జ‌స్ట్‌...ఫిజిక్స్‌లో ప‌రిశోధ‌న‌కు బెస్ట్‌

కొంద‌రికి ఫిజిక్స్ అంటే ప్రాణం. ఆ స‌బ్జెక్టులో ప‌రిశోధ‌న‌లు చేయ‌డ‌మే వారి ధ్యేయం. ఇలాంటివాళ్ల ఆస‌క్తి గ‌మ‌నించి, వాళ్ల‌ను ప్రోత్స‌హించడానికి ఏర్పాటు చేసిన ప‌రీక్షే జాయింట్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జస్ట్‌). దీనిద్వారా దేశంలో ప్ర‌సిద్ధి చెందిన 21 సంస్థ‌ల్లో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశం ల‌భిస్తుంది. ఎంపికైన‌వాళ్ల‌కు మొద‌టి రెండేళ్లు నెల‌కు రూ.16,000 అనంత‌రం రూ.18,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. అధునాత‌న ల్యాబ్ సౌక‌ర్యాలు, అనుభ‌వ‌జ్ఞులైన బోధ‌నా సిబ్బంది ఈ సంస్థ‌ల ప్ర‌త్యేక‌త‌. భ‌విష్య‌త్తులో శాస్త్ర‌వేత్త‌లు కావాల‌నుకున్న ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ల‌కు జ‌స్ట్‌కి మించిన బెస్ట్ ఆప్ష‌న్ మ‌రొక‌టి లేదు. జ‌స్ట్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నేప‌థ్యంలో ఆ ప‌రీక్ష గురించి వివ‌రంగా తెలుసుకుందాం...
అంత‌రిక్షంలోకి అడుగెట్టాల‌న్నా, అధునాత‌న టెలిస్కోప్‌లు సృష్టించాల‌న్నా, గ్ర‌హాల గ‌మ‌నాన్ని సునిశితంగా అధ్య‌య‌నం చేయాల‌న్నా, ఖ‌గోళ శాస్త్ర ర‌హ‌స్యాలు తెలుసుకోవాల‌న్నా, లేజ‌ర్‌తో కొత్త మెరుపులు సృష్టించాల‌న్నా...ఇలా అంశ‌మేదైనా దానికి భౌతిక‌శాస్త్ర‌మే మూలం. దేశాన్ని సాంకేతికంగా ముందువ‌రుస‌లో నిల‌బెట్టాలంటే ఫిజిక్సే దానికి ప్ర‌ధాన‌ ఆధారం. ఈ దిశ‌గా ఆవిర్భ‌వించిందే డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డీఏఈ). దీని ప‌రిధిలో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప‌లు సంస్థ‌లున్నాయి. విద్యార్థుల‌ను ప‌రిశోధ‌న దిశ‌గా ప్రోత్స‌హించే ల‌క్ష్యంతో వీటిని ఏర్పాటుచేశారు. ఈ సంస్థ‌ల్లో భౌతిక‌శాస్త్రానికి సంబంధించి వివిధ అంశాల్లో ప‌రిశోధ‌న‌లు చేసుకోవ‌చ్చు. ఫిజిక్స్‌, దాని అనుబంధ రంగాల‌కు సంబంధించి ప్ర‌పంచ స్థాయి సౌక‌ర్యాల‌ను వీటిలో క‌ల్పించారు.

ప్ర‌వేశం ఈ సంస్థ‌ల్లో...
సంస్థ‌: ఆర్య‌భ‌ట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అజ్వ‌ర్వేష‌న‌ల్ సైన్సెస్‌, నైనిటాల్‌, ఉత్త‌రాఖండ్‌
ప‌రిశోధ‌నాంశాలు: Astronomy and Astrophysics, and Atmospheric Physics
వెబ్‌సైట్: http://www.aries.res.in/

సంస్థ‌: హోమీ భాభా నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్, ముంబై
వెబ్‌సైట్‌: http://www.hbni.ac.in/

సంస్థ‌: హ‌రీశ్ చంద్ర రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌
ప‌రిశోధ‌నాంశాలు: Theoretical Physics, Astrophysics
వెబ్‌సైట్: http://www.hri.res.in/~physjest/index.html

సంస్థ‌: ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ థియ‌రిటిక‌ల్ సైన్సెస్ (టీఐఎఫ్ఆర్ అనుబంధ విభాగం), బెంగ‌ళూరు
ప‌రిశోధ‌నాంశాలు: Astrophysical Relativity, Data Assimilation and Dynamical Systems, Statistical Physics and Turbulence, and String theory and Quantum Gravity.
వెబ్‌సైట్‌: http://www.icts.res.in/home/

సంస్థ‌: ఇందిరా గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ అటామిక్ రీసెర్చ్ (ఐజీసీఏఆర్‌), క‌ల్ప‌క్కం
ప‌రిశోధ‌నాంశాలు: Solid State Phase transformations, Superconductivity, Structure and dynamics of soft condensed matter, Band structure studies, Accelerators based Irradiation induced phenomena, Low-dimensional systems, Physics of interfaces, Nano-materials, Thin films technology and Theoretical physics
వెబ్‌సైట్‌: http://www.igcar.gov.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌, బెంగ‌ళూరు
ప‌రిశోధ‌నాంశాలు: Astronomy and Astrophysics, Astronomical Instrumentation, Optics, and Atomic Physics.
వెబ్‌సైట్‌: http://www.iiap.res.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌, బెంగ‌ళూరు
ప‌రిశోధ‌నాంశాలు: Condensed Matter Physics (Experiments and Theory), Astronomy and Astrophysics (Theoretical), Atomic and Optical Physics (Experimental), Biocrystallography and Bio-informatics, and High Energy Physics (Theoretical).
వెబ్‌సైట్‌: http://www.iisc.ernet.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్, భోపాల్‌
ప‌రిశోధ‌నాంశాలు: Condensed Matter Physics (Theory and Experiment),
Soft Matter Physics (Theory), Biophysics, Laser Plasma Interactions, Ultrafast Physics (Experiment),
Astrophysics and Cosmology, High Energy Physics (Theory, Phenomenology and Experiment), Non-linear Optics
వెబ్‌సైట్: https://www.iiserb.ac.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్, కోల్‌క‌తా
ప‌రిశోధ‌నాంశాలు: Condensed Matter Physics, Field Theory, Classical & Quantum Gravity, Cosmology, Solar Science, High Energy Physics, Non-linear dynamics, Statistical Physics, Soft Matter, Optics & Spectroscopy, Atomic physics, Biophotonics, Spintronics, Nanoscience, NMR, Quantum Information
వెబ్‌సైట్‌: http://www.iiserkol.ac.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, మొహాలీ
పరిశోధ‌నాంశాలు: Quantum Theory, Quantum Information Processing, NMR-Methodology, Optics, Statistical Mechanics, Quantum Thermodynamics, Non-linear Dynamics, String Theory, Ultrafast Physics, and Low Temperature Mesoscopic Physics
వెబ్‌సైట్‌: http://www.iisermohali.ac.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, పుణే
ప‌రిశోధ‌నాంశాలు: Field Theory, Theoretical Particle Physics, Condensed Matter Physics, Non-linear Dynamics, Complex Systems and Networks, Nuclear Magnetic Resonance Spectroscopy, Quantum Information Processing, Radio Astrophysics, Atomic Physics and Quantum Optics, Energy Studies, Solar and Plasma Physics, Nanosciences, Scanning Probe Techniques, and Semiconductor Physics and Devices.
వెబ్‌సైట్‌: http://www.iiserpune.ac.in/

సంస్థ‌: ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, తిరువ‌నంత‌పురం
పరిశోధ‌నాంశాలు: Experimental Condensed Matter: Magnetic and Superconducting materials, Nanoscience and Energy materials, Photonics, Soft Condensed Matter, Semiconductor Physics and Devices, Surface Sciences and Nano-scale Plasmonics, Terahertz and Ultrafast Spectroscopy; Theory: Cosmology, Classical and Quantum Gravity, Gravitational Wave Physics, Quantum Information Theory, Quantum Field Theory, and Statistical Physics.
వెబ్‌సైట్‌: http://www.iisertvm.ac.in/

సంస్థ‌: ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌, చెన్నై
పరిశోధ‌నాంశాలు: Theoretical Physics, and Theoretical Computer Science
వెబ్‌సైట్‌: http://www.imsc.res.in/

సంస్థ‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్‌, భువ‌నేశ్వ‌ర్‌
ప‌రిశోధ‌నాంశాలు: Physics (Condensed Matter, Nuclear and High Energy Physics) and Accelerator-based Research.
వెబ్‌సైట్‌: http://www.iopb.res.in/indexphp.php

సంస్థ‌: ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ప్లాస్మా రీసెర్చ్‌, గాంధీన‌గ‌ర్‌
ప‌రిశోధ‌నాంశాలు: Physics (Experimental and Theoretical).
వెబ్‌సైట్‌: http://www.ipr.res.in/

సంస్థ‌: ఇంట‌ర్ యూనివ‌ర్సిటీ సెంట‌ర్ ఫ‌ర్ ఆస్ట్రాన‌మీ అండ్ ఆస్ట్రో ఫిజిక్స్‌, పుణే
పరిశోధ‌నాంశాలు: Physics, Astronomy and Astrophysics.
వెబ్‌సైట్‌: http://www.iucaa.ernet.in/

సంస్థ‌: జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌, బెంగ‌ళూరు
పరిశోధ‌నాంశాలు: Experimental and Theoretical Condensed Matter Physics, Statistical Mechanics, and Materials Science.
వెబ్‌సైట్‌: http://www.jncasr.ac.in/

సంస్థ‌: నేష‌న‌ల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంట‌ర్‌, మ‌నేస‌ర్‌
ప‌రిశోధ‌నాంశాలు: Molecular, Computaional and Systems Neuroscience. Sensory & motor systems, learning & memory, language & speech processing, functional neuroimaging: EEG, MEG, fMRI, MRS, stem cells, developmental neurobiology, neurogenetics, neurodegenerative and neurodevelopmental disorders, cancer signaling & glial tumor biology.
వెబ్‌సైట్‌: http://www.nbrc.ac.in/

సంస్థ‌: నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ రేడియో ఆస్ట్రో ఫిజిక్స్ (టీఐఎఫ్ఆర్ విభాగం), పుణే
పరిశోధ‌నాంశాలు: Astronomy and Astrophysics.
వెబ్‌సైట్: http://www.ncra.tifr.res.in/ncra

సంస్థ‌: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చ్‌, భువ‌నేశ్వ‌ర్‌
పరిశోధ‌నాంశాలు: Theoretical High Energy Physics and Lattice QCD, Experimental High Energy Physics, Condensed Matter Physics (Theory and Experiment), Optics and Metamaterials.
వెబ్‌సైట్: http://www.niser.ac.in/

సంస్థ‌: ఫిజిక‌ల్ రీసెర్చ్ ల్యాబొరేట‌రీ, అహ్మ‌దాబాద్‌
పరిశోధ‌నాంశాలు: Theoretical Physics, Astronomy and Astrophysics, Solar Physics, Space and Atmospheric Sciences, Planetary Science and Geo-Sciences.
వెబ్‌సైట్‌: http://www.prl.res.in/php/Opp/jrf_srf.php

సంస్థ‌: రాజా రామ‌న్న సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ, ఇండోర్‌
ప‌రిశోధ‌నాంశాలు: Lasers and their Applications, Laser Plasma Interaction, Cold Atom Physics, Condensed Matter Physics (Superconductivity and Magnetism, Crystals and Thin Films), Nanomaterials and Applications, Non-linear and Ultrafast Optical Studies, Beam Physics, and Free Electron Laser.
వెబ్‌సైట్‌: http://www.cat.gov.in/

సంస్థ‌: రామ‌న్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బెంగ‌ళూరు
పరిశోధ‌నాంశాలు: Astronomy and Astrophysics, Light and Matter Physics, Soft Condensed Matter Physics (Liquid Crystals, Physics in Biology), and Theoretical Physics.
వెబ్‌సైట్: http://www.rri.res.in/

సంస్థ‌: సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియ‌ర్ ఫిజిక్స్‌, కోల్‌క‌తా
పరిశోధ‌నాంశాలు: Condensed Matter Physics (Theory and Experiments), Nuclear Physics (Theory and Experiments), High Energy Physics (Theory and Experiments), Astroparticle Physics, Quantum Gravity, String Theory, Mathematical Physics, and Materials Science (Surface Science and Plasma Physics).
వెబ్‌సైట్‌: వెబ్‌సైట్‌: http://www.saha.ac.in/web/

సంస్థ‌: స‌త్యేంద్ర‌నాథ్ బోస్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బేసిక్ సైన్సెస్‌, కోల్‌క‌తా
పరిశోధ‌నాంశాలు: Astrophysics and Cosmology, Chemical and Biological Physics, Condensed Matter Physics and Material Science, High Energy Physics and Quantum Field Theory, Mathematical Physics, Nanosciences, Quantum Optics and Quantum Information, Statistical Physics, and Complex Systems.
వెబ్‌సైట్‌: http://newweb.bose.res.in/

సంస్థ‌: టీఐఎఫ్ఆర్ సెంట‌ర్ ఫ‌ర్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ సైన్సెస్‌, హైద‌రాబాద్‌
పరిశోధ‌నాంశాలు: Condensed Matter Physics & Materials Science of Nonequilibrium, Soft & Living matter, Fluid Dynamics, Intense Laser-matter interactions, Computational Physics, Statistical physics, NMR of Biophysical & other systems
వెబ్‌సైట్: http://www.tifrh.res.in/tcis//

సంస్థ‌: టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండ‌మెంట‌ల్ రీసెర్చ్‌, ముంబై
పరిశోధ‌నాంశాలు: Astronomy and Astrophysics, Condensed Matter Physics and Material Science, High Energy Physics, Nuclear and Atomic Physics, Theoretical Physics
వెబ్‌సైట్‌: http://www.tifr.res.in/

సంస్థ‌: యూజీసీ డీఏఈ క‌న్సార్టియమ్ ఫ‌ర్ సైంటిఫిక్ రీసెర్చ్‌, ఇండోర్‌
పరిశోధ‌నాంశాలు: Surfaces, Interfaces, Thin Films and Nanomaterials, Physics at Low Temperatures and High Magnetic Fields, X-ray, Optical and Electron Spectroscopic Studies Using Synchrotron and Laboratory Sources; Electrical, Magnetic and Thermal Properties of Condensed Matter; Condensed Matter studies using Magnetic Neutron Diffraction, Nuclear Technique Based Condensed Matter Physics-Positron Annihilation Spectroscopy, Mossbauer Spectroscopy, Experimental Nuclear Physics, Gamma Ray Spectroscopy of Nuclear High Spin States, and Nuclear Reactions.
వెబ్‌సైట్‌: http://www.csr.res.in/

సంస్థ‌: వేరియేబ్ల్ ఎన‌ర్జీ సైక్లోట్రాన్ సెంట‌ర్, కోల్‌క‌తా
పరిశోధ‌నాంశాలు: Accelerator Physics, Condensed Matter Physics and Materials Science, Nuclear Physics (Experiments and Theory), Relativistic Heavy Ion Collisions (Experiments, Theory, QCD and QGP), and Physics of Neutrinos (Experiments).
వెబ్‌సైట్: http://www.veccal.ernet.in/

ఇవీ అర్హ‌త‌లు:
ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ కోర్సుల‌కు: ఎమ్మెస్సీలో ఫిజిక్స్ చ‌దివుండాలి. లేదా ఫిజిక్స్ సంబంధిత విభాగాల్లో ఏదైనా పీజీ, ఎంటెక్ చ‌దివిన‌వాళ్లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కొన్ని సంస్థ‌లు బీఈ/ బీటెక్ చ‌దివిన‌వాళ్ల‌కూ అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ ఎంటెక్ పీహెచ్‌డీ: బీఎస్సీ ఫిజిక్స్. కొన్ని సంస్థ‌ల్లో డిగ్రీలో మ్యాథ్స్, ఇంజినీరింగ్ కోర్సులు చ‌దివిన‌వాళ్ల‌కూ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.
థియ‌రిటిక‌ల్ కంప్యూట‌ర్ సైన్స్‌: కంప్యూట‌ర్ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్ లేదా ఎంసీఏ చ‌దివుండాలి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ‌మెటిక‌ల్ సైన్సెస్‌లో మాత్ర‌మే ఈ కోర్సు అందుబాటులో ఉంది.
న‌్యూరోసైన్స్ లో పీహెచ్‌డీ: ఎమ్మెస్సీలో ఫిజిక్స్ లేదా మ్యాథ్స్, బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఎంసీఏ. నేష‌న‌ల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంట‌ర్ బెంగ‌ళూరులో మాత్ర‌మే ఈ కోర్సు అందుబాటులో ఉంది.

సిద్ధ‌మ‌వ్వండిలా...
జ‌స్ట్ ఫిజిక్స్ సిల‌బ‌స్ స్ప‌ష్టంగా పేర్కొన్నారు. అందులోని అంశాల ప్ర‌కారం పాఠ్యాంశాల‌ను బాగా చ‌దువుకోవాలి.

సాధార‌ణంగా జ‌స్ట్ ప్ర‌శ్న‌ప‌త్రం డిగ్రీ, పీజీలో ఫిజిక్స్ సిల‌బ‌స్‌కి అనుగుణంగా ఉంటుంది. కాబ‌ట్టి అభ్య‌ర్థులు మూడేళ్ల డిగ్రీ పుస్త‌కాల‌ను బాగా అధ్య‌య‌నం చేయాలి. మౌలికాంశాల‌కూ ప్రాధాన్యం ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ 8,9,10,11,12 త‌ర‌గ‌తుల ఫిజిక్స్ పాఠ్యాంశాల‌ను బాగా అధ్య‌య‌నం చేయాలి.
డిగ్రీలోని పాఠ్యాంశాల‌ను పూర్తిచేసిన అనంత‌రం వాటికి కొన‌సాగింపుగా ఉన్న‌ పీజీ పాఠ్యాంశాల‌ను చ‌ద‌వాలి.
జ‌స్ట్ ప్రిప‌రేష‌న్ కోసం ఐఐటీలు నిర్వ‌హించే జామ్ ఫిజిక్స్ ప్ర‌శ్న‌ప‌త్రాలు ఉప‌యోగ‌ప‌డతాయి. వీటిని సాధ‌న చేయాలి. అలాగే వివిధ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలు ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను సాధ‌న చేయ‌డమూ మంచిదే. వీటితోపాటు ఐఐటీ జేఈఈ (మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్) ఫిజిక్స్ ప్ర‌శ్న‌ల‌ను సాధ‌న చేయ‌డం ద్వారా పూర్తిస్థాయిలో ప్ర‌యోజ‌నం పొందొచ్చు.
ఇటీవ‌లి కాలంలో నిర్వ‌హించిన నెట్ ఫిజిక్స్ ప్ర‌శ్న‌ప‌త్రాల్లోని పేప‌ర్ 2, పేప‌ర్ 3ల‌ను అధ్య‌య‌నం చేయ‌డం ద్వారా జ‌స్ట్ ప‌రీక్ష‌లో లాభ‌ప‌డొచ్చు.
గ‌త ప‌రీక్ష‌ల్లో అడిగిన ప్ర‌శ్న‌లు జ‌స్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ప‌రిశీలిస్తే ప‌రీక్ష స్థాయి, ప్ర‌శ్న‌ల స‌ర‌ళి, ఏ అంశాల నుంచి ప్ర‌శ్న‌ల‌డ‌గొచ్చు...అనే విష‌యాల‌పై మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంది.

(గతంలో అడిగిన ప్ర‌శ్న‌ల కోసం క్లిక్ చేయండి)

పీహెచ్‌డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ఏ కోర్సుకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టికీ ప‌రీక్ష ఒక్క‌టే.

ఎంపికైతే లాభాలివీ...
దేశంలో ప్ర‌ముఖ సంస్థ‌ల్లో ఫిజిక్స్‌లో ప‌రిశోధ‌న‌లు చేసే అవ‌కాశం ల‌భిస్తుంది. వీటిలో చాలా సంస్థ‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ (డీఏఈ) అనుబంధ సంస్థ‌లే. ఎంపికైన‌వాళ్ల‌కు తొలి రెండేళ్లు నెల‌కు రూ.16,000 అనంత‌రం మ‌రో రెండేళ్ల‌పాటు నెల‌కు రూ.18,000 స్టైపెండ్‌గా ల‌భిస్తుంది. అవ‌స‌ర‌మైతే ఈ వ్య‌వ‌ధిని పొడిగిస్తారు. ఆ స‌మ‌యంలోనూ స్టైపెండ్ చెల్లిస్తారు. ఏడాదికి ఇంత‌ని చెప్పున పుస్త‌కాల కోసం గ్రాంట్లు ల‌భిస్తాయి. భ‌విష్య‌త్తులో ప‌రిశోధ‌న‌ల దిశ‌గా అడుగులేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. ఈ సంస్థ‌ల్లో పీహెచ్‌డీ చేసిన‌వాళ్లు ఉన్న‌త స్థాయిలో స్థిర‌ప‌డ‌డం సులువే.

ముఖ్య‌మైన తేదీలు:
ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 8, 2014
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీల‌కు రూ.150)
అడ్మిట్ కార్డులు: జ‌న‌వ‌రి 15, 2015 నుంచి జెస్ట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: ఫిబ్ర‌వ‌రి 15, 2015 (ఆదివారం)
అందుబాటులోని ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం
వెబ్‌సైట్‌: https://www.jest.org.in/

నోటిఫికేష‌న్‌:

Posted on 6/11/2014Ushodaya Enterprises Private Limited 2014