'సెట్‌' చేసేద్దాం!

డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా / విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియామకం పొందాలని, పీహెచ్‌డీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు అర్హత కల్పించే పరీక్ష .. స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (SET). దీని నోటిఫికేషన్‌ విడుదలైంది. గతంలో ఏపీసెట్‌గా దీన్ని వ్యవహరించారు. ప్రస్తుతం 'సెట్‌ ఫర్‌ తెలంగాణ అండ్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్స్‌-2014'గా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరీక్షను నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయమే ప్రస్తుతం రెండు రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఉమ్మడిగానే మరోసారి ఈ పరీక్షను నిర్వహిస్తోంది. అర్హత, కటాఫ్‌ మార్కులు కూడా విడివిడిగా కాకుండా రెండు రాష్ట్రాల అభ్యర్థులందరినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. అంటే వాటి నిర్ణయంలో పాత పద్ధతినే అనుసరిస్తారు.
రెండు రాష్ట్రాల్లోనూ డిగ్రీ కళాశాల అధ్యాపకుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడుతాయన్న ఊహాగానాల దృష్ట్యా ఈసారి సెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది.
నిర్వహణ ఉద్దేశం
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా బోధనాభ్యసన స్థాయిలో ఏకీకృత ప్రమాణాలు నెలకొల్పడానికి అధ్యాపకులు/ సహాయక ఆచార్యులుగా నియమితులయేవారికి ప్రత్యేక అర్హతా పరీక్ష నిర్వహించాలని 1986 జాతీయ విద్యావిధానం స్పష్టం చేసింది. దాన్ని అనుసరించి జాతీయస్థాయిలో హ్యుమానిటీస్‌ విభాగాలకు యూజీసీ- నెట్‌, సైన్స్‌ విభాగాలకు సీఎస్‌ఐఆర్‌- నెట్‌ నిర్వహిస్తున్నారు. అయితే, అవి ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహిస్తున్నందువల్ల ప్రాంతీయభాషలో చదువుకుని తమ సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించినవారు వాటిలో అర్హత సాధించడం కష్టమైంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్రాల స్థాయిలో సెట్‌ నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చారు.
నెట్‌, సెట్‌ల అర్హతకు ప్రధాన తేడా గమనించాలి. నెట్‌లో అర్హత సాధించినవారు జాతీయస్థాయిలో ఎక్కడైనా లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా నియమితులు కావచ్చు. సెట్‌ అర్హత ఉన్నవారికి ఆయా రాష్ట్రాల్లో మాత్రమే నియమితులయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం 27 సబ్జెక్టుల్లో సెట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎడ్యుకేషన్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌లకు మాత్రమే ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. మిగతావి కేవలం ఆంగ్లమాధ్యమంలోనే జరుగుతాయి.
అర్హత: అభ్యర్థి తాను రాయదలచుకున్న సబ్జెక్టులో 55% మార్కులతో (ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూడీలకు 50% మార్కులు) యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. కానీ, వారు సెట్‌ నిర్వహించిన తేదీ నుంచి సంవత్సరంలోపు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై మార్కుల జాబితా పొందాల్సి ఉంటుంది. గరిష్ఠ వయః పరిమితి అంటూ ఏమీ లేదు.
పరీక్ష స్వరూపం: అన్ని పేపర్లలోనూ ప్రశ్నలు బహుళైచ్ఛిక రూపంలో ఉంటాయి. ప్రతి అభ్యర్థినీ మొత్తం మూడు పేపర్లలో పరీక్షిస్తారు. పేపర్‌-1 టీచింగ్‌ అండ్‌ రీసర్చ్‌ ఆప్టిట్యూడ్‌ అందరికీ కామన్‌ పేపర్‌. ఇది అందరికీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పేపర్‌-2, పేపర్‌-3లు అభ్యర్థి సబ్జెక్టుకు సంబంధించినవి.
అర్హత నిర్ణయించే విధానం
మూడు సోపానాల్లో అర్హతను నిర్ణయిస్తారు.
1. మూడు పేపర్లలోనూ నిర్ణయించిన కనీస అర్హత మార్కులు సాధించినవారితో కూడిన జాబితా తయారీ.
2. ఈ జాబితాలో నుంచి అభ్యర్థులు మూడు పేపర్లలోనూ సాధించిన మొత్తం మార్కులను ఆధారంగా చేసుకుని సబ్జెక్టు, కేటగిరీల వారీగా మెరిట్‌లిస్ట్‌ తయారీ.
3. ఈ లిస్ట్‌లోని టాప్‌ 15% (ప్రతి సబ్జెక్టు, కేటగిరీ) అభ్యర్థులకు సెట్‌ అర్హత ప్రకటిస్తారు.
ముఖ్య తేదీలు
¤ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నవంబర్‌ 8 వరకు స్వీకరిస్తారు.
¤ రూ. 100 ఆలస్యపు రుసుముతో నవంబర్‌ 15 వరకు.
¤ రూ. 200 ఆలస్యపు రుసుముతో నవంబర్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
¤ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రింట్‌ తీసుకున్న దరఖాస్తును నవంబర్‌ 24 సాయంత్రం 5 గంటల్లోగా సెట్‌ కార్యాలయంలో అందజేయాలి.
¤ సెట్‌ను జనవరి 4, 2015న నిర్వహిస్తారు.
ఫీజు, సిలబస్‌, దరఖాస్తు చేసే విధానం, ఇతర వివరాలకు www.settsap.org లేదా www.osmania.ac.in వెబ్‌సైట్లను చూడండి.
సన్నద్ధత ఏ విధంగా?
పేపర్‌-1: ఇది జనరల్‌ పేపర్‌. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే ప్రశ్నలు మాత్రం 60 ఇస్తారు. అభ్యర్థులు 50 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి 60 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే 1- 50 ప్రశ్నలను మాత్రమే మూల్యాంకనానికి పరిగణనలోకి తీసుకుంటారు. 51- 60 వరకు గల ప్రశ్నల్లో సరైన సమాధానాలు గుర్తించినా అవి అభ్యర్థి స్కోరింగ్‌ కిందకు జమ కావు.
¤ ఒకప్పుడు పేపర్‌- 2, 3లను మూల్యాంకనం చేయడానికి ఇందులో కేవలం అర్హత (40% మార్కులు) సాధిస్తే సరిపోయేది. కానీ, మారిన విధానం ప్రకారం అర్హత నిర్ణయించడంలో మూడు పేపర్లలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. కాబట్టి, పేపర్‌-1ను అశ్రద్ధ చేయకుండా మిగతా రెండింటితో సమానమైన శ్రద్ధ పెట్టాల్సిందే!
¤ గత నెట్‌/సెట్‌ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జ్ఞానాత్మక ప్రశ్నల సంఖ్య తగ్గి అవగాహన, అనువర్తిత, సామర్థ్యాలను మదింపు వేసే ప్రశ్నల సంఖ్య పెరిగింది. కాబట్టి అభ్యర్థులు బట్టీపట్టే విధానంలో చదవకుండా భావనల ఆధారంగా భిన్న దృక్కోణాల్లో ఆలోచించడం అలవరచుకోవాలి.
¤ గతంలో జరిగిన యూజీసీ- నెట్‌; వివిధ రాష్ట్రాల సెట్‌ పరీక్షల నుంచే దాదాపు 5% ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి, వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం.
¤ ఈ పేపర్‌లోని 10 యూనిట్లు వేటికవే ప్రత్యేకం. సొంతంగా మెటీరియల్‌ సేకరించుకోవడానికి సమయం, డబ్బు వృథా అవుతుంది. కాబట్టి మార్కెట్లో ప్రామాణికమైన ఒక పుస్తకాన్ని సేకరించి మిగిలిన సమయంలో పేపర్‌- 2, 3లపై దృష్టి పెట్టవచ్చు.
పేపర్‌- 2, 3...
పేపర్‌-2లో మొత్తం 100 మార్కులకుగానూ 50 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-3 మొత్తం 150 మార్కులకుగానూ 75 ప్రశ్నలు ఇస్తారు. పేపర్‌-2లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే ప్రాథమిక భావనలతోపాటు వివిధ భావనల మధ్య అంతస్సంబంధం, వాస్తవాలు, అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. పేపర్‌-3లో అభ్యర్థి అవగాహన స్థాయి, అనువర్తిత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.
పేపర్‌-2, 3 సిలబస్‌లలోని అంశాల్లో పెద్దగా వైరుధ్యం ఏమీ ఉండదు. కానీ పేపర్‌-3లోని అంశాలు పేపర్‌-2 అంశాలను విస్తరించే స్వభావంతో ఉంటాయి. అందుకే సన్నద్ధత పేపర్‌-2, 3లకు వేర్వేరుగా ఉండకూడదు. సిలబస్‌ అంశాల మౌలికాంశాల నుంచి లోతైన విషయావగాహన వరకు కొనసాగాలి.
¤ ఈ పేపర్లలో కూడా గతంలో వచ్చిన ప్రశ్నలు పునరావృతం అవుతున్నాయి. అందుకని పూర్వపు పేపర్ల అధ్యయనం మరవకూడదు.
¤ ఈ పేపర్ల సిలబస్‌లోని అంశాలు పీజీ స్థాయిలో ఉంటాయి. మెటీరియల్‌ సేకరణకు కొద్దిపాటి కష్టం తప్పదు. మొత్తం సిలబస్‌ ఏ ఒక్క సంప్రదింపు గ్రంథంలోనో దొరకదు. ఈ దిశలో అభ్యర్థులకు విశ్వవిద్యాలయ ఆచార్యుల, సీనియర్ల సలహాలూ సూచనలూ అమితంగా ఉపయోగపడతాయి.

Website

Posted on 1/11/2014Ushodaya Enterprises Private Limited 2014