ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

తాజా వార్తలు

మే 11 నుంచి అట‌వీశాఖ ఉద్యోగాల రాత ప‌రీక్ష
అట‌వీశాఖ ఉద్యోగాల‌కు మే 11 నుంచి రాత ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. రాత ప‌రీక్ష ద్వారా అట‌వీ శాఖ‌లోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల‌ భ‌ర్తీ చేయ‌నున్నారు. మే 11న ప్రారంభ‌మ‌య్యే ప‌రీక్షలు మే 25 వ‌ర‌కు జ‌రగ‌నున్నాయి. మే 11న అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, 12న‌ బంగ్లావాచర్, 13న థానేదార్, 14న టెక్నికల్ అసిస్టెంట్, 18న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప‌రీక్షలు జ‌రగ‌నున్నాయి. ఎన్నికల కోడ్ అమ‌ల్లో ఉండ‌టంతో మే 11 నుంచి రాతపరీక్షలను నిర్వహించాలని అటవీశాఖ నిర్ణయించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెబ్‌సైట్‌లో ఉంచ‌నున్నారు. అట‌వీ శాఖలోని మొత్తం 2167 ఉద్యోగాల‌కు దాదాపు 3.15 ల‌క్షల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప‌రీక్షల నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ చేపట్టనుంది.
ఉద్యోగ వివ‌రాలు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ - 151, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ - 751, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ - 1224, థానేదార్ - 16, బంగ్లావాచర్ - 11, టెక్నికల్ అసిస్టెంట్ - 14.

back