Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

సైన్సెస్‌లో ప‌రిశోధ‌న‌కు సీఎస్ఐఆర్ నెట్‌

మనదేశంలో శాస్త్రీయ, సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేస్తున్న అతిపెద్ద సంస్థ సీఎస్‌ఐఆర్‌ (కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌). దీని పరిధిలో దేశం మొత్తంలో 38 జాతీయ ప్రయోగశాలలు, 80 ఫీల్డ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప‌రిశోధ‌న‌లు చేయాల‌నుకున్న‌వారికి సీఎస్ఐఆర్‌-నెట్ ద్వారా అవ‌కాశం క‌ల్పిస్తారు. ఫెలోషిప్ కి ఎంపికైన‌వారు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు సొంతం చేసుకోవ‌చ్చు. డిసెంబ‌రులో నిర్వ‌హించే సీఎస్ఐఆర్ నెట్ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ విభాగంలో పరీక్షలను నిర్వహించే సబ్జెక్టులు..
* కెమికల్‌ సైన్సెస్‌
* ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌, ప్లానిటరీ సైన్సెస్‌
* లైఫ్‌ సైన్సెస్‌
* మేథమేటికల్‌ సైన్సెస్‌
* ఫిజికల్‌ సైన్సెస్‌

పరీక్ష విధానం
లైఫ్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్ఫిరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌, మేథమేటికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌ల నుంచి అభ్యర్థి ఎంచుకున్న ఒక సబ్జెక్టు ప్రకారం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. అన్ని ప్రశ్నలూ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఈ పరీక్షలో మూడు విభాగాలు (ఎ, బి, సి) ఉంటాయి.
పార్ట్‌-ఎ: అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. ఇందులో జనరల్‌ ఆప్టిట్యూడ్‌తో కూడిన లాజికల్‌ రీజనింగ్‌, గ్రాఫికల్‌ అనాలిసిస్‌, అనలిటికల్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ కంపారిజన్‌, సిరీస్‌ ఫార్మేషన్‌, పజిల్స్‌ మొదలైనవాటికి సంబంధించిన 20 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా 15 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికీ 2 మార్కులు. ఈ విభాగానికి 30 మార్కులు కేటాయించారు.
పార్ట్‌-బి: దీనిలో అభ్యర్థుల సంబంధిత సబ్జెక్టులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. 20 నుంచి 35 ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఈ విభాగానికి 70 మార్కులు.
పార్ట్‌-సి: సైంటిఫిక్‌ కాన్సెప్టులపై అభ్యర్థికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం, అనువర్తిత ధోరణి మొదలైన అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలన్నీ అభ్యర్థి విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించేలా ఉంటాయి. ఈ విభాగానికి 100 మార్కులను కేటాయించారు.
ఈ విభాగంలోని ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. అందుకే సంబంధిత సిలబస్‌ను స్టాండర్డ్‌ రిఫరెన్స్‌ పుస్తకాలు, రిసెర్చ్‌ జర్నల్‌్్సను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి. రుణాత్మక మార్కులున్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి. వివిధ సబ్జెక్టుల్లో అడిగే ప్రశ్నల సంఖ్య, గుర్తించే సమాధానాల సంఖ్య వేరువేరుగా ఉండవచ్చు.

రిఫరెన్స్‌ పుస్తకాలు
కెమిస్ట్రీ: ఆర్గానిక్‌ కెమిస్ట్రీ: Clayden, Carey Sundberg, William Kemp, Nasi Puri, Carruthers, Smith.
ఫిజికల్‌ కెమిస్ట్రీ: W.Atkins, K.L.Kapoor, Mc.Quarie, Banwell
ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ: Huheey, Shriver & Atkins, Cotton & Wilkinson.
మ్యాథ్స్‌: కాల్‌క్యులస్‌: M.J.Strauss, H.Anton
రియల్‌ అనాలిసిస్‌: Shanti Narayan, Richard R Goldberg
డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌: Sastri SS, Collins P.J.
కాంప్లెక్స్‌ నంబర్స్‌: Murry R Spiegel
ఆల్జీబ్రా: Bhattacharya, Devid C Lay
ప్రాబబిలిటీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: C.E.Weatherban, Das Gupta, Ray & Sharma
ఫిజిక్స్‌: మెకానిక్స్‌: D S Mathur, Daniel
వేవ్స్‌ అండ్‌ ఆప్టిక్స్‌: D R Brown, N K Bajaj
ఎలక్ట్రిసిటీ అండ్‌ మాగ్నెటిజమ్‌: D C Tayal, Edward M Purcell
కైనెటిక్‌ థియరీ అండ్‌ థర్మోడైనమిక్స్‌: D John, Charles E Hecht
మోడరన్‌ ఫిజిక్స్‌: D.C. Pandey, B L Theraja
సాలిడ్‌ స్టేట్‌ ఫిజిక్స్‌: S.P. Singh, D.K.Bhattacharya
బయాలజీ: బయోకెమిస్ట్రీ: Voet & Voet, Albert Lehninger
మైక్రోబయాలజీ: Prescott
సెల్‌ బయాలజీ: Alberts, Lodish
మాలిక్యులర్‌ బయాలజీ: Weaver
ఇమ్యునాలజీ: Kuby
జెనెటిక్స్‌: Griffith, Suzuki
యానిమల్‌ ఫిజియాలజీ: Nielsen
ప్లాంట్‌ ఫిజియాలజీ: Teiz and Zeiger

స‌న్న‌ద్ధ‌త‌
లైఫ్‌ సైన్సెస్‌: బోటనీ, జువాలజీల్లో ఎంఎస్‌సీ చేసి, లైఫ్‌ సైన్స్‌ రాసే విద్యార్థులు ఆధునిక బయాలజీ (మాలిక్యులార్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమికల్‌ టెక్నిక్స్‌, బయోఫిజిక్స్‌, స్పెక్ట్రోస్కోపి) పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆధునిక బయాలజీలో పీజీ చేసినవారు తమ ఆప్షనల్‌తోపాటు క్లాసికల్‌ బయాలజీపై, ఎకాలజీ, ఎవల్యూషన్‌, బయోడైవర్సిటీ మొదలైనవి చూసుకోవాలి.
కెమికల్‌ సైన్సెస్‌: కెమికల్‌ సైన్స్‌ రాసేవారు ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో రియాక్షన్‌ మెకానిజం, స్టీరియో కెమిస్ట్రీలో ఎసెమిట్రిక్‌ సింథసిస్‌, కన్ఫర్మేషనల్‌ అనాలిసిస్‌, ఆర్గానిక్‌ స్పెక్ట్రోస్కోపి, రియేజెంట్స్‌, పెరిసైక్లిక్‌ చర్యలు, కాంతి రసాయనశాస్త్రం తదితర అంశాలనూ, ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలో సంశ్లిష్ట సమ్మేళనాలు, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ, కర్బన లోహ సమ్మేళనాలు, మెటల్‌ క్లస్టర్స్‌ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో విశ్లేషణాత్మకంగా చదవాలి.
ఫిజికల్‌ కెమిస్ట్రీలో క్వాంటమ్‌ కెమిస్ట్రీ, సాలిడ్‌స్టేట్‌, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపి, స్టాటిస్టికల్‌ థర్మోడైనమిక్స్‌, కెమికల్‌ కైనెటిక్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ మొదలైన అంశాలను అనువర్తిత ధోరణిలో అధ్యయనం చేయాలి.
ఫిజికల్‌ సైన్సెస్‌: ఫిజికల్‌ సైన్స్‌ రాసేవారు మోడరన్‌ ఫిజిక్స్‌, న్యూక్లియర్‌, పార్టికల్‌ ఫిజిక్స్‌, హీట్‌, థర్మోడైనమిక్స్‌ (క్లాసికల్‌, స్టాటిస్టికల్‌), ఎలక్ట్రోమాగ్నటిక్‌ థియరీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎక్స్‌పరిమెంటల్‌ మెథడ్స్‌, ఆప్టిక్స్‌, మెకానిక్స్‌ సబ్జెక్టులను విపులంగా చదవాలి.
మేథమేటికల్‌ సైన్సెస్‌: మేథమేటిక్స్‌లో స్టాటిస్టిక్స్‌, ఎక్స్‌పోలేటరీ డేటా అనాలిసిస్‌, కాంప్లెక్స్‌, డిఫరెన్షియల్‌ అనాలిసిస్‌, మ్యాట్రిక్స్‌, డెరివేటివ్స్‌, వెక్టర్‌, త్రికోణమితి, జామెట్రీ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా చదవాలి.
మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఇవి http:/sirhrdg.res.in/AnswerKeys.html లో లభిస్తాయి.

స్టైపెండ్‌
సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికై, పరిశోధన చేసేవారికి మొదటి రెండు సంవత్సరాలు ప్రతి నెల రూ.25,000 చొప్పున స్టైపెండ్‌ ఇస్తారు. ఏటా రూ.20,000 చొప్పున పరిశోధన చేసే సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి కంటిన్‌జెంట్‌ గ్రాంటు కింద అభ్యర్థికి ఇస్తారు. ఆ తరువాత ఎస్‌ఆర్‌ఎఫ్‌ అర్హత సాధించినవారికి ప్రతి నెల రూ.28,000 చొప్పున (ఎస్‌ఆర్‌ఎఫ్‌ కింద) స్టైపెండ్‌ ఇస్తారు. దీంతోపాటు ఉచితంగా వ‌స‌తి క‌ల్పించ‌డం లేదా 30 శాతం హెచ్ఆర్ఏ చెల్లించ‌డం జ‌రుగుతుంది. జేఆర్ ఎఫ్‌, లెక్చ‌ర్‌షిప్ కు ఎంపికైన‌వాళ్లు డిగ్రీ క‌ళాశాల‌ల్లో లెక్చ‌ర‌ర్‌, విశ్వ‌విద్యాల‌యాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు దేశ‌వ్యాప్తంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మిగిలిన ప‌రీక్ష‌ల‌కూ ఉప‌యోగం
ఒకవేళ సీఎస్‌ఐఆర్‌లో జేఆర్‌ఎఫ్‌ రాకపోయినప్పటికీ సన్నద్ధత వృథా కాదు. అదే సిలబస్‌, సన్నద్ధతతో ఇతర పోటీపరీక్షలైన ఐఐఎస్‌సీ, ఐఐటీ, టీఐఎఫ్‌ఆర్‌, జేఎన్‌సీఎస్‌ఐఆర్‌, బార్క్‌, హెచ్‌సీయూ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, ఏపీసెట్‌, టీఎస్‌సెట్‌, డీఎల్‌, పేటెంట్‌ ఆఫీసర్‌, జెన్‌కో, డీఆర్‌డీఓ, ఎన్‌ఎఫ్‌ఎల్‌యూపీఎస్‌సీ, జెస్ట్‌, వివిధ విశ్వవిద్యాలయాల పీహెచ్‌డీ ప్రవేశపరీక్షలు మొదలైనవాటిలో, ఇంటర్వ్యూల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.
అర్హత: ఎంఎస్‌సీ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌స్సీ లేదా బీఈ / బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఫార్మ‌సీ త‌దిత‌ర కోర్సుల్లో 55% మార్కులతో ఉత్తీర్ణులైన జనరల్‌, ఓబీసీ విద్యార్థులూ 50% మార్కులతో ఉత్తీర్ణులైన ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌ విద్యార్థులూ ఈ పరీక్షకు అర్హులు. తుది సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.
వ‌య‌సు: జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించడానికి జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు గరిష్ఠ వయసు పరిమితి జులై 1, 2018 నాటికి 28 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, పీహెచ్‌, మహిళా విద్యార్థులకు వయసులో అయిదేళ్ల సడలింపు ఉంది. నాన్‌ క్రీమిలేయర్‌ ఓబీసీ విద్యార్థులకు మూడేళ్ల సడలింపు ఉంది. లెక్చరర్‌షిప్‌ (ఎల్‌ఎస్‌) కు ఏ వ‌య‌సువారైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
పరీక్ష ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.1000, ఓబీసీ- నాన్‌ క్రీమిలేయర్‌కు రూ.500, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీహెచ్‌/ వీహెచ్‌ కేటగిరీకి రూ.250.
పరీక్ష తేదీ: 16.12.2018 ( లైఫ్ సైన్సెస్‌, ఫిజిక‌ల్ సైన్సెస్ విభాగాల‌కు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మూడు గంటల పాటు; మిగిలిన విభాగాల‌కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుంది)
ప‌రీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 27 కేంద్రాల్లో నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, హైదరాబాద్‌లో ప‌రీక్ష రాసుకోవ‌చ్చు.
ఫ‌లితాలు: మార్చి / ఏప్రిల్ లో వెలువ‌డ‌తాయి.
ఫెలోషిప్: జులై నుంచి మొద‌ల‌వుతుంది. అప్ప‌టి నుంచి రెండేళ్ల వ‌ర‌కు చెల్లుబాట‌వుతుంది. ఈ వ్య‌వ‌ధిలోపు ఏదైనా సంస్థ‌లో ప‌రిశోధ‌న‌లో చేరాలి.
వెబ్‌సైట్‌: www.csirhrdg.res.in
బ్రోచ‌ర్‌

posted on 20-09-2018