ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఉద్యోగాల పరీక్ష స్పెషల్

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 2167 ఖాళీలు

         ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ (ఏపీఎఫ్‌డీ) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, థానేదార్, బంగ్లావాచర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........
1) ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్: 151
అర్హతలు: బోటనీ/ ఫారెస్ట్రీ/ హార్టికల్చర్/ జువాలజీ/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ మ్యాథ్‌మెటిక్స్/ స్టాటిస్టిక్స్/ జియాలజీ/ అగ్రికల్చర్ డిగ్రీ లేదా మెకానికల్/ సివిల్/ కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉండాలి.
2) ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: 751
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
3) అసిస్టెంట్ బీట్ ఆఫీసర్: 1224
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
4) థానేదార్: 16
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
5) బంగ్లావాచర్: 11
అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 163 సెం.మీ., ఛాతీ 79 నుంచి 84 సెం.మీ. ఉండాలి. మహిళల ఎత్తు 150 సెం.మీ. ఉండాలి.
6) టెక్నికల్ అసిస్టెంట్: 14
అర్హతలు: పదో తరగతి, సివిల్ ట్రేడ్‌లో డ్రాఫ్ట్స్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి
వయసు: 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ మెజర్‌మెంట్స్, రాత పరీక్ష, వాకింగ్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. పేపర్- 1 వ్యాస రచన 20 మార్కులు, పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 100 మార్కులు, పేపర్-3 జనరల్ మ్యాథ్‌మెటిక్స్ 100 మార్కులు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్-1 100 మార్కులు. ఇందులో సివిల్ ట్రేడ్‌కు సంబంధించిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, లఘ సమాధాన ప్రశ్నలు, ఖాళీలను పూరించే ప్రశ్నలు ఉంటాయి. పేపర్-2 జనరల్ నాలెడ్జ్ 50 మార్కులు, పేపర్-3 జనరల్ మ్యాథ్‌మెటిక్స్ 50 మార్కులు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.300 చెల్లించాలి.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 17
చివరితేది: మార్చి 1o

back