు... మార్కులు
ఆప్టిట్యూడ్‌లో కాల్‌క్యులేషన్స్‌ క్రికెట్‌లో ధోనీలా ఉండాలి. అంటే.. కాల్‌క్యులేషన్స్‌ను ప్రాబ్లమ్స్‌ను చేయడానికి మాత్రమే కాదు. వేటిని చేయాలనేదానికి కూడా వాడాలి. ధోనీ క్రికెట్‌ ఆడేటపుడు గమనిస్తే ఏ బౌలర్‌ను టార్గెట్‌ చేసి పరుగులు చేయాలి, ఏ బౌలర్‌నుంచి వికెట్‌ను కాపాడుకోవాలనేది చాలా జాగ్రత్తగా గమనించి ఆడుతుంటాడు. సరిగ్గా దీన్నే ఆప్టిట్యూడ్‌లో వాడాలి. కష్టమైన ప్రాబ్లమ్స్‌కి గౌరవమిచ్చి వదిలేస్తూ, సులువుగా ఉండేవాటిని ఒక్కటీ వదలకుండా చేసుకుంటూ స్కోర్‌ చేసుకోవాలి. ఇలా తీసుకునే నిర్ణయం సరిగా ఉంటే స్కోర్‌ పెరుగుతుంది. సమయం కూడా సరిపోతుంది.
ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఎగ్జామినర్‌ మనల్ని తికమక పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. తప్పు సమాధానం చేస్తే అతను గెలిచినట్టు. కరెక్టుగా గుర్తించినా, దాన్ని వదిలేసినా మనం గెలిచినట్టు. కాబట్టి, జాగ్రత్తగా ఆలోచించి తేలికైనవి ఎంచుకుంటూ సమాధానాలు పెడితే ఆప్టిట్యూడ్‌ క్లియర్‌ చేయడం అసలు కష్టమే కాదు!
క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లే కాకుండా బ్యాంకు పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ సివిల్స్‌ లాంటి ఎన్నో పోటీపరీక్షల్లో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌ ఉంటుంది. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ కూడా ఇంటర్వ్యూ లాంటిదే. కాకపోతే ఒక సంస్థ అందరికీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి మన ఆలోచనా విధానం, వేగం, సమస్య ఎదురైనపుడు దాన్ని పరిష్కరించే క్రమం తీరు ఎలా ఉందో అంచనా వేయడానికి ఈ టెస్ట్‌ తోడ్పడుతుంది.

అందుకే....
* ఆప్టిట్యూడ్‌ పరీక్షలో అడిగే ప్రతి సమస్యనూ వ్యక్తిగత సమస్యగా ఆలోచించి పరిష్కరించే విధానానికి అలవాటుపడాలి.
* కొత్తగా ఎలాంటి టెక్నిక్స్‌ను ఉపయోగించొచ్చో కూడా ఆలోచిస్తుండాలి. అపుడు ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రాస్తున్నంతసేపూ మన ఆలోచనా ప్రక్రియ ఏంటో మనకే అర్థమవుతూ ఉంటుంది. సాధన చేస్తున్నకొద్దీ కొత్త టెక్నిక్‌లను కనుక్కునే స్థాయికి ఎదుగుతారు.
* ఆప్టిట్యూడ్‌ సహజ సామర్థ్యం. కాబట్టి ఎవరికివారే తమకు ఆ సామర్థ్యం ఎంతుందో తెలుసుకోవాలి. దాని ఆధారంగా ప్రతిరోజూ కొంచెమైనా పెంచుకునే ప్రయత్నం చేయాలి.
జిమ్‌కు వెళ్లిన ఒక్కరోజులో ఫిట్‌నెస్‌ రాదు. బ్యాట్‌ పట్టుకున్న ఒక్కరోజులో క్రికెట్‌ రాదు. ఈత, డ్రైవింగ్‌.. ఇలా ఏదైనా సరే మొదటిరోజే రాదు. కానీ నిలకడగా సాధన చేస్తే దేన్నయినా నేర్చుకోవచ్చు. వచ్చిన తరువాత జీవితాంతం మనతోనే ఉంటుంది. ఆప్టిట్యూడ్‌ కూడా అలాంటిదే. ఒక్కరోజులో రాదు కానీ, ఒక్కసారి వస్తే జీవితాంతం ఏ పరీక్ష రాసినా ఉపయోగపడుతూనే ఉంటుంది. అంతే కాదు; జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా సాయపడుతుంది!

సరాసరి..
The average weight of 26 students in a class is 42. One boy joined the class and the average weight increased by 2 kg. Find the weight of the boy who joined the class?
ఈ సమస్యను మేథమేటిక్స్‌లో సాధించాలంటే సరాసరి = మొత్తం/ సంఖ్య అంటే.. మొత్తం = సరాసరి × సంఖ్య. ఆ అబ్బాయి చేరకముందు ఆ తరగతిలో మొత్తం బరువు 26 × 42 = 1092 కేజీలు. చేరిన తరువాత 27 × 44 = 1188. అంటే కొత్త అబ్బాయి బరువు= 1188 - 1092 = 96 కేజీలు. ఇలా చేయడం వల్ల ఎంతో సమయం వృథా అవుతుంది. ఇక్కడే కంపెనీకి అభ్యర్థి తన ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌ను వాడట్లేదని అర్థమవుతుంది.
ఇప్పుడు మనం అసలు సరాసరి అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఆ తరువాత ఇదే సమస్యను సహజంగా ఎంత సులువుగా చేయొచ్చో తెలుసుకుందాం.
మనం చిన్నప్పుడు సోషల్‌ స్టడీస్‌లో ప్రాథమిక హక్కుల్లో ‘సమానత్వపు హక్కు’ అని చదువుకున్నాం. మన దగ్గర రూ.100 ఉండి, మన స్నేహితుడి దగ్గర రూ.60 ఉంటే.. మన దగ్గరున్న రూ.100లో నుంచి రూ.20 మన స్నేహితుడికి ఇస్తే ఇద్దరి దగ్గరా సమానంగా రూ.80 ఉంటాయి. అలా ఒక గ్రూపులో అందరినీ సమానంగా మార్చే బాధ్యత తీసుకోగలిగితే ఈ సమస్యను 10 సెకన్లలో పూర్తిచేయొచ్చు.

సులువుగా చేయ‌డానికి ఒక టేబుల్‌ వేసుకుందాం...
ఈ సమస్యలో ముందు 26 మంది విద్యార్థులున్నారు. ఒక్కొకరు 42 కేజీలు అనుకుందాం. ఆ 27వ అబ్బాయి ‘నేనే’ అనుకోవాలి. నువ్వు చేరిన తరువాత ఒక్కొక్కరి బరువు 44 కేజీలు అవుతుంది. అంటే నువ్వే 42గా ఉన్న బరువును 44గా మారుస్తున్నావ్‌. ముందు నువ్వు 44 తీసుకో. ఆ తరువాత 42గా ఉన్న మిగతా 26 మందికి ఒక్కొక్కరికి 2 కేజీలు ఇచ్చేయ్‌. ఎందుకంటే వాళ్లని కూడా 44గా మార్చే బాధ్యత నీదే. అంటే 26 × 2= 52 పంచుతున్నావ్‌. 44 నీదగ్గర ఉంచుకుని 52 పంచుతున్నావ్‌. అందుకే నీ సమాధానం 44+52=96
పైన వివరించిన అంశాలే కాకుండా ఆప్టిట్యూడ్‌లోని ప్రతి టాపిక్‌లో పర్సంటేజీలు, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, సింపుల్‌, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌, పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌, లాజికల్‌ పజిల్స్‌, సిలాజిజం, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, టైం- వర్క్‌ అన్నింటికీ టేబుల్స్‌ ఉంటాయి. చిన్నపుడు మనం నేర్చుకున్న ఎక్కాలు ఎలాగైతే గణితంలోని ప్రతి టాపిక్‌లో మనకు సాయపడుతున్నాయో ఇలా ప్రతి టాపిక్‌కు మనం వేసుకునే టేబుల్స్‌ కూడా ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను సులువుగా క్లియర్‌ చేయడానికి తోడ్పడుతాయి.

కాలం-దూరం
One train starts from Hyderabad to Mumbai at 2.30 pm with a constant speed of 70 kmph. Another train starts from Mumbai to Hyderabad at 4:00 pm with a constant speed of 80 kmph. If the distance between Hyderabad and Mumbai is 855 kms, then Find
a) At what time they meet?
b) At what distance from Hyderabad they meet ?
c) At what distance from Mumbai they meet?
ఇలాంటి సమస్యను సాధించాలంటే సులువుగా 2-3 నిమిషాలు పడుతుందనుకుంటారు. ఎన్నో ఫార్ములాలు నేర్చుకోవాలి, సాపేక్ష వేగానికి సంబంధించిన కాన్సెప్టులను బట్టీ పట్టాలి అనుకుంటారు.
వేగం= దూరం/సమయం; దూరం= వేగం × సమయం; సమయం= దూరం/వేగం. ఇలాంటివెన్నో తీసుకుని X1y1 కాన్సెప్టులను అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది. కానీ ఇదంతా మేథమేటిక్స్‌. ఒకసారి ఆప్టిట్యూడ్‌ స్కిల్స్‌తో ఆలోచిస్తే ఒకేసారి మూడు సమాధానాలను చాలా సహజంగా, ఎంతో ప్రాక్టికల్‌గా పరిష్కరించొచ్చు.
ఒక టేబుల్‌ వేసుకుందాం ఇలా..

మొత్తం కలిపితే 855 కిమీ రావాలి. అది ఏ సమయానికి వస్తుందో అవే మన సమాధానాలు.
ఇక్కడ..
a) At what time they meet ? 9 : 00 pm
b) At what distance from Hyderabad they meet ? 455 km
c) At what distance

Posted on 26-09-2018

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning