Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఇంజినీరింగ్ డిజైన్ కోర్సుల‌కు చిరునామా...సీఐటీడీ
 

* టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌..అర్హత‌ల‌తో వివిధ కోర్సులు
* నిపుణుల ప‌ర్యవేక్షణ‌లో స‌మ‌గ్ర శిక్షణ‌
* ప్రముఖ కంపెనీల‌తో ఒప్పందాలు

ఇంజినీరింగ్‌లో డిజైన్ కోర్సులు చేయాల‌నుకునేవాళ్ల చూపుల‌న్నీ. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)వైపే. ఎందుకంటే ఇక్కడ శిక్షణ‌, ప‌రిక‌రాలు రెండూ ఉన్నత ప్రమాణాల‌తో ఉంటాయి. ఈ సంస్థను భార‌త ప్రభుత్వం 1968లో హైద‌రాబాద్‌లోని బాలానగర్‌లో ఏర్పాటుచేసింది. ఐక్యరాజ్యస‌మితి జాతీయాభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), అంత‌ర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్ఓ) ఈ రెండూ సంస్థ ఏర్పాటుకు తోడ్పాటునందించాయి. తర్వాత ద‌శ‌ల‌వారీ దేశవ్యాప్తంగా మరో 17 సీఐటీడీ సంస్థలను స్థాపించారు. ప్రస్తుతం ఇక్కడ ప‌దోత‌ర‌గ‌తి మొద‌లుకుని బీటెక్ అర్హత‌తో వివిధ ర‌కాల ఇంజినీరింగ్ డిజైన్ కోర్సుల‌ను స‌మ‌గ్రంగా బోధిస్తున్నారు. విదేశీ విద్యార్థులు సైతం సీఐటీడీలో శిక్షణ పొందుతున్నారు.

కీలక పరికరాల తయారీ
దేశ రక్షణ రంగంలోని రాకెట్ల తయారీకి సంబంధించి, విమానాల్లో ఉపయోగించే పలు విడి భాగాల తయారీ ఇక్కడే జరుగుతోంది. ముడి పదార్థాన్ని వారు అందిస్తుండగా.. వారికి కావాల్సిన పరికరాలను తయారుచేసి ఇస్తున్నారు. డీఆర్‌డీఎల్‌, ఈసీఐఎల్‌, హెచ్‌ఏఎల్‌, భెల్‌ వంటి సంస్థలకు కావాల్సిన అంతర్గత పరికరాలను తయారుచేయడంలో సీఐటీడీది కీలకపాత్ర. బైపాస్‌ సర్జరీలో ఉపయోగించే హిమోక్లిప్ కూడా సీఐటీడీలో త‌యార‌వుతోంది. దీనికోసం ఓ పేరొందిన ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీపావళి మందుగుండు సామగ్రిని ఆటోమేటిగ్గా తయారుచేసే పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. శ్యాంసంగ్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంతో వారి ఉత్పత్తుల మరమ్మతులకు సంబంధించి శిక్షణ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి శ్యామ్‌సంగ్‌ సంస్థనే ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. సీఐటీడీ నిర్వహించే కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు వసతి గృహాల సౌకర్యం కూడా ఉంది.

కోర్సుల వివరాలు
- పదో తరగతి పాసైన వారికి టూల్‌, డై, మౌల్డ్‌ మేకింగ్‌(4ఏళ్లు), ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌(3ఏళ్లు), ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(3ఏళ్లు), ఆటోమేషన్‌, రొబోటిక్స్‌(3ఏళ్లు) డిప్లొమా కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు.
- ఐటీఐ చదివిన వారికి అడ్వాన్స్‌డ్‌ సీఎన్‌సీ మెషినిస్ట్‌ కోర్సు(ఏడాది) నిర్వహిస్తున్నారు.
- డిగ్రీ, డిప్లొమా చదివిన విద్యార్థుల కోసం మాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ క్యాడ్‌/క్యామ్‌(6మాసాలు), మాస్టర్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ కంప్యూటర్‌ ఎయిడెడ్‌ టూల్‌ ఇంజినీరింగ్‌(6మాసాలు) కోర్సులు నిర్వహిస్తున్నారు.
- బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు రెండేళ్ల కోర్సులు ఎంఈ క్యాడ్‌/క్యామ్‌, ఎంఈ టూల్‌ డిజైన్‌, ఎంఈ మెకట్రానిక్స్‌, ఏడాదిన్నర కోర్సులైన పీజీ టూల్‌, డై, మౌల్డ్‌ డిజైన్‌, పీజీ ఇన్‌ మెకట్రానిక్స్‌, పీజీ ఇన్‌ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబడెడ్‌ సిస్టమ్‌ తదితర కోర్సులు నిర్వహిస్తున్నారు.

వేసవిలో ఏటా ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నారు. వారం రోజుల నుంచి నెల కోర్సులో ఇందులో ఉన్నాయి. మొత్తం 14 కోర్సులను నిర్వహిస్తున్నారు. డిప్లొమా, బీఈ, బీటెక్‌ చదివిన వారి కోసం ఆటోక్యాడ్‌, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌, ప్రో-ఈ/క్రియో, కేటియ, సాలిడ్‌ వర్క్స్‌, యాన్‌సిస్‌, హైపర్‌మెష్‌, యూనీగ్రాఫిక్స్‌, డెల్‌కామ్‌, మాస్టర్‌క్యామ్‌, మెక్‌ట్రానిక్స్‌, వెరిలాగ్‌, వీహెచ్‌డీఎల్‌, మైక్రో కంట్రోలర్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏప్రిల్‌ నుంచి జులై, డిసెంబర్‌ నుంచి జనవరి వరకు ప్రతి బుధవారం కోర్సులు ప్రారంభమవుతాయి. ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. దీనికి విజ‌య‌వాడ‌లో స‌బ్ సెంట‌ర్ ఉంది. త్వరలో ఒంగోలు, విశాఖపట్నంలో రెండు కొత్త సబ్‌ సెంటర్లను ఏర్పాటుచేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

గుర్తింపు ఉంది
ఇందులో ఎంఈ, డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఎంఈ కోర్సుల‌కు ఇంజినీరింగ్ (బీఈ/ బీటెక్‌) విద్యార్థులు అర్హులు. డిప్లొమా కోర్సుల‌కు ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులు అర్హులు. ఇక్కడ నేర్పించే కోర్సుల‌కు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది. డిప్లొమా కోర్సుల‌కు ఏఐసీటీఈతోపాటు స్టేట్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ బోర్డు గుర్తింపు కూడా ఉంది.

కోర్సుల వారీ అర్హత‌లు, వ్యవ‌ధి
కోర్సు: టూల్‌, డై అండ్ మౌల్డ్ మేకింగ్‌లో డిప్లొమా
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ్యవ‌ధి: నాలుగేళ్లు
సీట్లు: 60
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ ప‌రీక్ష ద్వారా

కోర్సు: ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ (ఈసీఈ)లో డిప్లొమా
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ్యవ‌ధి: మూడేళ్లు
సీట్లు: 60
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ ప‌రీక్ష ద్వారా

కోర్సు: ప్రొడ‌క్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ్యవ‌ధి: మూడేళ్లు
సీట్లు: 60
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ ప‌రీక్ష ద్వారా

కోర్సు: ఆటోమేష‌న్ అండ్ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ్యవ‌ధి: నాలుగేళ్లు
సీట్లు: 60
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ ప‌రీక్ష ద్వారా

కోర్సు: అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మ్యాచినిస్ట్‌
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తితోపాటు ఐటీఐలో ఫిట్టర్‌/ ట‌ర్నర్‌/ మ‌్యాచినిస్ట్‌/ టూల్ అండ్ డైమేక‌ర్‌
వ్యవ‌ధి: ఏడాది
సీట్లు: నెల‌కు ఐదు మందిని చొప్పున తీసుకుంటారు. (ముందు వ‌చ్చిన‌వారికి ప్రాధాన్యం)

కోర్సు: పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్‌
అర్హత‌: డీఎంఈ/ డీపీఈ/ డీటీడీఎం వీటిలో ఏదైనా చ‌దివుండాలి.
వ్యవ‌ధి: ఏడాది
సీట్లు: 60
ఎంపిక‌: జాతీయ స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: ఎంఈ టూల్ డిజైన్ (ఉస్మానియా యూనివ‌ర్సిటీతో క‌లిసి)
అర్హత‌: బీఈ/ బీటెక్ (మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్షన్‌)
వ్యవ‌ధి: రెండేళ్లు
సీట్లు: 25
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: ఎంఈ -క్యాడ్‌/ క‌్యామ్ (ఉస్మానియాతో క‌లిసి)
అర్హత‌: బీఈ/ బీటెక్ -మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్షన్‌/ మెక‌ట్రానిక్స్‌
వ్యవ‌ధి: రెండేళ్లు
సీట్లు: 25
ఎంపిక విధానం: జాతీయ స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: ఎంటెక్-మెక‌ట్రానిక్స్ (జేఎన్‌టీయూ-హెచ్‌తో క‌లిసి)
అర్హత‌: బీఈ/ బీటెక్‌-మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్షన్‌/ ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌
వ్యవ‌ధి: రెండేళ్లు
సీట్లు: 25
ఎంపిక‌: జాతీయ స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: టూల్ డిజైన్‌లో పీజీ
అర్హత‌: బీఈ/ బీటెక్-మెకానిక‌ల్/ ప్రొడ‌క్షన్‌
వ్యవ‌ధి: 18 నెల‌లు
సీట్లు: 60
ఎంపిక‌: జాతీయ‌స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: పీజీ ఇన్ టూల్ (క్యాడ్‌/ క‌్యామ్‌) ఇంజినీరింగ్‌
అర్హత‌: బీఈ/ బీటెక్-మెకానిక‌ల్/ ప్రొడ‌క్షన్‌
వ్యవ‌ధి: 18 నెల‌లు
సీట్లు: 40
ఎంపిక‌: జాతీయ‌స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: పీజీ ఇన్ మెక‌ట్రానిక్స్‌
అర్హత‌: బీఈ/ బీటెక్-మెకానిక‌ల్/ ఈసీఈ/ ఈఐఈ/ ఆటోమేష‌న్‌
వ్యవ‌ధి: 18 నెల‌లు
సీట్లు: 40
ఎంపిక‌: జాతీయ‌స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: పీజీ ఇన్ వీఎల్ఎస్ఐ అండ్ ఎంబ‌డెడ్ సిస్టమ్స్‌
అర్హత‌: బీఈ/ బీటెక్‌- ఈసీఈ/ ఈఈఈ/ ఈఐఈ
వ్యవ‌ధి: 18 నెల‌లు
సీట్లు: 40
ఎంపిక‌: జాతీయ‌స్థాయిలో నిర్వహించే ప‌రీక్ష ద్వారా

కోర్సు: మాస్టర్ స‌ర్టిఫికెట్ ఇన్ క్యాడ్‌/ క‌్యామ్‌
అర్హత‌: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
వ్యవ‌ధి: 6 నెల‌లు
సీట్లు: 20
ఎంపిక‌: ముందుగా సంప్రదించిన‌వారిని తీసుకుంటారు
ప్రత్యేక‌త‌: కోర్సు పూర్తయిన‌వెంట‌నే ప్లేస్‌మెంట్ ల‌భిస్తుంది

కోర్సు: మాస్టర్ స‌ర్టిఫికెట్ ఇన్ కంప్యూట‌ర్ ఎయిడెడ్ టూల్ ఇంజినీరింగ్‌
అర్హత‌: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
వ్యవ‌ధి: 6 నెల‌లు
సీట్లు: 20
ఎంపిక‌: ముందుగా సంప్రదించిన‌వారిని తీసుకుంటారు
ప్రత్యేక‌త‌: కోర్సు పూర్తయిన‌వెంట‌నే ప్లేస్‌మెంట్ ల‌భిస్తుంది

కోర్సు: మాస్టర్ స‌ర్టిఫికెట్ ఇన్ మెక‌ట్రానిక్స్‌
అర్హత‌: బీఈ/ బీటెక్‌/ ఎంటెక్/ ఎమ్మెస్సీ-ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ సీఎస్ఈ/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌
వ్యవ‌ధి: 6 నెల‌లు
సీట్లు: 30
ఎంపిక‌: ముందుగా సంప్రదించిన‌వారిని తీసుకుంటారు
ప్రత్యేక‌త‌: కోర్సు పూర్తయిన‌వెంట‌నే ప్లేస్‌మెంట్ ల‌భిస్తుంది

వెబ్‌సైట్‌: www.citdindia.org


posted on 08-7-2015