ప్రతిభావంతుల‌కు ఓఎన్‌జీసీ వెయ్యి స్కాల‌ర్‌షిప్పులు

- ఆర్థికంగా వెనుక‌బ‌డిన జ‌న‌ర‌ల్ అభ్యర్థులు, ఓబీసీల‌కు అవ‌కాశం
- అర్హత సాధించిన‌వారికి ఏడాదికి రూ.48,000 ఆర్థిక సాయం

ఉన్నత వ‌ర్గాల‌కు చెందిన ఆర్థికంగా వెనుబ‌డినవాళ్లు, ఓబీసీ విద్యార్థుల కోసం ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) వెయ్యి స్కాల‌ర్‌షిప్పుల‌ను ప్రక‌టించింది. వీటిలో 50% ప్రత్యేకంగా మ‌హిళ‌ల‌కు కేటాయించారు. మిగిలిన 500 స్కాల‌ర్‌షిప్పుల కోసం అంద‌రూ (మ‌హిళ‌లు, పురుషులు) పోటీప‌డ‌వ‌చ్చు. ఎంపికైన‌వారికి ఏడాదికి రూ.48 వేలు చొప్పున చెల్లిస్తారు. కోర్సు వ్యవ‌ధి ముగిసినంత‌వ‌ర‌కు ఈ స్కాల‌ర్‌షిప్పులు కొన‌సాగుతాయి. బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎంబీఏ, ఎమ్మెస్సీ జియోఫిజిక్స్‌, జియాల‌జీ కోర్సుల్లో ప్రథ‌మ సంవ‌త్సరం చ‌దువుతున్న విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్పుల‌కు అర్హులు. అక్టోబ‌రు 10లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం అక్టోబ‌రు 31లోగా చేరేలా అవ‌స‌ర‌మైన అన్ని ప‌త్రాలు పోస్టుద్వారా పంపాలి.

అర్హత‌లివీ...
భార‌త్‌లో చ‌దువుతున్న విద్యార్థులు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆర్థికంగా వెనుక‌బ‌డిన ఉన్నత కులాల‌కు చెందిన‌వాళ్లు, ఓబీసీ విద్యార్థులు మాత్రమే అర్హులు (ఎస్సీ, ఎస్టీల‌కు ఈ స్కాల‌ర్‌షిప్పులు వ‌ర్తించ‌వు. వారికోసం ప్రత్యేక నోటిఫికేష‌న్ ద్వారా ఓఎన్‌జీసీ 500 స్కాల‌ర్‌షిప్పులు అందిస్తోంది)

గుర్తింపు పొందిన సంస్థల్లో ఫుల్‌టైమ్ రెగ్యుల‌ర్ కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులే అర్హులు.

బ్యాచిల‌ర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్‌(బీఈ/ బీటెక్‌), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాల‌జీ/ జియోఫిజిక్స్‌/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సునైనా అభ్యసిస్తున్న ప్రథ‌మ సంవ‌త్సరం విద్యార్థులు మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇత‌ర కోర్సులు చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఈ స్కాల‌ర్‌షిప్పులు వ‌ర్తించ‌వు.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులు ఇంట‌ర్‌లో క‌నీసం 60 శాతం మార్కులు సాధిస్తేనే ఈ స్కాల‌ర్‌షిప్పులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు. అలాగే ఎమ్మెస్సీ- జియాల‌జీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో క‌నీసం 60 శాతం మార్కులు సాధించ‌డం త‌ప్పనిస‌రి.
త‌ల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 ల‌క్షల్లోపు ఉండాలి. దీన్ని దృవీక‌రిస్తూ త‌హ‌సీల్దార్ నుంచి పొందిన ప‌త్రాన్ని జ‌త‌చేయాలి.
అభ్యర్థుల వ‌యోపరిమితి సెప్టెంబ‌రు 1, 2016 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.

ద‌ర‌ఖాస్తు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ongcindia.com వెబ్‌సైట్‌లో సీఎస్ఆర్ సెక్షన్ కింద‌ క్లిక్ చేయాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: సెప్టెంబ‌రు 1
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: అక్టోబ‌రు 10
ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు పూరించిన త‌ర్వాత‌ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అనంత‌రం విద్యార్థి చ‌దువుతున్న కాలేజీ/ యూనివ‌ర్సిటీ ప్రిన్సిపాల్‌/ హెడ్‌/ డీన్ వీరిలో ఎవ‌రితోనైనా సంత‌కం చేయించాలి. అలాగే మార్కుల షీటు (ఇంట‌ర్ లేదా డిగ్రీ), ఆదాయ ధృవ‌ప‌త్రం, కుల ధృవ‌ప‌త్రం(ఓబీసీ విద్యార్థుల‌కు) , బ్యాంక్ పాస్‌బుక్ మొద‌టి పేజీ జిరాక్స్‌, క్యాన్సిల్ చెక్‌, ప్యాన్ కార్డు, ఆధార్‌కార్డు న‌క‌ళ్లు జ‌త‌చేయాలి. ప్యాన్‌, ఆధార్ లేనివాళ్లు వీటికోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. స్కాల‌ర్‌షిప్పుకు ఎంపికైతే ఈ రెండూ త‌ప్పనిస‌రి. ఈ ప‌త్రాల‌న్నీ పోస్టులో కింది చిరునామాకు పంపాలి.
క‌వ‌ర్‌పై త‌ప్పనిస‌రిగా “ONGC SCHOLARSHIP SCHEME FOR ECONOMICALLY BACKWARD GENERAL AND OBC CATEGORY STUDENTS” అని రాయాలి.
చిరునామా: Post Box No-2091, Chennai- 600 020, Tamil Nadu (INDIA)
పోస్టుద్వారా ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీ: అక్టోబ‌రు 31, 2016
వెబ్‌సైట్: www.ongcindia.com

posting on 31.08.2016

back 
© Ushodaya Enterprises Private Limited 2016