GATE

PGECET

OUCET

CAT

MAT

CMAT

గేట్‌ ఫలితాల్లో తెలుగు వెలుగు
 • * 1, 4, 7, 15, 23 ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు
  ఈనాడు, హైదరాబాద్‌, విశాఖపట్నం: ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర విద్యాసంస్థలు అందించే ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి... బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు అగ్ర ర్యాంకులను సాధించారు. ఈ ర్యాంకుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు కూడా వీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనవరి 30, 31, ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన పరీక్షకు 8,18,850 మంది హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఐఐఎస్‌సీ మార్చి 19న ఉదయం విడుదల చేసింది. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 1000 స్కోర్‌కు లెక్కించి ర్యాంకు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.25 లక్షల మంది హాజరై ఉంటారని అంచనా..

   

  బంగారు భవితకు 'గేట్'


      
  త్యున్నతమైన విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ పీజీ, నేరుగా పీహెచ్‌డీ చేయాలంటే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) తప్పనిసరి. ఐఐటీల్లో బీటెక్‌ చేయాలనే కలలు విఫలమైనవారు మరో రూపంలో వాటిని నెరవేర్చుకునేందుకు ఇదో చక్కని మార్గం. ఉన్నత విద్యకే కాకుండా వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో మంచి జీతభత్యాలతో ఉద్యోగాలకు కూడా ఈ స్కోరు తొలిమెట్టు.
  అఖిల భారత స్థాయిలో ఏటా నిర్వహిస్తున్న గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో కలిసి తొమ్మిది ఐఐటీలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
  ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు ఉండటంతో ఏటా గేట్ రాసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గేట్‌లో మంచి ఫలితాలు సాధించడానికి విషయ పరిజ్ఞానంతో పాటు కచ్చితత్వం ఎంతో అవసరం. ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి గేట్ పరీక్షలో 65 ప్రశ్నల్ని మూడు గంటల సమయంలో పూర్తిచేయాలి. దీంతో సమాధానాలు గుర్తించడానికి విద్యార్థికి తగినంత సమయం చిక్కుతుంది. కచ్చితమైన సమాధానాన్ని గుర్తించాలంటే ప్రతి ప్రశ్నను సూక్ష్మదృష్టితో పరిశీలించాలి. ఇంజినీరింగ్ ప్రాథమిక అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వచ్చినా జనరల్ ఆప్టిట్యూడ్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది. సుమారు 15 శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచి వస్తాయి. కాబట్టి విద్యార్థులు ఆప్టిట్యూడ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.దీంతో పాటు ఇంజినీరింగ్ ప్రాథమిక అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవలి ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే విద్యార్థికి మౌలిక అంశాలపై ఎంత పట్టుందో తెలుసుకునే విధంగా ప్రశ్నల కూర్పు చేస్తున్నట్లు గమనించవచ్చు. కాబట్టి మాదిరి ప్రశ్నపత్రాల అధ్యయనంతో పాటు మౌలిక భావనలపై పట్టు సాధించే విధంగా కృషి చేయాలి. పరీక్ష తేదీకి కనీసం నాలుగు నెలల ముందు నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు. రోజూ కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకొని పరీక్ష తేదీ నాటికి అన్ని పాఠ్యాంశాలను పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నాలుగు సంవత్సరాలుగా చదివిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంచుకుంటూ నిత్యం నబిట్స్ సాధన చేస్తేనే మంచి ఫలితాలను సాధించగలుగుతారు.

 • Syllabus
 • Previous Papers
 • Important Dates
 • Structure of GATE

Industry      Interaction

Higher Education

Job Skills

Soft Skills

Comm. English

Mock Test

E-learning