ఉద్యోగాల 'అనుసంధానం'!

యువత నిత్యజీవితంతో పెనవేసుకుపోయిన సామాజిక అనుసంధాన వేదికలు కేవలం కాలక్షేపమే కాదు; మరెన్నో ప్రయోజనాలనూ నెరవేరుస్తున్నాయి. ఇవి ఉద్యోగాన్వేషణకు కూడా ఎంతో ఉపకరిస్తున్నాయి. ఈ వేదికలను సక్రమంగా వినియోగించుకుంటే సమయం, డబ్బు ఆదా చేసుకోవటమే కాకుండా సత్వర ఫలితాలూ పొందవచ్చు!
ఉద్యోగావకాశాల కోసం వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చే ప్రకటనలపై ఆధారపడడం.. తరువాత చాలావరకు చేత్తో రాసిన/ దుకాణాల్లో దొరికే ముద్రించిన బయోడేటా కాపీలను పంపించడం.. కేవలం ఒక సంస్థ వారు పంపే సమాధానం కోసం వారాలు, నెలల తరబడి వేచిచూడడం.. ఇలాంటి రోజులు ఎప్పుడో గతించాయి.
నేడు సామాజిక వేదికలు అభ్యర్థికి ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి వివిధ రకాల అవకాశాలను కల్పిస్తున్నాయి. బయోడేటా పాతపడిపోయింది. కవర్‌ లెటర్‌, టెక్ట్స్‌ రెజ్యుమె, వీడియో రెజ్యుమె/ కరికులమ్‌ వీటేలు అభ్యర్థిపై మంచి అభిప్రాయం కలిగించడానికి అత్యావశ్యకాలయ్యాయి. అభ్యర్థి వార్తాపత్రికలు/ టీవీ ప్రకటనలపై మాత్రమే ఆధారపడటం తగ్గిపోయింది. కాబట్టి ప్రపంచాన్ని సులువుగా అనుసంధానించే సోషల్‌ మీడియా, నెట్వర్కింగ్‌ సైట్లు, బ్లాగులే ప్రభావశీలమైన మార్గదర్శకాలు.
బ్లాగులు
ఈ-మెయిల్‌ మాదిరిగానే వ్యక్తిగత బ్లాగును ఎవరైనా కొన్ని నిమిషాల వ్యవధిలోనే తయారు చేసుకోవచ్చు. www.blogger.com, wordpress.com లాంటి సైట్లు ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. స్నేహితులు, సహోద్యోగులు, రిక్రూటర్లతో అనుసంధానమవడానికీ; అభిప్రాయాలను పంచుకోవడానికీ; ఆసక్తికరమైన అంశాలను ప్రదర్శించడానికీ; అభిప్రాయాలు, నమ్మకాలపై చర్చ, తర్కం/ వాదనలకూ; ఇష్టాయిష్టాలను తెలియజేయడానికీ; తమ ప్రతిభ, శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికీ బ్లాగులు అవకాశాన్ని కల్పిస్తాయి.
* మీ ఉద్యోగవేటకు సరిపడేలా బ్లాగును తయారుచేసుకోవాలి.
* రాసే అంశంపై తగినంత సమయం కేటాయించాలి.
* అనుమతి పొందాక మాత్రమే ఇతరులు ప్రవేశించేలా రూపొందించుకోవచ్చు.
* కొత్త విషయాలను చెప్పేటపుడు జాగ్రత్త వహించాలి.
* భద్రంగా, జాగ్రత్తగా, సురక్షితంగా బ్లాగు రాయండి.
* రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచడం (షేర్‌) చేయకూడదు.
* కంపెనీలు, ఆర్గనైజేషన్లపై వ్యాఖ్యలు చేయకూడదు.
* తొందరపాటుతో దేన్నీ పోస్టు చేయకూడదు.
మంచి కెరియర్‌ కోసం చూసేవారికి చాలా బ్లాగులు అందుబాటులో ఉన్నాయి. అవి: కెరియర్‌ హబ్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ కాలేజ్‌, పెనెలోప్‌ ట్రంక్‌, ద డైలీ మ్యూజ్‌, మాషబుల్‌ జాబ్స్‌, సింప్లీ హైర్డ్‌ బ్లాగ్‌, స్పార్క్‌ హైర్‌ జాబ్‌ సీకర్‌, కెరియరియలిజం, ద అండర్‌కవర్‌ రిక్రూటర్‌, బ్రాజెన్‌ లైఫ్‌, మిస్‌. కెరియర్‌ గర్ల్‌, రెజ్యుమె బేర్‌, గెరిల్లా జాబ్‌ హంటింగ్‌ మొదలైనవి. కెరియర్‌, ఉద్యోగావకాశాలకు అవసరమైన సలహాలు, సమాచారాన్ని అందిస్తాయి.
ఫేస్‌బుక్‌
యువతకు చేరువై అత్యంత ప్రాచుర్యం పొందిన అనుసంధాన వేదికల్లో ఇది ప్రధానమైనది. వ్యక్తిగతంగానే కాకుండా ఇది వృత్తిపరమైన అనుసంధానానికి కూడా ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది.
* ఇది స్టాటస్‌ అప్‌డేట్‌ను ప్రదర్శిస్తుంది.
* అకౌంటుదారు వ్యక్తిగత బ్లాగుతో లంకె ఉంటుంది.
* లింక్‌డిన్‌, ట్విట్టర్‌ అకౌంట్లతోనూ జతచేసి ఉంటుంది.
* సమాచారం వేగంగా చేరవేయడానికి తోడ్పడే ట్యాగ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది.
* ఇది మరెన్నో ఫేస్‌బుక్‌ అప్లికేషన్లను అందిస్తోంది. అవి: Monster's Facebook app beKnown, branchOut, career Builder, InqBoo, LinkUp, Inside job, CareerFriend, salary calculator, Hire My Friend, work with us by jobvite etc. ఇవన్నీ ఉద్యోగ నియామకాలు, ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు, సంస్థ వివరాలు, తాజా ఖాళీలు, ఉద్యోగవేటలో స్నేహితులకు ఆహ్వానాలు పంపడం మొదలైనవాటికి ఉపయోగపడతాయి.
పేస్‌బుక్‌ అప్లికేషన్‌ డైరెక్టరీని సందర్శించడం ద్వారా ఈ అప్లికేషన్లలోకి ప్రవేశించవచ్చు. త్వరితంగా సరైన ఉద్యోగాన్ని వెతకడానికి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. మీరు విజయం సాధించాలనుకుంటే, ముందుగా మీరు నెట్వర్కింగ్‌లో ప్రావీణ్యం సాధించాలి. ఇది వృత్తిపరమైన కాంటాక్టులను పెంపొందించుకోవడానికీ, తగిన ఉద్యోగాన్ని వేగంగా, సులువుగా సంపాదించుకోవడానికీ అవకాశాన్ని కల్పిస్తాయి.
                        
దీని ద్వారా చాలామందితో పరిచయం చేసుకోవచ్చు. వృత్తిపరమైన అనుసంధానానికి తోడ్పడే అవకాశాలూ పెరుగుతాయి. తగిన ఉద్యోగం సంపాదించుకోవడంలోనూ ఇది సహాయపడుతుంది.
ఇది-
* మీ తాజా ప్రొఫైల్‌ను పోస్ట్‌ చేసే అవకాశం కలిగిస్తుంది.
* ఇతరుల ప్రొఫైళ్లను చూడడానికి, అనుసంధానమవడానికి సహకరిస్తుంది.
* సంస్థలను వెతకడానికి అనుమతిస్తుంది.
* అప్పటికే ఉద్యోగం చేస్తున్నవారిని పరిచయం చేయడమేకాక, వారి నుంచి సహాయాన్నీ కోరుతుంది.
* మీరు పోషించిన కీలకపాత్రల ఆధారంగా ఇతరుల ద్వారా సిఫారసులను ఇప్పిస్తుంది. అలా రిక్రూటర్‌ మీ సామర్థ్యాలను అంచనా వేసేలా సహకరిస్తుంది.
* కనెక్షన్లలో అందుబాటులో ఉన్న శీఘ్ర, నాణ్యమైన ఉద్యోగాలకు మెయిల్‌, మెసేజ్‌లు పంపే అవకాశాన్ని కల్పిస్తుంది.
* మీ బ్లాగుతో జోడించి ఉండి, మీ పోస్టులను మీ కనెక్షన్లతో అప్‌డేట్‌ చేస్తుంది.
* ట్విట్టర్‌తో కలిసి ఉండి, మీ ట్విట్టర్‌ సంభాషణలను మీ లింక్‌డిన్‌ కనెక్షన్లతో పంచుతుంది.
* స్టాటస్‌ అప్‌డేట్‌లను అందిస్తుంది.
                         
* ఇది ఒకేరకమైన ఆసక్తులున్నవారిని కలుపుతుంది.
* వివిధ సంస్థలకు జతచేస్తుంది.
* అభ్యర్థులకు ఉద్యోగావకాశాల గురించి తెలిసేలా సంస్థల యజమానులు, సంస్థలు జాబ్‌ ఓపెనింగ్స్‌ సంబంధిత విషయాలను పోస్ట్‌ చేస్తుంటారు.
* ఆన్‌లైన్‌ సీవీని పెట్టడానికి వీలు కల్పిస్తుంది.
* జాబ్‌సెర్చ్‌ టూల్స్‌, వనరులను ఉపయోగించుకోవటానికి వీలుంటుంది.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning