ఇంజినీర్లు.. సృజన ధీరులు

* నమూనాలతో సత్తా

* అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు

రాజాం, న్యూస్‌టుడే : వర్థమాన ఇంజినీర్లు సృజనకు పదును పెట్టారు. కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. సాంకేతిక, వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా చాటేందుకు ఉవ్వీళ్లూరారు. ఘణమైన ఫలితాలు సాధించే నమూనాలకు ప్రాణం పోశారు. వీటన్నింటికి ఫిబ్రవరి 7న జీఎమ్మార్ఐటీలో జరిగిన స్టెప్‌కాన్ వేదికగా నిలిచింది. పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు కొత్త అంశాలను ఇక్కడ ప్రదర్శించారు. ఒకరు ఎఫ్ఎం రేడియో కేంద్రాన్నే గుప్పిట్లోకి తేగా, మరొకరు రోబోట్‌లను సృష్టించారు. ఇలా సరికొత్త అంశాలతో అందమైన ప్రదర్శనలను రూపొందించారు.
గుప్పిట్లో ఎఫ్ఎం రేడియో
విశాఖపట్టణం కుర్రాడు గంటి భార్గవ అమోఘమైన 'ఇన్నోవేటివ్ ఎఫ్ఎం ట్రాన్సిస్ట్' ప్రాజెక్టును రూపొందించి ఔరా అనిపించాడు. ఏ ఫ్రీక్వెన్సీలోనైనా ఎఫ్ఎం రేడియో సంకేతాలు అందే ప్రాజెక్టుకు జీవం పోశాడు. గాయత్రీ విద్యా పరిషత్తుకు చెందిన ఈ విద్యార్థి అప్లిడెట్ ఫ్రీక్వెన్సీను ఎఫ్ఎం రేడియో ఫ్రీక్వెన్సీలోకి మార్చి స్టేషన్‌ను సృషించాడు. ఇందులో కావాల్సిన పాటలు నిక్షిప్తం చేసి ఏ ఫ్రీక్వెన్సీలోనైనా వినే ఏర్పాటు చేశారు. కేవలం రూ.2,500 విలువ చేసే రేష్పబెర్రీ (కంప్యూటర్)పై దీన్ని ఆవిష్కరించారు. దీని ద్వారా లైవ్‌లో మాట్లాడొచ్చని నిరూపించారు.
ఇండస్ట్రియల్ ఆటో మిషన్
టెక్కలి ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు శ్రీపాద కాశీవిశ్వనాథం, జోగారావు, పవన్‌కుమార్‌లు 'ఇండస్ట్రియల్ ఆటో మిషన్' ప్రాజెక్టు రూపొందించారు. మనుషులు వెల్లలేని సమయంలో రిమోట్‌తో నియంత్రించే రూపకల్పన చేశారు. ల్యాప్‌టాప్, సెల్‌ఫోను ద్వారా ఇంటర్నెట్‌లో లాగిన్ అయ్యి ఈ డివైజర్‌ని నియంత్రిచొచ్చు. రాత్రి పది గంటలు తరువాత పరిశ్రమల్లోకి వెళ్లలేక పోయినా, ప్రమాదాలప్పుడు వెళ్లలేని పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుందని విద్యార్థులు వివరించారు. దీనికి అనుబంధంగా దొంగతనాలు, దోపిడీలు నివారించే నమూనా ఏర్పాటు చేశారు.
మొబైల్.. దొంగలను పట్టిస్తుంది
మొబైల్ ఫోను పోయిందని బెంగ వద్దు.. క్షణాల్లో దొంగలను పట్టిస్తుంది. అంతే కాదు మొబైల్ దొంగలించేందుకు ఎవరు ప్రయత్నించినా 1.5 మీటర్ల దూరం నుంచే గుర్తించి యజమానికి సంకేతాలు ఇస్తుంది. రాయగడ జీఐఏసీఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులు నితిన్‌ముఖేష్, ప్రభాత్‌కుమార్, చంద్రకుమారి 'మొబైల్ ఫోను డిటెక్టెడ్'కు రూపకల్పన చేశారు. ఏంటినా సాయంతో ఇది పనిచేస్తుంది. కొన్ని నిషేధిత ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించి ఎదుటి వారి కదలికలను పసిగట్టొచ్చు. ఇదొక రక్షణ వ్యవస్థగా పనిచేస్తుందని విద్యార్థులు వివరించారు.
రోబోలతో పనులు చేయించేద్దాం
మనుషుల స్థానంలో రోబోట్‌లను వినియోగిస్తే పని వేగంగా అవుతుంది. ఖర్చు తగ్గించొచ్చు. వ్యవసాయం, పరిశ్రమలు, అనుబంధ రంగాల్లో వినియోగించేలా 'పాత్ ఫాలోయింగ్ రోబోట్' తూర్పుగోదావరికి చెందిన ప్రణయ్, జార్జ్, వికాస్ నాయుడు రూపొందించారు. వీరంతా సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. ఈ ప్రాజెక్టుతో రోబోతో పనులు చేయించుకోవచ్చు. రిమోట్‌తో దాన్ని అక్కడకు పంపి ప్రత్యేక సంకేతాల ద్వారా తిరిగి అవసరమైన వస్తువులు తీసుకొని వెనక్కి వస్తుంది. సెన్సార్స్, రెండు ఐసీలు, రెగ్యులేటర్, ట్రాన్స్‌ఫార్మర్, డీసీ మోటార్స్, ఇలా పలు సాంకేతిక వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశారు.
రోబోటిక్ ఆర్మ్‌తో ఎంతో మేలు
రోబోటిక్ ఆర్మ్.. రోబోట్ చేతితో ఎంత పెద్ద వస్తువునైనా తీసుకొస్తుంది. సాధారణంగా రోబోలు కొన్ని పరిమితమైన పనులే చేస్తాయి. విజయనగరం రఘు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి శ్రీతేజ తయారు చేసిన 'రోబోటిక్ ఆర్మ్' నమూనా ఎంతటి వస్తువునైనా తీసుకువస్తుంది. మనం చెప్పినట్లు మెకానిక్‌గా నేర్చుకొని అందుకు తగ్గట్టుగా పనితీరు మార్చుకుంటుంది. సెన్సార్ ద్వారా అప్త్లె చేయించి రోబోను వినియోగించవచ్చు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning