గుట్టలు గోతుల్లోనూ పరుగులు

* 'బ్లాక్ హాక్' పేరుతో తేలికైన బుల్లికారు

* వీఎన్ఆర్ విద్యార్థుల అద్భుత సృష్టి

హైదరాబాద్, నిజాంపేట: బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తమ మేధాసంపత్తితో తేలికైన కారును రూపొందించారు. కొండలు, గుట్టలు, ఇసుక ఏడారి, బురదలోనూ సునాయసంగా పరుగు తీయడం దీని ప్రత్యేకత. మెకానికల్ చివరి సంవత్సరం విద్యార్థులు 12మంది బృందంగా దీనిని ఆవిష్కరించారు. 3 నెలల పాటు సమష్టిగా కృషి చేసి తయారు చేశారు. ఈ కారు బరువు 500 కేజీలు మాత్రమే.


తయారీ ఇలా..

తయారీకి మారుతీ 800 కారు ఇంజిన్, గేర్ బాక్సులను ఉపయోగించారు. అంతేగాక ట్రాక్టర్ పవర్ ట్రిల్లర్ చక్రాల్ని వాడారు. మిగతా పరికరాలు, కారు ఫ్రేమ్‌ను విద్యార్థులు సొంతంగా తయారు చేశారు. ఒకరు మాత్రమే కూర్చొని నడపాలి. తయారీకి మొత్తం రూ.2.40 లక్షల వరకు ఖర్చయ్యింది. మార్కెట్‌లోకి తెస్తే కేవలం రూ. 1.5 లక్షల్లోనే తయారు చేయడానికి వీలువుతుందని జట్టు ప్రతినిధి సంఘమిత్ర 'ఈనాడుకు'కు తెలిపారు. దీనికి 'బ్లాక్ హాక్'గా నామకరణం చేశామన్నారు.దీనికి 20 లీటర్ల సామార్థ్యం కలిగిన ఇంధన ట్యాంకును అమర్చారు.

రూపకర్తలు

సంఘమిత్ర, సాయితేజ, భార్గవ్, అరవింద్, అఖిల్, నరేంద్ర, కార్తీక్, ప్రియనందన్‌వర్మ, అహ్మద్, సుహాస్, జయంత్, రఘునందన్‌రెడ్డిలు.

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning