ప్రణాళిక ఉంటే విదేశీ విద్య సులువే!

* ఒకే వేదికపై వివిధ కన్సల్టెన్సీలు

* ఈనాడు ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు విశేష స్పందన

మలక్‌పేట, న్యూస్‌టుడే: విదేశాలలో ఉన్నత విద్య ఎక్కడ బాగుంటుంది. ఏ కోర్సులు ఏ విశ్వవిద్యాలయాలలో అందుబాటులో ఉన్నాయి. విదేశాలకి వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇక్కడ ఎలా సిద్ధమవ్వాలి.? ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది... తదితర అంశాలపై ఆదివారం ఈనాడు ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌లో నిర్వహించిన విదేశీ విద్యపై ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌కు విశేష స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులు కేంద్రం వద్దకు చేరుకున్నారు. బ్రిలియంట్‌ సంస్థల ఛైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో ఈనాడు ఎప్పుడూ ముందుంటుందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. బీటెక్‌, డిగ్రీలు, ఇంటర్‌ పూర్తయిన వారితో పాటు ప్రస్తుతం కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఈ ఫెయిర్‌కు హాజరయ్యారు. నగరంతో పాటు శివారు జిల్లాల్లోని ప్రాంతాల వారు కూడా వచ్చి తమ పిల్లల కోసం కావాల్సిన సమాచారాన్ని సేకరించారు.

విదేశాలలో అందుబాటులో ఉండే కోర్సులతో పాటు అక్కడి పరిస్థితులు పిల్లలకు బాగుంటాయా? అనే విషయాలను కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కన్సల్టెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గతంలో మనదేశ విద్యార్థులకు విదేశాల్లో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఒకే చోట 27 కన్సల్టెన్సీలు ఫెయిర్‌లో పాల్గొనడంతో వచ్చిన వారంతా తమకు కావాల్సిన సమాచారం ఒకే చోట లభ్యమైందంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఎంబీబీఎస్‌ వంటి కోర్సులకు సంబంధించి ఉన్నత విద్య అభ్యసించేందుకు ఏఏ పరీక్షలు రాయాలనే విషయాలపై కన్సల్టెన్సీ నిర్వాహకులు విద్యార్థుల అనుమానాలు నివృత్తి చేశారు. ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, టోఫెల్‌, జీమ్యాట్‌ పరీక్షలలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, పరీక్ష రాసేవిధానంపై నిర్వాహకులు అవగాహన కల్పించారు. ఉన్నత విద్య చదువడానికి విదేశాలకు వెళ్లే సమయంలో అందుబాటులో ఉండే విద్యా రుణాల గురించి వివరించారు. ముందస్తు ప్రణాళిక ఉంటే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడం సులువేనని ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల నిర్వాహకులు సూచించారు.

పాల్గొన్న కన్సల్టెన్సీలు ఇవే..!

శౌర్య కన్సల్టెన్సీ, విదేశ్‌ కన్సల్జ్‌, వి అండ్‌ యూ ఇంటిలెక్ట్‌ కన్సల్టెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, గ్లేమ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌, బ్లూ రిబ్బన్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్స్‌, క్రెడో వీసాస్‌, ది కాలుక్యులస్‌, పెగాసస్‌ సొల్యూషన్స్‌, వీ మ్యాప్‌ వీ కెరీర్‌ కన్సల్టెన్సీ, ఇంటెగ్రా ఓవర్సీస్‌ కన్సల్టెంట్స్‌, నెక్సస్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌, అబ్రాడ్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్స్‌, వెస్ట్రన్‌ వింగ్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌, గ్లోబల్‌ సిక్స్‌ సిగ్మా కన్సలెంట్స్‌, యూనికనెక్ట్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ, యూనిర్శిటీ ఆఫ్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ (ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌), జేఎంజే ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌, వీసా 9 ఎడ్యుకేషనల్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, వెస్లీ ఇమ్మిగ్రేషన్‌ కన్సల్టెంట్స్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, పీపుల్‌ అబ్రాడ్‌, యారోస్‌ ఓవర్సీస్‌ కన్సల్టెన్సీ, స్డూడెంట్‌ నెక్ట్స్‌.ఇన్‌, నాధియాస్‌ కన్సల్టెన్సీ, సిగ్నెట్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కెరీర్స్‌, ఐఎంఈఎస్‌ ఇంటర్నెషనల్‌ మెడికల్‌ ఎడ్యు సర్వీసెస్‌లు పాల్గొన్నాయి.Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning